కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6వ ప్రశ్న

మెస్సీయ గురించి బైబిలు ముందే ఏం చెప్పింది?

ప్రవచనం

‘బేత్లెహేము ఎఫ్రాతా, నా కోసం ఇశ్రాయేలును పరిపాలించే వ్యక్తి నీలో నుండి వస్తాడు.’

మీకా 5:2

నెరవేర్పు

‘హేరోదు రాజుగా పరిపాలిస్తున్న రోజుల్లో, యూదయలోని బేత్లెహేములో యేసు పుట్టిన తర్వాత, ఇదిగో! తూర్పు నుండి జ్యోతిష్యులు యెరూషలేముకు వచ్చారు.’

మత్తయి 2:1

ప్రవచనం

“వాళ్లు నా వస్త్రాలు పంచుకుంటున్నారు, నా లోపలి వస్త్రం కోసం చీట్లు వేసుకుంటున్నారు.”

కీర్తన 22:18

నెరవేర్పు

‘సైనికులు యేసును మేకులతో కొయ్యకు దిగగొట్టిన తర్వాత, ఆయన పైవస్త్రాలు తీసుకుని ఒక్కో సైనికుడికి ఒక్కో భాగం వచ్చేలా వాటిని నాలుగు భాగాలు చేశారు. ఆయన లోపలి వస్త్రం కుట్టులేకుండా పైనుండి కిందివరకు నేయబడింది. కాబట్టి వాళ్లు, “మనం దీన్ని చింపకుండా, చీట్లు వేసి ఎవరికి వస్తుందో చూద్దాం” అని చెప్పుకున్నారు.’

యోహాను 19:​23, 24

ప్రవచనం

“ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతున్నాడు; వాటిలో ఒక్కటి కూడా విరగలేదు.”

కీర్తన 34:20

నెరవేర్పు

“వాళ్లు యేసు దగ్గరికి వచ్చేసరికి ఆయన అప్పటికే చనిపోయి ఉండడంతో వాళ్లు ఆయన కాళ్లు విరగగొట్టలేదు.”

యోహాను 19:33

ప్రవచనం

“ఆయన మన దోషాల వల్ల పొడవబడ్డాడు.”

యెషయా 53:5

నెరవేర్పు

“ఒక సైనికుడు ఈటెతో ఆయన పక్కటెముకల్లో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు బయటికి వచ్చాయి.”

యోహాను 19:34

ప్రవచనం

“వాళ్లు నా జీతం నాకు ఇచ్చారు, అది 30 వెండి రూకలు.”

జెకర్యా 11:​12, 13

నెరవేర్పు

“తర్వాత పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్లి, ‘ఆయన్ని మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు?’ అని అడిగాడు. అందుకు వాళ్లు అతనికి 30 వెండి నాణేలు ఇస్తామన్నారు.”

మత్తయి 26:​14, 15; 27:5