కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను అందంగా కనిపిస్తున్నానా?

నేను అందంగా కనిపిస్తున్నానా?

 మనం వేసుకునే బట్టల గురించి ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే మన బట్టలు ఎదుటివాళ్లకు మన గురించి ఏదో ఒకటి చెప్తాయి. మీ బట్టలు మీ గురించి ఏం చెప్తున్నాయి?

 అందం విషయంలో మూడు పెద్ద తప్పులు, వాటిని చేయకూడదంటే ఏం చేయాలి?

1వ తప్పు: మీడియాను ఫాలో అవడం.

 “ఒక్కోసారి, ఓ కొత్త స్టైల్‌కి సంబంధించిన చాలా యాడ్స్‌ చూసినప్పుడు నేను దానికి ఎట్రాక్ట్‌ అయిపోతాను” అని థెరెస అనే టీనేజర్‌ చెప్తుంది. తను ఇంకా ఇలా అంటోంది: “యాడ్స్‌లో ఓ కొత్త ఐటమ్‌ వేసుకుని, చాలామంది కనిపిస్తారు. మనసు వాళ్ల ఫోటోలతో నిండిపోయినప్పుడు, ఆ స్టైల్‌ని ఫాలో అవకుండా ఉండడం చాలా కష్టం.”

 అడ్వర్టైజ్‌మెంట్స్‌ ప్రభావానికి లోనయ్యేది అమ్మాయిలు మాత్రమే కాదు. ‘ఫ్యాషన్‌ ట్రెండ్స్‌, అబ్బాయిల మీద కూడా అంతే ప్రభావం చూపిస్తాయి, ... వాళ్ల చిన్నవయసు నుండే వ్యాపార రంగం వాళ్లను లక్ష్యంగా చేసుకుంటుంది’ అని ద ఎవ్రీథింగ్‌ గైడ్‌ టు రైజింగ్‌ అడాలసెంట్‌ బాయ్స్‌ అనే పుస్తకం చెప్తోంది.

 సరైన పని: “అనుభవం లేనివాడు ప్రతీ మాట నమ్ముతాడు, వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు” అని బైబిలు చెప్తోంది. (సామెతలు 14:15) ఆ సూత్రాన్ని మనసులో ఉంచుకొని, మీరు యాడ్స్‌లో చూసేవాటిని బాగా పరిశీలించడం నేర్చుకోండి. ఉదాహరణకు, మీరు బట్టలకు సంబంధించిన ఒక యాడ్‌లో, అవి చాలా “స్టైల్‌గా,” “హాట్‌గా,” “సెక్సీగా” ఉంటాయని చెప్పడం చూశారనుకోండి, అప్పుడు మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి:

  •  ‘నేను ఈ ట్రెండ్‌ ఫాలో అవడం వల్ల, ఎవరికి లాభం ఉంటుంది?’

  •  ‘ఇది ఎదుటివాళ్లకు నా లైఫ్‌స్టైల్‌ ఎలాంటిదని చెప్తుంది?’

  •  ‘ఆ లైఫ్‌స్టైల్‌లో నిజంగా నేను, నా నమ్మకాలు కనిపిస్తాయా?’

 ఫ్యాషన్‌ టిప్‌: మీడియాలో ఎక్కువగా వచ్చే బట్టల యాడ్స్‌ని ఒక వారం పాటు బాగా పరిశీలించండి. అవి ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని గొప్పగా చూపిస్తున్నాయి? ఒక ట్రెండ్‌ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని మీరు ఫీలయ్యేలా చేసే సందేశాలు ఏమైనా దానిలో ఉన్నాయా? “పర్‌ఫెక్ట్‌గా కనిపించాలి, ఫర్‌ఫెక్ట్‌గా డ్రెస్‌ చేసుకోవాలి, మన ‘పర్‌ఫెక్ట్‌’ బాడీని చూపించుకోవాలి అనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది” అని క్యారన్‌ అనే టీనేజ్‌ అమ్మాయి చెప్తోంది. “ఆ విషయాన్ని పసిగట్టిన వ్యాపారస్థులు యువతను ఇట్టే ఆకట్టుకోగలుగుతారు” అని తను అంటోంది.

2వ తప్పు: అందరిలా కనిపించడానికి ప్రయత్నించడం.

 మాన్వెల్‌ అనే అబ్బాయి ఇలా చెప్తున్నాడు: “ఒక రకం బట్టలు ఇప్పటి స్టైల్‌ అనుకోండి, ఇక అందరూ ఆ స్టైల్‌ బట్టలే వేసుకుంటారు. ఒకవేళ నేను ఆ బట్టలు వేసుకోకపోతే, అందరూ నా గురించి ఏదేదో అనేసుకుంటారు.” ఆనా అనే అమ్మాయి కూడా అలాగే అంటోంది: “అందంగా కనిపించడం కంటే, అందరిలా కనిపించడమే ముఖ్యమైపోయింది.”

