కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

పూర్తిగా అలసిపోయే ప్రమాదం నుండి నన్ను ఎలా కాపాడుకోవచ్చు?

పూర్తిగా అలసిపోయే ప్రమాదం నుండి నన్ను ఎలా కాపాడుకోవచ్చు?

 పూర్తిగా అలసిపోతున్నారా? అయితే మీకు ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది!

 ఎందుకలా జరుగుతుంది?

  •   తలకుమించిన భారం. 21 సంవత్సరాల జూలీ ఇలా అంటోంది: “జీవితంలోని అన్ని రంగాల్లో మంచిగా పని చేస్తూ, మమ్మల్ని మేము మెరుగుపర్చుకుంటూ, ఉన్నత లక్ష్యాలు పెట్టుకుంటూ, మంచి ఫలితాలు సాధిస్తూ ఉండాలనీ మాకు చెప్తూ ఉంటారు. ఇలా ఎప్పుడూ ఒత్తిడి చేస్తుంటే కష్టంగా ఉంటుంది!”

  •   టెక్నాలజీ. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇతర పరికరాల వల్ల మనం 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటాం. దానివల్ల మనం ఒత్తిడికి గురై, కొంతకాలానికి పూర్తిగా అలసిపోతాం.

  •   నిద్ర లేమి. 24 సంవత్సరాల మరాండ ఇలా చెప్తోంది, “స్కూలు, పని, ఉల్లాస కార్యక్రమాలు వీటి వల్ల చాలామంది యౌవనస్థులు తొందరగా లేస్తున్నారు, ఆలస్యంగా పడుకుంటున్నారు. ఇది ప్రమాదకరమైనప్పటికీ వాళ్లు ఏమి చేయలేకపోతున్నారు.” కాబట్టి ప్రజలు దీనివల్ల కూడా పూర్తిగా అలసిపోతున్నారు.

 ఎందుకు అది ప్రాముఖ్యం?

 బైబిలు కష్టపడి పనిచేసేవాళ్లను మెచ్చుకుంటుంది. (సామెతలు 6:​6-8; రోమీయులు 12:⁠11) కానీ శక్తికి మించి అంటే ఏం జరిగినా సరే ఆఖరికి ఆరోగ్యం పాడౌతున్నా సరే కష్టపడి పనిచేయమని బైబిలు ఎవ్వరికీ చెప్పట్లేదు.

 25 సంవత్సరాల అష్లీ ఇలా అంటోంది, “ఒకసారి ఏమైందంటే, నాకు అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేయాలనే ధ్యాసలో పడి ఒక రోజంతా నేనేమి తినలేదని ఎప్పుడుకో గుర్తొచ్చింది. కానీ, నా ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ప్రతీ పనిని చేస్తానని ఒప్పుకోవడం అంత మంచిది కాదని తర్వాత్తర్వాత నాకర్థమైంది.”

 మంచి కారణంతోనే బైబిలు ఇలా చెప్తోంది, “చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు.” (ప్రసంగి 9:⁠4) మీ శక్తినంతటిని కూడగట్టుకొని బలవంతంగా పని చేయాలనుకున్నప్పుడు ఆ కాసేపు మీకు సింహంలాంటి బలం ఉందనీ అనిపించవచ్చు. కానీ మీరు పూర్తిగా అలసిపోవడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

 మీరేమి చేయాలి?

  •   చేయలేను అని చెప్పడం నేర్చుకోండి. బైబిలు ఇలా చెప్తోంది, “వినయముగలవారియొద్ద [అణకువగలవారియొద్ద, NW] జ్ఞానమున్నది.” (సామెతలు 11:⁠2) అణకువ ఉన్నవాళ్లకు వాళ్ల పరిమితులేంటో తెలుసు. కాబట్టి వాళ్లు తమ శక్తికి మించిన పనుల్ని ఒప్పుకోరు.

     24 సంవత్సరాల జోర్డన్‌ ఇలా అంటున్నాడు,“చేయలేను అని చెప్పకుండా ఇచ్చిన ప్రతీ పనిని ఒప్పుకునే వ్యక్తి ఎక్కువగా అలసిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వ్యక్తి అణకువ చూపిస్తున్నట్లుకాదు. అంతేకాదు కొంతకాలానికి అలాంటివాళ్లు పూర్తిగా అలసిపోతారు.”

  •   తగిన విశ్రాంతి తీసుకోండి. బైబిలు ఇలా చెప్తోంది, “శ్రమయును గాలికైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మది [విశ్రాంతి, NW] కలిగియుండుట మేలు.” (ప్రసంగి 4:⁠6) నిద్రను “మెదడుకు ఆహారం” అని పిలుస్తారు. యౌవనులు రాత్రిపూట ఎనిమిది నుండి పది గంటలైనా నిద్రపోవాలి. కానీ చాలామంది యౌవనులు అలా చేయట్లేదు.

     19 సంవత్సరాల బ్రూక్లిన్‌ ఇలా అంటోంది: “నా షెడ్యూల్‌ బాగా బిజీగా ఉన్నప్పుడు, ఆ రోజు నిద్ర కూడా మానుకునేదాన్ని. కానీ ఒక్కోసారి ఆ తర్వాతి రోజు బాగా పనిచేయడానికి, సంతోషంగా ఉండడానికి నేను త్యాగం చేసిన ఆ సమయమే నాకు అవసరమయ్యేది.”

  •   పనుల్ని క్రమపద్ధతిలో చేయండి. బైబిలు ఇలా చెప్తోంది, “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు.” (సామెతలు 21:⁠5) మీ సమయాన్ని, మీ పనుల్ని చక్కగా బ్యాలెన్స్‌ చేసుకోవడం కూడా ఒక కళే. ఆ కళ మీకు జీవితాంతం చక్కగా ఉపయోగపడుతుంది.

     22 సంవత్సరాల వనెస ఇలా అంటోంది, “మీరు చక్కగా షెడ్యూల్‌ వేసుకోవడం వల్ల, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మీరు పూర్తిగా అలసిపోకుండా ఉండడానికి ఎక్కడెక్కడ మార్పులు చేసుకుంటే బాగుంటుందో సులభంగా గుర్తించగలుగుతారు.”