కీర్తనలు 83:1-18

  • శత్రువుల్ని బట్టి ప్రార్థన

    • “దేవా, నిశ్శబ్దంగా ఉండకు” (1)

    • శత్రువులు గిరగిర తిరిగే ముళ్లకొమ్మలా ఉన్నారు (13)

    • దేవుని పేరు యెహోవా (18)

గీతం. ఆసాపు+ శ్రావ్యగీతం. 83  దేవా, నిశ్శబ్దంగా ఉండకు;+దేవా, మౌనంగా ఉండిపోకు, ఊరుకోకు.   ఇదిగో! నీ శత్రువులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు;+నిన్ను ద్వేషించేవాళ్లు అహంకారంగా ప్రవర్తిస్తున్నారు.*   కుయుక్తితో వాళ్లు నీ ప్రజల మీద రహస్య పన్నాగాలు పన్నుతున్నారు;నీ అమూల్యమైన* ప్రజల మీద కుట్ర పన్నుతున్నారు.   వాళ్లు, “రండి, ఇశ్రాయేలు జనాన్ని సమూలంగా నాశనం చేసి,+వాళ్ల పేరు శాశ్వతంగా మరవబడేలా చేద్దాం” అని అంటున్నారు.   వాళ్లు కలిసికట్టుగా వ్యూహం పన్నుతున్నారు;నీకు వ్యతిరేకంగా సంధి* చేసుకున్నారు.+   డేరాల్లో నివసించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు; మోయాబీయులు,+ హగ్రీయులు;+   గెబలీయులు, అమ్మోనీయులు,+ అమాలేకీయులు;తూరు+ నివాసులతోపాటు ఫిలిష్తీయులు+ సంధి చేసుకున్నారు.   అష్షూరీయులు+ కూడా వాళ్లతో చేతులు కలిపారు;వాళ్లు లోతు కుమారులకు+ మద్దతిస్తున్నారు.* (సెలా)   నువ్వు మిద్యానుకు చేసినట్టు,+కీషోను వాగు దగ్గర సీసెరాకు, యాబీనుకు చేసినట్టు వాళ్లకు చేయి.+ 10  ఏన్దోరు+ దగ్గర వాళ్లు సమూలంగా నాశనమయ్యారు;భూమికి ఎరువు అయ్యారు. 11  వాళ్ల ప్రముఖుల్ని ఓరేబులా, జెయేబులా,+వాళ్ల అధిపతుల్ని* జెబహులా, సల్మున్నాలా చేయి.+ 12  ఎందుకంటే వాళ్లు, “దేవుడు నివసించే దేశాన్ని స్వాధీనం చేసుకుందాం” అని చెప్పుకున్నారు. 13  నా దేవా, వాళ్లను గిరగిర తిరిగే ముళ్లకొమ్మలా,+గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయి. 14  నిప్పు అడవిని కాల్చేసినట్టు,కార్చిచ్చు పర్వతాల్ని తగలబెట్టినట్టు,+ 15  నీ తుఫానుతో+ వాళ్లను తరుము,నీ సుడిగాలితో వాళ్లను భయపెట్టు.+ 16  యెహోవా, వాళ్లు నీ పేరును వెదికేలావాళ్ల ముఖాల్ని అవమానంతో కప్పేయి.* 17  వాళ్లు శాశ్వతంగా సిగ్గుపడాలి, భయపడిపోవాలి;అవమానాలపాలై నాశనమవ్వాలి; 18  యెహోవా అనే పేరున్న+ నువ్వు మాత్రమేభూమంతటి పైన మహోన్నతుడివని* ప్రజలు తెలుసుకోవాలి.+

అధస్సూచీలు

లేదా “తలలు ఎత్తుతున్నారు.”
అక్ష., “దాచబడిన.”
లేదా “ఒప్పందం.”
అక్ష., “బాహువు అయ్యారు.”
లేదా “నాయకుల్ని.”
అక్ష., “నింపేయి.”
లేదా “సర్వోన్నతుడివని.”