కంటెంట్‌కు వెళ్లు

స్కూలు అంటేనే నచ్చకపోతే?

స్కూలు అంటేనే నచ్చకపోతే?

అప్పుడు ఏం చెయ్యాలో చూడండి

 చదువు గురించి సరైన ఆలోచన. మీరు చదువుతున్న పుస్తకాల వల్ల ఏ ప్రయోజనం లేదనిపిస్తే కనీసం, ఇప్పుడు అసలు వాటివల్ల ఏం లాభం లేదు అనిపిస్తుంటే దీని గురించి కొన్ని విషయాలు ఆలోచించండి. మీరు చదివే ప్రతీ సబ్జెక్ట్‌ రకరకాల అంశాల గురించి, మన చుట్టూ లోకం ఎలా ఉందనే దాని గురించి నేర్పిస్తుంది. అప్పుడు మీకు ‘అందరికి అన్నివిధముల వారు అయ్యేలా’ రకరకాల ప్రజలతో మాట్లాడే సామర్థ్యం పెరుగుతుంది. (1 కొరింథీయులు 9:22) అన్నిటికంటే ముఖ్యంగా, మీరు పెద్దవాళ్లు అయ్యేకొద్ది చక్కని ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. ఇది చాలా అవసరం. స్కూలు చదువు, అడవిలో ముందుకు వెళ్లేలా అడ్డుగా ఉన్న చెట్లను నరుకుతున్నట్లు అనిపించవచ్చు—కాని సరైన పనిముట్లుంటే ఈ రెండూ సులభమే

స్కూలు చదువు, అడవిలో ముందుకు వెళ్లేలా అడ్డుగా ఉన్న చెట్లను నరుకుతున్నట్లు అనిపించవచ్చు—కాని సరైన పనిముట్లుంటే ఈ రెండూ సులభమే

 మీ టీచర్‌ గురించి సరైన ఆలోచన. ఒకవేళ మీ టీచర్‌ నేర్పించే విధానం మీకు బోరు కొడితే, మీ దృష్టి టీచర్‌ మీద కాకుండా తను చెప్పే విషయం మీద పెట్టండి. మీకు చెప్పే లెసన్‌లు మీ టీచర్‌ వేరే విద్యార్థులకు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటారని గుర్తుచేసుకోండి. కాబట్టి మొదట్లో ఆ సబ్జెక్ట్‌ వివరిస్తున్నప్పుడు ఉన్న ఉత్సాహం, టీచర్‌కి ఎప్పుడూ ఉండడం నిజంగా సవాలే.

 సలహా: చెప్పేవి రాసుకోండి, ఏదన్నా ఎక్కువ తెలుసుకోవాలంటే గౌరవపూర్వకంగా అడగండి, నేర్చుకునే సబ్జెక్ట్‌ మీద ఉత్సాహం చూపించండి. ఎందుకంటే మీ ఉత్సాహం ఇతరులను కూడా ఉత్సాహపరుస్తుంది.

 మీ సామర్థ్యాల గురించి సరైన ఆలోచన. స్కూల్‌కి వెళ్లడంవల్ల మీకు తెలియకుండానే మీలో ఉండే సామర్థ్యం బయటపడుతుంది. పౌలు తిమోతికి రాస్తూ: “నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెను” అని అన్నాడు. (2 తిమోతి 1:6) ఇక్కడ పరిశుద్ధాత్మకు సంబంధించిన వరం తిమోతికి ఇవ్వబడిందని అర్థమౌతుంది. కాని ఆ “వరం” అభివృద్ధి చెందేలా తిమోతి కృషి చెయ్యాలి లేకపోతే అది పనికిరాకుండా నిర్జీవంగా అయ్యే అవకాశం ఉంది. అయితే స్కూల్లో మీరు వృద్ధి చేసుకోవాల్సిన సామర్థ్యాలను దేవుడు మీమీద సూటిగా ఏమి కుమ్మరించడు. మీలో, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. స్కూల్లో మీకున్న, మీకు తెలియని, ప్రత్యేక సామర్థ్యాలు గుర్తించి వాటికి చక్కని శిక్షణ ఇచ్చి వృద్ధి చేస్తారు.