 సరైన పని: “ఇకమీదట ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి.” (రోమీయులు 12:2) ఆ సలహాను మనసులో ఉంచుకొని, మీ బట్టల బీరువాలోకి చూసి ఇలా ప్రశ్నించుకోండి:

  •  ‘ఎలాంటి బట్టలు కొనుక్కోవాలనే విషయంలో నా మీద ఎక్కువగా ప్రభావం చూపేవి ఏమిటి?’

  •  ‘బట్టల మీద బ్రాండ్‌నేమ్‌ ఉండడం నాకు ఎంత ముఖ్యం?’

  •  ‘నా బట్టలతో నేను జనాన్ని ఇంప్రెస్‌ చేద్దామనుకుంటున్నానా?’

 ఫ్యాషన్‌ టిప్‌: మీరు బట్టలు కొనేటప్పుడు, అవి ‘స్టైల్‌గా అందరికీ నచ్చేలా’ ఉన్నాయా లేక ‘స్టైల్‌లో పాతబడిపోయి ఎవరికీ నచ్చని విధంగా’ ఉన్నాయా అనే రెండు ఆప్షన్‌లే కాకుండా ఈ మూడో ఆప్షన్‌ గురించి కూడా ఆలోచించండి: అవి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయా, అవి సురక్షితమేనా? మీ మీద మీకు నమ్మకం ఉంటే, అందరిలా ఉండాలనే దాని గురించి ఎక్కువగా ఆలోచించరు.

3వ తప్పు: ‘కొంచెం సెక్సీగా ఉంటే బావుంటుంది’ అనుకోవడం.

 “నిజం చెప్పాలంటే, బాగా పొట్టిగా ఉండేదో, బాగా టైట్‌గా ఉండేదో, బాగా చిన్నదో ఇలా కొంచెం సెక్సీగా ఉండేది ఏదైనా వేసుకోవాలని ఒక్కోసారి అనిపిస్తుంది” అని జెన్నిఫర్‌ అనే అమ్మాయి ఒప్పుకుంది.

 సరైన పని: “మీరు పైకి కనిపించే అలంకరణ మీద ... దృష్టిపెట్టకండి. బదులుగా మీ హృదయ అలంకరణ మీద దృష్టిపెట్టండి” అని బైబిలు చెప్తోంది. (1 పేతురు 3:3, 4) ఆ సలహాను మనసులో ఉంచుకొని, వీటిలో ఏది ఎక్కువ ఆకర్షణీయమైనదో ఆలోచించండి: కళ్లకు అందంగా కనిపించే బట్టలా, మనసును తాకే గుణాలా?

 ఫ్యాషన్‌ టిప్‌: మీ అందాన్ని పెంచేది మీలోని నిరాడంబరం అనే గుణమే. ఈ రోజుల్లో చాలామందికి దాని గురించి పెద్దగా తెలియదనేది నిజమే. కానీ ఈ విషయం ఆలోచించండి:

 ఎక్కువగా మాట్లాడుతూ, ఎప్పుడూ తన గురించే చెప్పుకునే వ్యక్తితో మీరెప్పుడైనా మాట్లాడారా? బాధాకరమైన విషయం ఏమిటంటే, అతను మీకు అవకాశం ఇవ్వడం లేదనే విషయాన్ని అస్సలు గుర్తించడు!

మాటల్లాగే మీ బట్టలు కూడా “అందరూ నన్నే చూడాలి” అనే సందేశాన్నిచ్చే అవకాశం ఉంది. నిజానికి అది మీ చుట్టూ ఉన్నవాళ్లను మీకు దూరం చేస్తుంది.

 పద్ధతిగా లేని బట్టలు వేసుకుంటే మీరు కూడా అతనిలా అయిపోతారు. మీ వాలకం అందరికీ, ‘నన్నే చూడండి’ అన్నట్టుగా కనిపిస్తుంది. దాంతో, చూసేవాళ్లు మీకు ఆత్మవిశ్వాసం లేదని లేదా మీరు మీ గురించే ఎక్కువ ఆలోచించుకుంటారని అనుకుంటారు, లేదా రెండూ అనుకోవచ్చు. ‘అందరి చూపూ నామీదే ఉండాలి, చెడు ఉద్దేశంతోనైనా సరే నన్నే చూడాలి’ అని మీరు విపరీతంగా కోరుకుంటున్నారని వాళ్లు అర్థం చేసుకుంటారు.

 మీరు బట్టలు వేసుకునేది అమ్మడానికి కాదు, కాబట్టి వాటిని అడ్వర్టైజ్‌ చేసే బదులు, పద్ధతిగా ఉండడానికి ప్రయత్నించండి. మోనిక అనే అమ్మాయి ఇలా అంటోంది: “పద్ధతిగా బట్టలు వేసుకోవడమంటే, మరీ ముసలివాళ్లలా తయారవ్వమని కాదు. మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్నవాళ్లను గౌరవించేలా తయారవ్వమని.”