కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను మా అమ్మానాన్నలతో స్నేహంగా ఉండాలంటే ఏమి చేయాలి?

నేను మా అమ్మానాన్నలతో స్నేహంగా ఉండాలంటే ఏమి చేయాలి?

 గొడవలు గురించి క్విజ్‌

  •   సాధారణంగా మీకు ఎక్కువ గొడవలు ఎవరితో అవుతుంటాయి?

    •  నాన్నతో

    •  అమ్మతో

  •   వాళ్లతో ఎన్నిసార్లు గొడవపడుతుంటారు?

    •  ఎప్పుడో ఒకసారి

    •  అప్పుడప్పుడూ

    •  మాటిమాటికి

  •   ఆ గొడవ ఎంత పెద్దగా ఉంటుంది?

    •  త్వరగా సద్దుమణిగి మళ్లీ ప్రశాంతంగా ఉంటాం.

    •  బాగా వాదించుకున్న తర్వాతగానీ గొడవ ఆగదు.

    •  బాగా వాదించుకున్న తర్వాత కూడా గొడవ ఆగదు.

 ఒకవేళ మీ అమ్మానాన్నలతో స్నేహంగా ఉండడం మీకు కష్టమనిపిస్తుంటే, పరిస్థితిని చక్కబెట్టడం కోసం వాళ్లు ఏదైనా చేస్తే బాగుంటుందని మీకు అనిపించవచ్చు. అయితే గొడవలను తగ్గించడానికి మీరు చేయగల కొన్ని పనుల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. ముందు దీని గురించి ఆలోచించండి  . . .

 అసలు గొడవ ఎందుకు వస్తుంది?

  •   ఆలోచించే సామర్థ్యం. మీరు పెరిగి పెద్దవాళ్లు అవుతున్న కొద్దీ, మీరు చిన్నతనంలో ఆలోచించిన దానికన్నా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు మీరు కొన్ని విషయాల గురించి ఓ అభిప్రాయానికి కూడా వచ్చేస్తారు. కొన్నిసార్లు ఆ విషయంలో మీ అభిప్రాయానికి, మీ తల్లిదండ్రుల అభిప్రాయానికి చాలా తేడా ఉండవచ్చు. కానీ బైబిలు ఏం చెప్తుందంటే, “నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.”—నిర్గమకాండం 20:12.

     నిజమేంటంటే: చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఏదైనా విషయం నచ్చలేదని చెప్పడానికి మెచ్యూరిటీ, నైపుణ్యం అవసరం.

  •   స్వేచ్ఛ. మీకు జ్ఞానం పెరిగే కొద్దీ, మీ అమ్మానాన్నలు మీకు మరింత స్వేచ్ఛను ఇస్తారు. కాకపోతే, అది మీరు కోరుకున్నంత కాకపోవచ్చు లేదా మీరు కోరుకున్న వెంటనే దొరక్కపోవచ్చు. దానివల్ల మీకూ మీ అమ్మానాన్నలకూ మధ్య గొడవ అవ్వచ్చు. కానీ “మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి” అని బైబిలు చెప్తుంది.—ఎఫెసీయులు 6:1.

     నిజమేంటంటే: మీకు ఇప్పటికే ఉన్న స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నారనే దానిమీదే, ఇకమీదట మీ అమ్మానాన్నలు మీకు ఎంత స్వేచ్ఛ ఇస్తారనేది ఆధారపడి ఉంటుంది.

 మీరేమి చేయవచ్చు?

  •   మీరేమి చేయవచ్చో దానిపై మనసుపెట్టండి. గొడవ అంతా అమ్మానాన్నల వల్లే అయ్యిందని తప్పు వాళ్లమీదకు నెట్టేసే బదులు, గొడవలు జరగకుండా ఉండడానికి మీరేమి చేయవచ్చో ఆలోచించండి. “ప్రతీసారి, మీ అమ్మానాన్నలు అనే మాటల వల్లే కాదు, వాటికి మీరెలా స్పందిస్తున్నారు అనే దానిబట్టే గొడవ అవుతుంది” అని జెఫ్రీ అనే ఓ యువకుడు అంటున్నాడు. “మెల్లగా మాట్లాడడం వల్ల చాలా గొడవలు సద్దుమణుగుతాయి.”

