కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—4వ భాగం: అన్నిటినీ దేవుడే సృష్టించాడనే నా నమ్మకాన్ని నేనెలా వివరించవచ్చు?

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—4వ భాగం: అన్నిటినీ దేవుడే సృష్టించాడనే నా నమ్మకాన్ని నేనెలా వివరించవచ్చు?

జీవాన్ని దేవుడు సృష్టించాడని మీరు నమ్ముతున్నారు కానీ మీరు నమ్మే విషయాన్ని స్కూల్లో అందరిముందూ చెప్పేందుకు వెనకాడుతున్నారు. బహుశా మీ బుక్స్‌ పరిణామ సిద్ధాంతాన్ని సమర్థిస్తూ ఉండవచ్చు. మీ టీచర్లు, తోటి పిల్లలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారని కంగారు పడుతుండవచ్చు. వీటన్నిటినీ దేవుడే సృష్టించాడనే మీ నమ్మకాన్ని మీరు ఇతరులకు ధైర్యంగా ఎలా వివరించవచ్చు?

 మీరు వివరించగలరు!

 మీరిలా అనుకుంటుండవచ్చు: ‘సైన్సు గురించి చర్చించేంత, పరిణామ క్రమం గురించి వాదించేంత తెలివితేటలు నాకు లేవు.’ ఒకసారి డానియెల్లే కూడా అలానే అనుకుంది. తనిలా అంటుంది “మా టీచర్‌, క్లాసులోని తోటి పిల్లలు నమ్మేదానికి వ్యతిరేకమైనదాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు.” డయానా కూడా ఇలా అంటుంది: “వాళ్లు సైన్స్‌కు సంబంధించిన పదాలు ఉపయోగించి వాదిస్తుంటే నాకు అయోమయంగా అనిపిస్తుంది.”

 ఏదేమైనా, వాదోపవాదాల్లో గెలవడం మీ లక్ష్యం కాదు. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న ఈ అందమైన లోకం దేవుడు సృష్టించడం వల్లే వచ్చిందని వివరించడానికి మీరు సైన్స్‌లో మేధావులు అవాల్సిన అవసరమేమీ లేదు.

 టిప్‌: “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే” అని హెబ్రీయులు 3:4 చెప్తుంది. ఈ చిన్న లాజిక్‌ని మీరు ఉపయోగించుకోవచ్చు.

 క్యారెల్‌ అనే అమ్మాయి, హెబ్రీయులు 3:4 లో ఉన్న లాజిక్‌ను ఇలా ఉపయోగించింది: “మీరొక దట్టమైన అడవిలో నడుస్తున్నారని ఊహించుకోండి. అక్కడ మనుషులు ఉన్నారనే ఆధారాలేమీ కనిపించడం లేదు. అయితే మీకు అక్కడ నేల మీద ఒక టూత్‌పిక్‌ కనిపించింది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలామందికైతే, ‘ఇక్కడెవరో ఉన్నారు’ అనే అనిపిస్తుంది. చాలాచిన్న టూత్‌పిక్‌ ఉండడమే తెలివైన ఒక మనిషి ఉన్నాడనడానికి ఆధారమైతే, మరి ఈ విశ్వం, అందులో ఉన్నవన్నీ తెలివైన సృష్టికర్త ఉన్నాడని చెప్పడం లేదా?

 ఎవరైనా ఇలా అంటే: “దేవుడు సృష్టిని చేశాడు అనేది నిజమైతే మరి ఆయన్ని ఎవరు సృష్టించారు?”

 మీరిలా జవాబు ఇవ్వవచ్చు: “సృష్టికర్తకు సంబంధించిన అన్ని విషయాలు మనకు తెలియనంత మాత్రాన, ఆయన లేడు అనడం కరెక్ట్‌ కాదు. ఉదాహరణకు, మీ సెల్‌ఫోన్‌ తయారు చేసిన వ్యక్తి చరిత్రంతా మీకు తెలిసుండకపోవచ్చు. అయినాసరే దాన్ని ఎవరో ఒకరు తయారు చేసుంటారని మీరు నమ్మరా? [వాళ్లు ఏమంటారో వినండి.] సృష్టికర్త గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అందుకు మీకు ఆసక్తి ఉంటే, ఆయన గురించి నేను నేర్చుకున్న విషయాల్ని మీకు సంతోషంగా చెప్తాను.”

