కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను బాప్తిస్మం తీసుకోవాలా?—2వ భాగం: బాప్తిస్మం కోసం ఎలా సిద్ధపడాలి?

నేను బాప్తిస్మం తీసుకోవాలా?—2వ భాగం: బాప్తిస్మం కోసం ఎలా సిద్ధపడాలి?

 మీరు బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తూ దేవునితో స్నేహం చేస్తూ ఉంటే, మీరు బాప్తిస్మం తీసుకోవాలని కోరుకోవడం సహజమే. అందుకోసం మీరు సిద్ధంగా ఉన్నారో లేదో మీకెలా తెలుస్తుంది? a

ఈ ఆర్టికల్‌లో ...

 నేను ఎంత తెలుసుకోవాలి?

 బాప్తిస్మం కోసం సిద్ధపడడం అంటే, స్కూల్‌లో పరీక్ష పాస్‌ అవడం కోసం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం లాంటిది కాదు. మీరు మీ “ఆలోచనా సామర్థ్యాల్ని” ఉపయోగించి, బైబిలు బోధించేది సత్యం అనే మీ నమ్మకాన్ని బలపర్చుకోవాలి. (రోమీయులు 12:1) ఉదాహరణకు:

 నేను ఏమేం చేయాలి?

 మీలో ఎలాంటి లోపం లేనప్పుడే మీరు బాప్తిస్మం తీసుకోవాలని కాదు. అయితే, ‘చెడుకు దూరంగా ఉండాలని, మంచి చేయాలని’ మీరు నిజంగా కోరుకుంటున్నట్లు ఖచ్చితంగా చూపించాలి. (కీర్తన 34:14) ఉదాహరణకు:

  •   మీరు యెహోవా ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నారా?

     బైబిలు ఇలా చెప్తుంది: “మంచి మనస్సాక్షిని కాపాడుకోండి.”—1 పేతురు 3:16.

     మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను “తప్పొప్పులను గుర్తించేలా” నా “వివేచనా సామర్థ్యాలకు” శిక్షణ ఇచ్చుకున్నట్టు ఎలా చూపించాను?’ (హెబ్రీయులు 5:14) ‘నా స్నేహితులు తప్పు చేయమని నన్ను ఒత్తిడి చేసినప్పుడు నేను ఎదిరించిన సందర్భాలు ఏమైనా నాకు గుర్తొస్తున్నాయా? సరైనది చేసేలా నా స్నేహితులు నన్ను ప్రోత్సహిస్తున్నారా?’—సామెతలు 13:20.

     ఇంకా సహాయం కావాలా?నా మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వాలి?” చూడండి.

  •   మీరు చేసే పనులకు మీరే బాధ్యులని గుర్తిస్తున్నారా?

     బైబిలు ఇలా చెప్తుంది: “మనలో ప్రతీ ఒక్కరు తన గురించి దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.”—రోమీయులు 14:12.

     మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను నా విషయాల్లో, ఇతరుల విషయాల్లో నిజాయితీగా ఉంటున్నానా?’ (హెబ్రీయులు 13:18) ‘ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకుంటానా లేక దాన్ని దాచిపెట్టడానికి, ఇతరుల మీద వేయడానికి ప్రయత్నిస్తానా?’—సామెతలు 28:13.

     ఇంకా సహాయం కావాలా?తప్పులు చేసినప్పుడు నేనేమి చేయాలి?” చూడండి.

  •   యెహోవాతో మీ స్నేహాన్ని కాపాడుకుంటున్నారా?

     బైబిలు ఇలా చెప్తుంది: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకోబు 4:8.

     మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవాకు దగ్గరవడానికి నేను ఏమేం చేస్తున్నాను?’ ఉదాహరణకు, ‘నేను ఎంత తరచుగా బైబిలు చదువుతున్నాను?’ (కీర్తన 1:1, 2) ‘నేను క్రమంగా ప్రార్థిస్తున్నానా?’ (1 థెస్సలొనీకయులు 5:17) ‘నేను ఫలానా విషయాల గురించి నిర్దిష్టంగా ప్రార్థిస్తున్నానా? నా స్నేహితులు యెహోవాకు కూడా స్నేహితులేనా?’—కీర్తన 15:1, 4.

     ఇంకా సహాయం కావాలా?బైబిలు నాకెలా సహాయం చేయగలదు?—2వ భాగం: బైబిలు చదవడాన్ని ఎలా ఆనందించవచ్చు?” అలాగే “నేను ఎందుకు ప్రార్థించాలి?” చూడండి.

 టిప్‌: బాప్తిస్మం కోసం సిద్ధపడడానికి యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఇంగ్లీషు) 2వ సంపుటిలోని 37వ అధ్యాయం చదవండి. ముఖ్యంగా 308, 309 పేజీల్లోని వర్క్‌షీట్‌ చూడండి.

aనేను బాప్తిస్మం తీసుకోవాలా?—1వ భాగం” చదవండి, అది యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటో, అలా చేయడం ఎందుకు ముఖ్యమో వివరిస్తుంది.