కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

వర్జినిటీ ప్లెడ్జ్‌లు మనం చేయాలా?

వర్జినిటీ ప్లెడ్జ్‌లు మనం చేయాలా?

 వర్జినిటీ ప్లెడ్జ్‌ అంటే ఏమిటి?

 పెళ్లయ్యేంత వరకు సెక్స్‌ జోలికి వెళ్లనని రాతపూర్వకంగా లేదా మాటపూర్వకంగా ప్రామిస్‌ చేయడాన్నే వర్జినిటీ ప్లెడ్జ్‌ (వర్జిన్‌గా ఉంటాననే ప్రతిజ్ఞ) అంటారు.

 యునైటెడ్‌ స్టేట్స్‌లోని సదరన్‌ బాప్టిస్ట్‌ కన్వెన్షన్‌, 1990లలో “ట్రూ లవ్‌ వెయిట్స్‌” (నిజమైన ప్రేమ వేచివుంటుంది) అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించినప్పుడు వర్జినిటీ ప్లెడ్జ్‌లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనడాన్ని నిరాకరించేలా యువతను ప్రోత్సహించడానికి ఆ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

 బైబిలు ప్రమాణాలను, మంచి పనులు చేసేలా తోటివాళ్ల నుండి వచ్చే ఒత్తిడిని కలగలిపి తయారుచేసిందే ఆ ప్రోగ్రామ్‌.

 వర్జినిటీ ప్లెడ్జ్‌ల వల్ల ఉపయోగముందా?

  ఈ ప్రశ్నకు జవాబు, మీరు అడిగేవాళ్లను బట్టి ఉంటుంది.

  •   క్రిస్టీ సి కిమ్‌, రాబర్ట్‌ రెక్టర్‌ అనే పరిశోధకులు ఏమంటున్నారంటే, “టీనేజర్లు సెక్సువల్‌ యాక్టివిటీస్‌ని తగ్గించడం లేదా వాయిదా వేయడం అనే విషయానికీ ఎదిగే వయసున్న టీనేజర్లు వర్జినిటీ ప్లెడ్జ్‌లు చేయడానికీ సంబంధముందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.”

  •   గుట్‌మాకర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, “వర్జినిటీ ప్లెడ్జ్‌లు చేయని టీనేజర్లు సెక్స్‌లో ఎంత పాల్గొంటున్నారో, ఆ ప్లెడ్జ్‌ చేసిన టీనేజర్లు కూడా అంతే పాల్గొంటున్నారు” అని అధ్యయనాలు చూపిస్తున్నాయి.

 ఫలితాలు ఎందుకు తేడాగా ఉన్నాయి?

  •   ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని, చేయని వ్యక్తిని పోలుస్తూ కొన్ని అధ్యయనాలు నిర్వహించారు, అయితే సెక్స్‌ విషయంలో వేర్వేరు నమ్మకాలున్న వాళ్ల మీద వాటిని నిర్వహించారు.

  •   రెండవ రకం అధ్యయనాలు ఏమి వెల్లడించాయి?

 ఎదిగే పిల్లల ఆరోగ్య విషయాల్లో స్పెషలిస్ట్‌ అయిన డాక్టర్‌ జనెట్‌ రోజెన్‌బామ్‌ ఏమి చెప్తున్నారంటే, ఐదేళ్ల తర్వాత “సెక్స్‌ విషయంలో, ప్రతిజ్ఞ చేసినవాళ్ల ప్రవర్తనకూ చేయనివాళ్ల ప్రవర్తనకూ ఏ మాత్రం తేడా లేదు.”

 మరింత మంచి పద్ధతి

  వర్జినిటీ ప్లెడ్జ్‌ ప్రోగ్రామ్‌ల లక్ష్యం గొప్పదే. కానీ సమస్యేంటంటే, వాటిలో ప్రామిస్‌ చేసేవాళ్లు దాన్ని నిలబెట్టుకోవడానికి విలువల గురించి ఆలోచించడం అంత ముఖ్యం కాదు. వర్జిన్‌లుగా ఉండిపోతామని ప్రామిస్‌ చేసినవాళ్లు “ప్రతిజ్ఞను నిజంగా తమ మనసుల్లో నాటుకోవట్లేదు” అని డాక్టర్‌ రోజెన్‌బామ్‌ అంటున్నారు. “ఒక వ్యక్తి నిగ్రహం పాటించాలంటే, అతనిలో దృఢ నిశ్చయం ఉండాలి. అది ప్రోగ్రామ్‌లో పాల్గొనడం వల్ల వచ్చేది కాదు” అని కూడా ఆమె అన్నారు.

 బైబిలు అలాంటి దృఢ నిశ్చయాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే బైబిలు, రాతపూర్వకంగా లేదా మాటపూర్వకంగా ప్రతిజ్ఞ చేయమనడం లేదుగానీ “మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు” కలిగివుండడం ద్వారా అలాంటి దృఢ నిశ్చయాన్ని పెట్టుకోమని ప్రోత్సహిస్తోంది. (హెబ్రీయులు 5:14) అయినా, వర్జినిటీని కాపాడుకోవడం, కేవలం రోగాలు లేదా గర్భం తెచ్చుకోకుండా ఉండడానికి సంబంధించినది మాత్రమే కాదు. వివాహ ఏర్పాటు చేసిన దేవుణ్ణి గౌరవించడానికి అదొక మంచి మార్గం.—మత్తయి 5:19; 19:4-6.

 దేవుడు మన మంచికోసమే బైబిల్లోని ప్రమాణాలను పెట్టాడు. (యెషయా 48:17) ‘లైంగిక పాపాలకు దూరంగా పారిపోండి’ అనే ఆజ్ఞ అందులో ఒకటి. దాన్ని పాటించాలనే దృఢ నిశ్చయాన్ని ప్రతి ఒక్కరూ బలపర్చుకోవాలి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ అలా తప్పకుండా చేయగలరు. (1 కొరింథీయులు 6:18) అలా చేస్తే, వాళ్లు పెళ్లి చేసుకున్నప్పుడు, తమ దాంపత్య బంధాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయగలుగుతారు. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్న చాలామంది ఎదుర్కొనే ఆందోళన గానీ, పశ్చాత్తాపం గానీ వాళ్లకు ఉండవు.