కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

మీడియా చూపించేవాటిని ఎందుకు అనుసరించకూడదు?—1వ భాగం: అమ్మాయిల కోసం

మీడియా చూపించేవాటిని ఎందుకు అనుసరించకూడదు?—1వ భాగం: అమ్మాయిల కోసం

 మీడియా ఏమి చూపిస్తుంది?

 ఈ పదాలను గమనించి, కింది ఉన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

1వ వరుస

2వ వరుస

వయసుకు తగ్గ తెలివి లేనివాళ్లు

బాధ్యతగలవాళ్లు

ఎదురుతిరిగే వాళ్లు

రూల్స్‌ పాటించేవాళ్లు

తప్పుడు పనులు చేసేవాళ్లు

మంచివాళ్లు

తెలివిలేనివాళ్లు

తెలివైనవాళ్లు

ఇతరుల గురించి ఉన్నదీ లేనిదీ కల్పించి మాట్లాడుకునేవాళ్లు

బుద్ధిమంతులు

మోసం చేసేవాళ్లు

నిజాయితీ పరులు

  1.   సాధారణంగా సినిమాల్లో, టీవీల్లో, పత్రికల్లో చూపించే అమ్మాయిలకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

  2.   పైన ఇచ్చిన వాటిలో మీరు ఎలాంటి అమ్మాయిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు?

 బహుశా మొదటి ప్రశ్నకు మీ జవాబు మొదటి వరుస నుండి, రెండో ప్రశ్నకు జవాబు రెండవ వరుస నుండి వచ్చి ఉంటుంది. అలాగైతే, సాధారణంగా టీవీలో చూపించే అమ్మాయిలకంటే మంచిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారని అర్థం. అలా అనుకుంటున్నది మీరు ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. ఎందుకో చూడండి.

 “సినిమాల్లో అమ్మాయిల్ని ఎదురుతిరిగే వాళ్లగా, గర్విష్ఠులుగా చూపిస్తారు. అసలు అమ్మాయిల్ని నమ్మలేమని, వాళ్ల గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ, చిన్నచిన్న విషయాల్ని పెద్దవిగా చేసి నాటకాలు ఆడుతుంటారని చూపిస్తారు.”—ఎరిన్‌.

 “టీనేజీ అమ్మాయిలు అందరి దృష్టిని ఆకర్షించేందుకు పరితపిస్తారనీ, ఎలా కనిపించాలి? ఏ బట్టలు వేసుకోవాలి? అందరికంటే ఎలా గొప్పగా ఉండాలి? అనే విషయాల గురించి, అబ్బాయిల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనీ సినిమాల్లో, టీవీల్లో వాళ్ల గురించి చూపిస్తారు.”—నటలీ.

 “సరదాగా ఉండే అమ్మాయి అంటే బాగా తాగుతూ, అబ్బాయిలతో సెక్స్‌లో పాల్గొంటూ, తల్లిదండ్రులకు ఎదురు తిరిగుతూ ఉంటుందనే ఎక్కువగా చూస్తాము. అలా లేని అమ్మాయికి మత చాదస్తం ఉన్నట్టుగానో లేక, అసలు కోరికలే లేని సన్యాసిగానో చూపిస్తారు.”—మారియ.

 ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను వేసుకునే బట్టలు, నా ప్రవర్తన, నా మాటలు నేనేంటో చూపిస్తున్నాయా? లేదా టీవీల్లో సినిమాల్లో చూపించే వాళ్లను అనుకరిస్తున్నట్టు ఉన్నాయా?’

 మీరు తెలుసుకోవాల్సినవి

  •   మేము ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాం అనుకునే చాలామంది కేవలం మీడియాలో చూపించేవాటిని కాపీ కొడుతున్నారంతే. కెరె అనే అమ్మాయి ఇలా చెప్తుంది “మా చిన్న చెల్లి అలానే చేస్తుంది. తను వేసుకునే బట్టలు, అబ్బాయిల గురించి తప్ప తనింక దేని గురించీ పట్టించుకోనట్టు ప్రవర్తిస్తుంది. చాలా తెలివైంది. తనకు వేరే విషయాలు మీద కూడా ఆశక్తి ఉందిని నాకు తెలుసు కానీ వాటి గురించి ఎప్పుడూ మాట్లాడదు. ఎందుకంటే తను కూడా ‘మిగతా అమ్మాయిల్లాగే’ కనిపించాలనుకుంటుంది. ఆమెకు ఇంకా 12 సంవత్సరాలే!”

     బైబిలు ఇలా చెప్తుంది: “ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి.”—రోమీయులు 12:2(పరిశుద్ధ బైబిల్‌: ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌).

  •   టీవీ, సినిమాల్లో చూపిస్తున్నట్లే అందరు అమ్మాయిలూ ఉండాలనుకోవట్లేదు. 15 ఏళ్ల అలెక్సీస్‌ ఇలా అంటుంది “సినిమాల్లో, టీవీల్లో అమ్మాయిలు వాళ్ల గురించి వాళ్ల సమస్యల గురించే ఆలోచిస్తారు, ఇష్టం వచ్చినట్లు పద్ధతి లేకుండా ఉంటారు, తెలివి లేకుండా ప్రవర్తిస్తారు. కానీ నిజ జీవితంలో చాలామంది అమ్మాయిలకి ఏది మంచో ఏది చెడో తెలుసు. ఒక అందమైన అబ్బాయి గురించి పగటి కలలు కనడం కన్నా ముఖ్యమైన పనులు మన జీవితంలో చాలానే ఉన్నాయి.”

