కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను ఎందుకు ప్రార్థించాలి?

నేను ఎందుకు ప్రార్థించాలి?

 ఒక సర్వే ప్రకారం అమెరికాలో 80 శాతం యౌవనులు ప్రార్థిస్తారు, కానీ వాళ్లలో సగం మందే రోజూ ప్రార్థిస్తారు. ఆ యౌవనుల్లో కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు: ‘ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా ఉండడం తప్ప వేరే ప్రయోజనాలేమైనా ఉన్నాయా?’

 ప్రార్థన అంటే ఏమిటి?

 ప్రార్థన అంటే అన్నిటినీ తయారుచేసిన సృష్టికర్తతో నిజంగా మాట్లాడడం. ఆయనతో మాట్లాడడం గురించి ఒకసారి ఆలోచించండి! యెహోవా ప్రతీ విషయంలో మనుషుల కంటే ఎంతో గొప్పవాడు అయినా “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.” (అపొస్తలుల కార్యాలు 17:27) అంతేకాదు, బైబిల్లో ఈ అద్భుతమైన ఆహ్వానం ఉంది: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకోబు 4:8.

 మీరు దేవునికి ఎలా దగ్గరవ్వచ్చు?

  •   ఒక మార్గం ఏంటంటే ప్రార్థన చేయడం—దాని ద్వారా మీరు దేవునితో మాట్లాడవచ్చు.

  •   ఇంకో మార్గం ఏంటంటే బైబిల్ని స్టడీ చేయడం—దాని ద్వారా దేవుడు మీతో “మాట్లాడతాడు.”

 ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోవడం వల్ల అంటే ప్రార్థన, బైబిలు చదవడం వల్ల మీరు దేవునితో బలమైన స్నేహాన్ని పెంచుకుంటారు.

 “యెహోవాతో మాట్లాడడం అంటే సర్వోన్నతునితో సంభాషించడం, అది మనుషులకు దొరికిన అత్యంత గొప్ప గౌరవమని చెప్పవచ్చు.”​—జెరమీ.

 “నా హృదయ లోతుల్లో ఉన్న ఫీలింగ్స్‌ని ప్రార్థనలో యెహోవాతో చెప్పినప్పుడు ఆయనకు మరింత దగ్గరైనట్లు నాకనిపిస్తుంది.”​—మరాండ.

 దేవుడు వింటున్నాడా?

 మీరు దేవున్ని నమ్మినప్పటికీ, మీకు ప్రార్థన చేసే అలవాటు ఉన్నప్పటికీ, ఆయన నిజంగా మీ ప్రార్థనల్ని వింటున్నాడని నమ్మడం కష్టంగా అనిపించవచ్చు. అయితే, బైబిలు యెహోవాను “ప్రార్థన ఆలకించువాడా” అని పిలుస్తుంది. (కీర్తన 65:2) అంతేకాదు “మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి” అని మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎందుకు? ఎందుకంటే “మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి.”—1 పేతురు 5:7.

 ఆలోచించండి: మీరు మీ క్లోస్‌ ఫ్రెండ్స్‌తో రోజూ మాట్లాడడానికి టైం తీసుకుంటారా? మీరు దేవునితో కూడా అలా మాట్లాడవచ్చు. ప్రార్థన ద్వారా ఆయనతో రోజూ మాట్లాడండి. యెహోవా అనే ఆయన పేరు ఉపయోగించి ప్రార్థన చేయండి. (కీర్తన 86:5-7; 88:9) నిజానికి బైబిలు, “ఎప్పుడూ ప్రార్థించండి” అని చెప్తుంది.—1 థెస్సలొనీకయులు 5:17.

 “ప్రార్థనలో నేను నా పరలోక తండ్రితో మాట్లాడతాను, నా మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పేస్తాను.”​—మాయ్‌సెస్‌.

 “నేను అమ్మతో లేదా నా క్లోస్‌ ఫ్రెండ్‌తో మాట్లాడినట్లు, ఏమి దాచుకోకుండా యెహోవాతో అన్ని విషయాలు చెప్తాను.”​—కారెన్‌.

 నేను వేటి గురించి ప్రార్థన చేయవచ్చు?

 బైబిలు ఇలా చెప్తుంది: “కానీ ప్రతీ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.”—ఫిలిప్పీయులు 4:6.

 అంటే మీరు మీ సమస్యల గురించి ప్రార్థించడం సరైనదేనా? అవును. నిజానికి, బైబిలు ఇలా చెప్తుంది: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును.”—కీర్తన 55:22.

 నిజమే, మీరు ప్రార్థించేటప్పుడు మీ సమస్యల గురించే మాట్లాడకూడదు. “కేవలం సహాయం కోసమే నేను యెహోవాకు ప్రార్థిస్తే, నేను మంచి ఫ్రెండ్‌ని కాలేను అనిపిస్తుంది. ప్రార్థనలో ముందుగా థ్యాంక్స్‌ చెప్పాలి. అంతేకాదు, థ్యాంక్స్‌ చెప్పాల్సిన విషయాలు ఒక పెద్ద లిస్టే ఉండాలి” అని షాంటెల్‌ అనే అమ్మాయి చెప్తుంది.

 ఆలోచించండి: మీ జీవితంలో మీరు వేటి గురించి థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నారు? యెహోవాకు ప్రార్థించేటప్పుడు ఈరోజు మీరు ఏ మూడు విషయాల గురించి థ్యాంక్స్‌ చెప్పవచ్చో ఆలోచించండి.

 “మామూలు విషయాల గురించి కూడా, అంటే ఒక అందమైన పువ్వును చూసినప్పుడు కూడా యెహోవాకు ప్రార్థనలో థ్యాంక్స్‌ చెప్పవచ్చు.”​—అనీట.

 “సృష్టిలో మీకు బాగా నచ్చిన ఒక విషయం గురించి లేదా మీ హృదయానికి హత్తుకున్న ఒక బైబిలు వచనం గురించి బాగా ఆలోచించండి తర్వాత దాని గురించి యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పండి.”​—బ్రైయన్‌.