కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

సరదా కోసం సరసాలాడడం తప్పా?

సరదా కోసం సరసాలాడడం తప్పా?

 సరసాలాడడం అంటే ఏమిటి?

 ఒక అమ్మాయిపై లేదా అబ్బాయిపై ఉన్న ఇష్టాన్ని మాటల ద్వారా, చేతల ద్వారా తెలియజేయడమే సరసాలాడడం అని కొందరు అనుకుంటారు. అలా తెలియజేయడం తప్పా? మీ ఇష్టాన్ని తెలపడం తప్పు కాదు. ఆన్‌ అనే యువతి ఇలా అంటోంది, “మీకు తగిన వయసు ఉండి, ఎవరినైనా ఇష్టపడుతుంటే దాన్ని తెలియజేయడం తప్పు కాదు. చెప్పకపోతే మీరు ఇష్టపడుతున్నారని అవతలి వ్యక్తికి ఎలా తెలుస్తుంది.”

 అయితే, సరసాలాడడం వచ్చే ప్రమాదాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అంటే మనసులో నిజంగా ఇష్టంలేకపోయినా, పైకి మాత్రం ఇష్టమున్నట్లు ప్రవర్తించడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో పరిశీలిస్తాం.

 “చిరకాల అనుబంధాన్ని ఏర్పర్చుకోవాలనే ఉద్దేశంతో ఒకరిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం సరైనదే. కానీ ఆటపట్టించడం కోసం ప్రేమ ఉన్నట్లు నటించి, ఆ తర్వాత అలాంటి ఉద్దేశమే లేదన్నట్లు ప్రవర్తించడం మాత్రం చాలా తప్పు.”—డయానా.

 కొంతమంది ఎందుకు సరసాలాడతారు?

 కొంతమంది తమ అహాన్ని తృప్తిపర్చుకోవడం కోసమే సరసాలాడతారు. హేలీ అనే అమ్మాయి ఇలా అంటోంది: “మీరు ఎదుటివాళ్లను ఆకర్షించగలరని అనిపిస్తే, ఇంకా ఎక్కువమందిని మీవైపు తిప్పుకోవాలని అనిపిస్తుంది.”

 మీకు నిజంగా ఎదుటివ్యక్తిపై ప్రేమ లేకపోయినా, కావాలని వాళ్లతో చనువుగా ప్రవర్తిస్తే వాళ్ల ఫీలింగ్స్‌ అంటే మీకు లెక్కలేనట్లే. మీకు సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేదని కూడా తెలుస్తుంది. బైబిలు ఇలా అంటుంది: “బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము.”—సామెతలు 15:21.

 అయితే హేలీ చివరిగా సరైన మాట చెప్తోంది: “సరసాలాడడం మొదట్లో తప్పు అనిపించదు, కానీ చివరికి ఘోరమైన పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది.”

 సరసాలాడడం వల్ల వచ్చే ప్రమాదాలేంటి?

  •   సరసాలాడడం వల్ల మీ పేరు పాడవుతుంది.

     “సరసాలాడే అమ్మాయి ఆత్మవిశ్వాసం లేని వ్యక్తిగా, పరిణతిలేనిదానిగా పేరు తెచ్చుకుంటుంది. ఆమెకు నిజంగా మీపై ఇష్టం లేకపోయినా, మీ నుండి ఏదో ఆశిస్తోంది కాబట్టే అలా ప్రవర్తిస్తోందనే భావన మీలో కలుగుతుంది.”—జెరెమీ.

     బైబిలు ఇలా చెప్తోంది: “ప్రేమ … స్వార్థం చూసుకోదు.”—1 కొరింథీయులు 13:4, 5.

     దీని గురించి ఆలోచించండి: ఎలాంటి మాటలు, ప్రవర్తన వల్ల సరసాలాడే వ్యక్తిగా మీకు పేరు రావచ్చు?

  •   సరసాలాడడం వల్ల ఎదుటివ్యక్తి చాలా బాధపడతాడు.

     “సరసాలాడే వ్యక్తి ఎవరైనా ఎదురుపడితే, అతని చుట్టుపక్కల ఉండకూడదని నాకనిపిస్తుంది. నేను అమ్మాయిని అనే ఒకే ఒక్క కారణంతో అతను నాతో మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. సరసాలాడేవాళ్లకు నిజంగా నా మీద శ్రద్ధ ఉండదు; వాళ్లకు కేవలం వాళ్ల సంతోషమే ముఖ్యం.”—జాకలిన్‌

     బైబిలు ఇలా చెప్తోంది: “ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచించాలి.”—1 కొరింథీయులు 10:24.

     దీని గురించి ఆలోచించండి: ఎవరైనా మీ మీద నిజంగా ప్రేమ లేకపోయినా, పైకి మాత్రం ప్రేమిస్తున్నట్లు నటించారా? నిజం తెలిశాక మీకెలా అనిపించింది? మీ వల్ల వేరేవాళ్లకు అలాంటి బాధ కలగకూడదంటే మీరేమి చేయాలి?

  •   సరసాలాడడం వల్ల నిజమైన ప్రేమను ఎప్పటికీ పొందలేరు.

     “సరసాలాడే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనిగానీ, కనీసం డేటింగ్‌ చేయాలనిగానీ ఎవ్వరూ అనుకోరు. ఇష్టం ఉన్నట్టు నటించేవాళ్లను ఎలా అర్థంచేసుకోగలను? అలాంటివాళ్లను ఎలా నమ్మగలను? అది జరగని పని.”—ఒలీవియ.

     కీర్తనకర్త దావీదు బైబిల్లో ఇలా రాశాడు: “వేషధారులతో పొందుచేయను.”—కీర్తన 26:4.

     దీని గురించి ఆలోచించండి: సరసాలాడేవాళ్లను ఎలాంటి వ్యక్తులు ఇష్టపడతారు? అలాంటి వ్యక్తుల్ని మీరు ఇష్టపడతారా?