సామెతలు 18:1-24

  • వేరుగా ఉండేవాడు స్వార్థపరుడు, తెలివితక్కువవాడు (1)

  • యెహోవా పేరు బలమైన బురుజు (10)

  • డబ్బు ఇచ్చే భద్రత భ్రమ (11)

  • ఇరు పక్షాల వాదన వినడం తెలివైన పని (17)

  • సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు (24)

18  తనను తాను వేరు చేసుకునేవాడు తన స్వార్థ కోరికల్ని అనుసరిస్తున్నాడు;అతను తెలివి* అంతటినీ తిరస్కరిస్తున్నాడు.*   మూర్ఖుడికి అవగాహన అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు;తన హృదయంలో ఉన్నది బయటికి చెప్పడమే అతనికి ఇష్టం.+   దుష్టుడు వచ్చినప్పుడు తిరస్కారం కూడా వస్తుంది,అవమానంతో పాటు తలవంపులు కూడా వస్తాయి.+   మనిషి నోటి మాటలు లోతైన నీళ్ల లాంటివి.+ తెలివి అనే ఊట ఉబుకుతూ వాగులా ప్రవహిస్తుంది.   దుష్టుడి పట్ల పక్షపాతం చూపించడం,నీతిమంతుడికి న్యాయం చేయకపోవడం+ మంచిదికాదు.+   మూర్ఖుడి మాటలు గొడవలకు దారితీస్తాయి,+అతని నోరు దెబ్బల్ని ఆహ్వానిస్తుంది.+   మూర్ఖుడి నోరు అతన్ని నాశనం చేస్తుంది,+అతని పెదాలు అతని ప్రాణానికి ఉరి లాంటివి.   లేనిపోనివి కల్పించి చెప్పేవాడి మాటలు రుచికరమైన ఆహారం ముద్దల* లాంటివి;+అవి నేరుగా కడుపు లోపలికి వెళ్లిపోతాయి.   బద్దకంగా పనిచేసేవాడునాశనం చేసేవాడికి సహోదరుడు.+ 10  యెహోవా పేరు బలమైన బురుజు.+ నీతిమంతుడు దానిలోకి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు.*+ 11  ధనవంతుడి ఆస్తి అతనికి ప్రాకారాలుగల నగరం లాంటిది;అతని ఊహలో అది సురక్షితమైన ప్రాకారం లాంటిది.+ 12  నాశనానికి ముందు మనిషి హృదయం గర్విస్తుంది,+ఘనతకు ముందు వినయం ఉంటుంది.+ 13  వాస్తవాలు వినకముందే ఒక విషయం గురించి మాట్లాడడం తెలివితక్కువతనం,దానివల్ల అవమానాలపాలు అవుతారు.+ 14  మనోబలంతో మనిషి తన అనారోగ్యాన్ని సహించగలుగుతాడు,+నలిగిన మనస్సును* భరించడం ఎవరికి సాధ్యం?+ 15  అవగాహన గలవాడి హృదయం జ్ఞానాన్ని సంపాదిస్తుంది,+తెలివిగలవాడి చెవి జ్ఞానం కోసం వెతుకుతుంది. 16  మనిషి ఇచ్చే బహుమతి అతనికి మార్గం తెరుస్తుంది;+అది గొప్పవాళ్లను కలుసుకునే అవకాశాన్ని అతనికి ఇస్తుంది. 17  వ్యాజ్యంలో మొదట మాట్లాడే వ్యక్తి చెప్పేది సరైనదిగా కనిపిస్తుంది,+అయితే రెండో వ్యక్తి వచ్చి అతన్ని ప్రశ్నించినప్పుడు* నిజాలు బయటికొస్తాయి.+ 18  చీట్లు వేయడం వల్ల గొడవలు ఆగిపోతాయి,+అలా, బలమైన ప్రత్యర్థుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయి. 19  ప్రాకారాలుగల నగరాన్ని జయించడం కన్నా నొచ్చుకున్న సహోదరుణ్ణి శాంతపర్చడం కష్టం,+కోట ద్వారాల అడ్డగడియల లాంటి తగాదాలు కూడా ఉన్నాయి.+ 20  మాటల* ఫలం వల్ల మనిషి కడుపు నిండుతుంది;+తన పెదాల పంట వల్ల అతను తృప్తి పొందుతాడు. 21  జీవమరణాలు నాలుక అధీనంలో ఉన్నాయి;+దాన్ని ఉపయోగించడానికి ఇష్టపడేవాళ్లు దాని ఫలం తింటారు.+ 22  మంచి భార్యను పొందినవాడు అమూల్యమైనదాన్ని పొందాడు,+అతను యెహోవా అనుగ్రహం పొందుతాడు.+ 23  పేదవాడు దీనంగా వేడుకుంటాడు,ధనవంతుడు కఠినంగా జవాబిస్తాడు. 24  ఒకరినొకరు నాశనం చేసుకోవాలని చూసే సహవాసులు ఉన్నారు,+సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు కూడా ఉన్నాడు.+

అధస్సూచీలు

లేదా “ఆచరణాత్మక తెలివి.”
లేదా “హీనంగా చూస్తున్నాడు.”
లేదా “ఆత్రంగా మింగేసే ఆహారపదార్థాల.”
అక్ష., “పైకి ఎత్తబడతాడు.” అంటే అందకుండా, సురక్షితంగా ఉంటాడు.
లేదా “పూర్తి నిరాశను.”
లేదా “లోతుగా పరిశోధించినప్పుడు.”
అక్ష., “నోటి.”