కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేనెందుకు కోసుకుంటాను?

నేనెందుకు కోసుకుంటాను?

 కోసుకోవడం అంటే ఏంటి?

 ఏదైనా పదునైన వస్తువుతో బలవంతంగా హాని చేసుకోవడాన్ని కోసుకోవడం అంటారు. తమకుతాము హాని-చేసుకోవడంలో ఇదొక పద్ధతి. కాల్చుకోవడం, గాయం చేసుకోవడం, వాళ్లంతట వాళ్లే కొట్టుకోవడం లాంటి ఇంకొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ ఆర్టికల్‌ కోసుకోవడం గురించి మాట్లాడుతున్నా, ఇందులో చెప్పిన విషయాలు మిగతా వాటికి కూడా వర్తిస్తాయి.

 మీకు ఎంతవరకు తెలుసో చూసుకోండి: అవును/కాదు.

  1.   కేవలం అమ్మాయిలే కోసుకుంటారు.

  2.   కోసుకుంటే “మీ దేహమును చీరుకొనకూడదు” అని లేవీయకాండము 19:28 లో బైబిలు చెప్పిన మాటలు మీరినట్లు అవుతుంది.

 సరైన జవాబులు:

  1.   కాదు. ఈ సమస్య అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించినా, కొంతమంది అబ్బాయిలు కూడా కోసుకోవడం లేదా మరో విధంగా తమనుతాము గాయపర్చుకోవడం లాంటివి చేస్తుంటారు.

  2.   కాదు. లేవీయకాండము 19:28 ఒక ప్రాచీనకాల అన్యమత ఆచారం గురించి చెప్తుందే గానీ ఈ ఆర్టికల్లో చర్చిస్తున్నట్లు తమకుతాము హాని చేసుకోవడం గురించి కాదు. అయితే, మన ప్రేమగల సృష్టికర్త మనకి మనం హాని చేసుకోవాలని ఖచ్ఛితంగా కోరుకోడు.—1 కొరింథీయులు 6:12; 2 కొరింథీయులు 7:1; 1 యోహాను 4:8.

 ప్రజలు ఎందుకలా చేస్తుంటారు?

 మీకు ఎంతవరకు తెలుసో చూసుకోండి: ఇందులో ఏ వాక్యం సరైనదని మీరు అనుకుంటున్నారు?

 ప్రజలు ఎందుకు కోసుకుంటారంటే . . .

  1.   మానసికంగా వాళ్లు అనుభవించే బాధతో పోరాడడానికి.

  2.   చనిపోవడానికి.

 సరైన జవాబు: ఎ. నిజానికి అలా కోసుకునే చాలామంది చనిపోవాలని అనుకోరు. వాళ్లకు మానసికంగా ఉన్న బాధను తగ్గించుకోవడానికే అలా చేస్తారు.

 ఇలా కోసుకునే అలవాటున్న కొంతమంది యౌవనులు దాని గురించి ఏం చెప్తున్నారో గమనించండి:

 సీల్‌యా : “అలా కోసుకున్నప్పుడు నాకు హాయిగా అనిపించేది.”

 టమారా : “మనసులోని బాధను తప్పించుకోవడానికి అదొక ప్రయత్నం. శరీరానికి కలిగే బాధ మనసుకు కలిగే బాధకంటే ఎంతో నయం.”

 క్యారీ : “దిగులు పడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నా దృష్టిని బాధపెట్టే ఆలోచనల మీద నుండి, నా శరీరానికి కలిగే బాధవైపుకు మరల్చుకోవడానికి నేను కోసుకుంటాను.”

 జరీన్‌: “నేను కోసుకున్న ప్రతీసారి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలిసేదికాదు. ఇక నేను నా సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా ఉంటే నాకు బాగుంటుంది.”

 మీకూ ఇలాంటి సమస్య ఉంటే మీరు దాన్నెలా పరిష్కరించుకోవచ్చు?

 ఈ బాధనుండి కోలుకునేందుకు యెహోవా దేవునికి ప్రార్థించడం ఒక మంచి పద్ధతి. బైబిలు ఇలా చెప్తుంది, “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”​—1 పేతురు 5:7.

 సలహా: చిన్నచిన్న ప్రార్థనలతో ప్రారంభించండి. బహుశా యెహోవాని “నాకు సహాయం కావాలి” అని అడిగినా సరే, సమయం గడిచేకొద్దీ మెల్లమెల్లగా మనసువిప్పి మీ భావాలన్నిటినీ ‘సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని’ ముందు మీరే కుమ్మరించగలుగుతారు.—2 కొరింథీయులు 1:3, 4.

 ప్రార్థన అంటే కేవలం మనశ్శాంతి కోసం చేసే పని కాదు. అది “నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” అని మాటిస్తున్న మీ పరలోకపు తండ్రితో నిజంగా మాట్లాడడం.—యెషయా 41:9, 10.

 కోసుకునే అలవాటుతో బాధపడుతున్న చాలామంది వాళ్ల అమ్మ లేదా నాన్నతో, మరెవరైనా నమ్మకమైన పెద్దవాళ్లతో మాట్లాడి ఉపశమనం పొందారు. అలా చేసిన ముగ్గురు యౌవనులు చెప్పే మాటలు గమనించండి:

 ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి

  • మీరు ఎవరినైనా సహాయం అడగాలి అనుకున్నప్పుడు, ఎవరి మీద ఆధారపడవచ్చు?

  • మీ సమస్య గురించి ప్రార్థనలో యెహోవా దేవునికి ఏమి చెప్పవచ్చు?

  • మీ ఒత్తిడిని, ఆందోవనను పోగొట్టుకోవడానికి (మీకు మీరు హాని చేసుకోని) ఏవైనా రెండు మార్గాలు చెప్పగలరా?