     బైబిలు ఇలా చెప్తోంది: “మీ చేతనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.”—రోమీయులు 12:18.

  •   వినండి. “నాకు అన్నిటికన్నా కష్టమైన పని ఇదే” అని 17 ఏళ్ల సమంతా ఒప్పుకుంటోంది. “కానీ మీరు వింటున్నారని మీ అమ్మానాన్నలు గమనించినప్పుడు వాళ్లు కూడా మీరు చెప్పేది వినే అవకాశాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను” అని కూడా ఆ అమ్మాయి అంటోంది.

     బైబిలు ఇలా చెప్తోంది: ‘వినుటకు వేగిరపడువారిగా, మాటలాడుటకు నిదానించువారిగా ఉండండి.’—యాకోబు 1:19.

    గొడవలు మంటలు లాంటివి. వాటిని ఆపేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది

  •   మీ అందరిదీ ఒకటే జట్టు అనుకోండి. గొడవను ఓ టెన్నిస్‌ మ్యాచ్‌ లాంటి దానిలా చూడండి. కాకపోతే నెట్‌ అవతల గొడవను ఉంచండి మీ అమ్మానాన్నలను కాదు. “తమ టీనేజీ కూతురికి లేదా కొడుకుకి ఏది మంచిదో అది ఇవ్వాలని అమ్మానాన్నలు అనుకుంటారు. ఆ కూతురు లేదా కొడుకేమో తమకు ఏది మంచిది అనిపిస్తుందో అది కావాలనుకుంటారు. మాటలవరకైనా వాళ్ల లక్ష్యం ఒక్కటే.”

     బైబిలు ఇలా చెప్తోంది: ‘సమాధానమును కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరిద్దాము.’—రోమీయులు 14:19.

  •   అర్థంచేసుకోండి. “మనకున్నట్లుగానే అమ్మానాన్నలకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి అని గుర్తుంచుకోవడం నాకు చాలా సహాయం చేసింది” అని శారా అనే ఓ టీనేజీ అమ్మాయి చెప్తోంది. కార్లా అనే మరో యువతి ఇంకాస్త వివరంగా ఇలా అంటోంది, “నేను మా అమ్మానాన్నల స్థానంలో ఉండి ఆలోచించడానికి ప్రయత్నిస్తుంటాను. ఒకవేళ నాకే గనుక ఓ పాప ఉండి, ఇలాంటి పరిస్థితి ఎదురైతే నాకెలా అనిపిస్తుంది? నా పాపకు నిజంగా ఏది అవసరం?”

     బైబిలు ఇలా చెప్తోంది: “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”—ఫిలిప్పీయులు 2:4.

  •   చెప్పిన మాట వినండి. చివరిగా, బైబిలు మిమ్మల్ని చేయమని చెప్తుంది ఇదే. (కొలొస్సయులు 3:20) అలా వింటే పరిస్థితి చాలా బాగుంటుంది. “నేను మా అమ్మానాన్నలు చెప్పిన మాట వింటే నాకు జీవితం కాస్త సాఫీగా అనిపిస్తుంది. వాళ్లు నాకోసం చాలా త్యాగాలు చేశారు, నేను వాళ్లకోసం చేయగలిగింది వాళ్లు చెప్పిన మాట వినడం మాత్రమే” అని క్యారన్‌ అనే ఓ యువతి అంటోంది. గొడవలు జరగకుండా ఉండడానికి చక్కని మార్గం ఏమిటంటే మీరు అమ్మానాన్నలు చెప్పిన మాట వినడమే.

     బైబిలు ఇలా చెప్తోంది: “కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును.”—సామెతలు 26:20.

 టిప్‌. మీకు మాట్లాడడం కష్టంగా అనిపిస్తే, మీకు అనిపించినదంతా ఓ పేపరు మీదో లేదా మెసేజ్‌లోనో రాసి ఇవ్వండి. “నాకు మాట్లాడే మూడ్‌ లేనప్పుడు నేను అలానే చేస్తాను. అరవకుండా ఉండేందుకు లేదా ఇప్పుడు ఏదోకటి అనేసి తర్వాత బాధపడాల్సిన పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ పద్ధతి నాకు చాలా సహాయం చేస్తుంది” అని అలిస్సా అనే ఓ టీనేజీ అమ్మాయి అంటోంది.