కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నా ఫ్రెండ్‌ నన్ను బాధపెడితే నేనేమి చేయాలి?

నా ఫ్రెండ్‌ నన్ను బాధపెడితే నేనేమి చేయాలి?

 మీరు ఏమి తెలుసుకోవాలి?

  •   మానవ సంబంధాల్లో సమస్యలు రావడం సహజం. మీ మంచి ఫ్రెండ్‌ ఆఖరికి మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ అయినాసరే, అతను అపరిపూర్ణుడు కాబట్టి తన మాటల ద్వారా, చేతల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. మీరు కూడా అపరిపూర్ణులే. కాబట్టి నిజం చెప్పాలంటే, మీవల్ల కూడా ఇతరులు బాధపడిన సందర్భాలు ఉండేవుంటాయి.​—యాకోబు 3:2.

  •   ఇంటర్నెట్‌ కారణంగా మీకు బాధ కలగవచ్చు. ఉదాహరణకు, డేవిడ్‌ అనే యౌవనస్థుడు ఇలా చెప్తున్నాడు: “మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు, మీ ఫ్రెండ్స్‌ అందరూ ఒక పార్టీలో దిగిన ఫోటోల్ని చూశారు. మిమ్మల్ని ఎందుకు పిలవలేదని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్లు మిమ్మల్ని మోసం చేశారని అనుకుంటూ, బాధపడడం మొదలుపెట్టారు.”

  •   మీ సమస్యను ఎలా పరిష్కరించాలో నేర్చుకోండి.

 మీరేమి చేయాలి?

 మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘త్వరగా కోపం తెచ్చుకోకు, ఎందుకంటే అది తెలివితక్కువవాళ్లకు గుర్తు.’​—ప్రసంగి 7:9, NW , అధస్సూచి.

 24 ఏళ్ల యలిసా ఇలా చెప్తుంది: “కొన్నిసార్లు, మీరు ఏ విషయం గురించైతే బాధపడుతున్నారో అదేమంత పెద్ద విషయం కాదని తర్వాత తెలుసుకుంటారు.”

 ఆలోచించండి: మీరు అతిగా ఆలోచిస్తున్నారా? ఇతరుల అపరిపూర్ణతల్ని మరింతగా సహించడం నేర్చుకోగలరా?​—ప్రసంగి 7:21, 22.

 క్షమించడం వల్ల వచ్చే లాభాల గురించి ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది: “తప్పులు క్షమించుట . . . ఘనతనిచ్చును.”​—సామెతలు 19:11.

 23 ఏళ్ల మాలరీ ఇలా చెప్తొంది: “ఇతరులు మీ విషయంలో తప్పు చేసినప్పటికీ వాళ్లను మనస్ఫూర్తిగా క్షమించడం మంచిది. దానర్థం, వాళ్ల తప్పును పదేపదే గుర్తుచేసి, అలా గుర్తుచేసిన ప్రతీసారి వాళ్లు మిమ్మల్ని క్షమాపణ అడిగేలా చేయడం కాదు. మీరు ఒక్కసారి క్షమించాక, మళ్లీ దాని గురించి ఎత్తకండి.”

 ఆలోచించండి: పరిస్థితి మరీ అంత గంభీరమైనదా? శాంతిగా ఉండడం కోసం మీరు ఎదుటి వ్యక్తిని క్షమించగలరా?​—కొలొస్సయులు 3:13.

ఫ్రెండ్‌షిప్‌లో ప్రతీ సమస్యను పట్టించుకోవడం, చలికాలంలో మాటిమాటికి తలుపు తెరిచి వెచ్చగా ఉన్న గదిలోకి చల్లని గాలిని పంపించినట్లు ఉంటుంది

 ఇతరుల గురించి కూడా ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”​—ఫిలిప్పీయులు 2:4.

 20 ఏళ్ల నీకోల్‌ ఇలా చెప్తుంది: “ఫ్రెండ్‌షిప్‌లో ప్రేమ, గౌరవం ఉంటే సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోవడానికి ఒక బలమైన కారణం ఉంటుంది. అదేంటంటే మీరు ఇప్పటికే ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చించి ఈ బంధాన్ని ఏర్పర్చుకున్నారు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలని కోరుకోరు.”

 ఆలోచించండి: ఇతరుల ఆలోచనలో ఉన్న కాస్త మంచినైనా మీరు చూడగలరా?​—ఫిలిప్పీయులు 2:3.

 ఒక్కమాటలో: అపార్థాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడం కూడా ఒక నైపుణ్యమే. ఆ నైపుణ్యం మీకుంటే, మీరు పెద్దవాళ్లయ్యాకా అది బాగా సహాయపడతుంది. మరీ ఇప్పుడే ఆ నైపుణ్యాన్ని ఎందుకు నేర్చుకోకూడదు?