 సిద్ధంగా ఉండండి

 “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా” ఉండాలని బైబిలు మనకు చెప్తుంది. (1 పేతురు 3:15, 16) కాబట్టి, మీరేమి చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? అనే రెండు విషయాల మీద శ్రద్ధ పెట్టండి.

  1.   మీరేమి చెప్తున్నారు? దేవుని మీద మీకున్న ప్రేమే మిమ్మల్ని మాట్లాడిస్తుంది. కానీ దేవుడే అన్నిటినీ సృష్టించాడని ఇతరుల్ని చక్కగా ఒప్పించడానికి, మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో చెప్పడం మాత్రమే సరిపోదు. ప్రకృతిలో ఉన్న వాటినే ఉదాహరణలుగా ఉపయోగించుకుంటూ అన్నిటినీ దేవుడే సృష్టించాడని నిరూపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

  2.   ఎలా చెప్తున్నారు? విషయాన్ని ధైర్యంగా చెప్పండి. అలాగని వాళ్లతో కఠినంగా, మీరు చెప్పేదంతా తప్పు అన్నట్టుగా మాట్లాడకండి. మీరు వాళ్ల నమ్మకాలను గౌరవిస్తూ, నిర్ణయం తీసుకునే హక్కు వాళ్లకు ఉందని గుర్తిస్తూ మాట్లాడితే ప్రజలు మీరు చెప్పేది తప్పకుండా వింటారు.

     “అవమానించేలా లేదా అన్నీ మీకే తెలుసు అనేలా మాట్లాడతారు అనే పేరు తెచ్చుకోకండి. నాకే అంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడితే చెడు ఫలితాలు వస్తాయి.”—ఇలైన్‌.

 మీ నమ్మకాలను వివరించడానికి సహాయపడే ప్రచురణలు

మీ నమ్మకాల గురించి చెప్పడానికి సిద్ధపడడం, వాతావరణంలో వచ్చే మార్పులకు సిద్ధపడడం లాంటిది.

 ఆలిసియా అనే అమ్మాయి ఇలా అంటుంది, “మనం సిద్ధపడి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందేమోనని మాట్లాడకుండా ఉండిపోతాం.” ఆలిసియా చెప్తున్నట్లు విజయం సాధించాలంటే సిద్ధపడడం చాలా ప్రాముఖ్యం. జెన్నా ఇలా చెప్తుంది, “చక్కగా ఆలోచించి చిన్నచిన్న ఉదాహరణలు సిద్ధం చేసుకోవడం వల్ల, జీవాన్ని దేవుడే సృష్టించాడనే నా నమ్మకాన్ని ఇంకా సులభంగా వివరించగలుగుతాను.”

 అలాంటి ఉదాహరణలు మీకు ఎక్కడ దొరుకుతాయి? చాలామంది యౌవనస్థులు కింది ప్రచురణలను ఉపయోగించుకుని విజయం సాధించారు.

  •  Was Life Created?

  •  The Origin of Life​—Five Questions Worth Asking

  •  The Wonders of Creation Reveal God’s Glory (video)

  •  Awake! లేదా తేజరిల్లు! పత్రికలోని “Was It Designed?” లేదా “సృష్టిలో అద్భుతాలు” ఆర్టికల్స్‌. (కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీలోని “వెతుకు” అనే బాక్సులో “was it designed” లేదా “సృష్టిలో అద్భుతాలు” అని [కొటేషన్‌ గుర్తులతో సహా] టైప్‌ చేయండి.)

  •  మరింత సమాచారాన్ని వెదికేందుకు కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ ఉపయోగించుకోండి.

 “జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?” అనే ఈ సీరీస్‌లోని ముందటి ఆర్టికల్స్‌ కూడా మీకు ఇంకా ఎక్కువ సహాయం చేస్తాయి.

  1.  1వ భాగం: దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి?

  2.  2వ భాగం: పరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు సందేహించాలి?

  3.  3వ భాగం: సృష్టిని ఎవరో ఒకరు చేశారని ఎందుకు నమ్మాలి?

 టిప్‌: మిమ్మల్ని బాగా ఒప్పించే ఉదాహరణలను ఎంచుకోండి. అవి మీకు తేలిగ్గా గుర్తుంటాయి, అలాగే వాటి గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతారు. మీ నమ్మకాన్ని ఎలా వివరించవచ్చో ముందుగా ప్రాక్టీసు చేసుకోండి.