     బైబిలు ఇలా చెప్తుంది: “వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు.”—హెబ్రీయులు 5:14.

  •   టీవీల్లో, సినిమాల్లో చూపించే విషయాలు అమ్మేవాళ్లను సంతృప్తి పరుస్తున్నాయి, టీనేజీ అమ్మాయిలను కాదు. అది ఎంత లాభకరంగా ఉందో గుర్తించిన ప్రచురణ, ఫ్యాషన్‌, టెక్నాలజీ, వినోదం లాంటి పెద్దపెద్ద వ్యాపార సంస్థలు, 13 ఏళ్లు కూడా రాని పిల్లల్ని గురిగా పెట్టుకోవడం మొదలుపెట్టారు. 12 గోయిం ఆ 29 అనే పుస్తకం ఇలా చెప్తుంది “కొత్త బట్టలు, నగలు, మేకప్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు లేకపోతే వాళ్లను ఎవ్వరూ పట్టించుకోరని ప్రకటనలు చూపించేవాళ్లు ట్వీన్స్‌ (10 నుండి 13 వయసున్న పిల్లలు) ప్రోత్సహిస్తున్నారు. సెస్కి సంబంధించిన విషయాలను అర్థం చేసుకునే వయసు రాకముందే వాళ్లలో కోరికలను రెచ్చగొట్టే చిత్రాలను వాళ్లకు చూపిస్తూ ఉన్నారు.”

     బైబిలు ఇలా చెప్తుంది: “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.”—1 యోహాను 2:16.

 ఆలోచించండి: ఇప్పటి ఫ్యాషన్‌ అనిపించే బాగా పేరున్న డిజైనర్‌ బట్టలు కొనుక్కోవడం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? మీ వయసువాళ్ల మధ్య గొప్పగా కనిపించడానికి కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్‌ కొనుక్కుంటే ఎవరికి లాభం? వ్యాపారం చేసేవాళ్లు ఎవరు బాగుండాలని కోరుకుంటారు? మీరా లేక వాళ్లా?

 మీరిలా చేయవచ్చు

  •   మీడియా ప్రోత్సహించేవాటిని ప్రశ్నించడం నేర్చుకోండి. మీరు ఎదిగేకొద్దీ, మీ కంటికి కనిపించే వాటిని పైపైన చూడడమే కాదు వాటి గురించి జాగ్రత్తగా ఆలోచించే సామర్థ్యం మీకు పెరుగుతుంది. మీడియా చూపించే విషయాలు మీమీద ఎలాంటి ప్రభావం చూపించగలవో జ్ఞానయుక్తంగా ఆలోచించండి. “సాధారణంగా టీనేజీ అమ్మాయి అంటే తక్కువ బట్టలు ఎక్కువ మేకప్‌ వేసుకోవాలని మీడియా చెప్తుంది. నిజానికి అలా ఉంటే వాళ్లు అందంగా కాదు కోరికలతో ఉన్నట్లు కనబడతారని వాళ్లు గుర్తించట్లేదు” అని 14 ఏళ్ల ఆలానా అంటుంది.

  •   మీరు ఎలాంటి వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారో వాటి కోసం కృషిచేయండి. ఉదాహరణకు ఈ ఆర్టికల్‌ మొదట్లో మీరు ఎలాంటి వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారో మాట్లాడుకున్నాం కదా! ఆ లక్షణాలను మరోసారి గుర్తు చేసుకోండి. వాటిని అలవర్చుకోవడానికి లేక మరింత వృద్ధి చేసుకోవడానికి కృషి చేయడం ఇప్పుడే మొదలుపెట్టండి. బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును” ధరించుకోండి గానీ ప్రకటనల్లో చూపించే విధంగా కాదు.—కొలొస్సయులు 3:10.

  •   మంచి స్పూర్తినిచ్చే వాళ్ల కోసం చూడండి. అలాంటి వాళ్లు ఎవరైనా మీ కుటుంబంలో ఉండి ఉండొచ్చు. ఉదాహరణకు మీ అమ్మ లేదా ఆంటీ లాంటి వాళ్లు. ఇంకా మీ స్నేహితురాళ్లు లేక పరిచయమున్న ఇతర వ్యక్తులు కూడా అయ్యుండవచ్చు. యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘంలో అలాంటి ఆదర్శవంతులైన చాలామంది ఆడవాళ్లు ఉన్నారు. వాళ్ల నుంచి కూడా మీరు చక్కగా ప్రయోజనం పొందవచ్చు.—తీతు 2:3-5.

 సలహా: రూతు, హన్నా, అబీగయీలు, ఎస్తేరు, మరియ, మార్త లాంటి అనేక మంది గొప్ప ఆదర్శవంతులైన స్త్రీలు బైబిల్లో ఉన్నారు. వాళ్లలా విశ్వాసం చూపించండి అనే పుస్తకం సహాయంతో వాళ్ల గురించి నేర్చుకోండి. వాళ్లలా విశ్వాసం చూపించండి అనే ఈ పుస్తకాన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు. ఇది www.pr418.com వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది.