కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

16వ ప్రశ్న

ఆందోళనను తట్టుకోవడం ఎలా?

“నీ భారం యెహోవా మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు.”

కీర్తన 55:22

“శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి, తొందరపాటుగా పనిచేసే వాళ్లంతా ఖచ్చితంగా పేదవాళ్లౌతారు.”

సామెతలు 21:5

“భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆందోళనపడకు, ఎందుకంటే నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను, నీతి అనే నా కుడిచేతితో నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను.”

యెషయా 41:10

“మీలో ఎవరైనా ఆందోళన పడడం వల్ల మీ ఆయుష్షును కాస్తయినా పెంచుకోగలరా?”

మత్తయి 6:27

“అందుకే రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి, ఏ రోజు సమస్యలు ఆ రోజుకు చాలు.”

మత్తయి 6:34

‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’

ఫిలిప్పీయులు 1:10

“ఏ విషయం గురించీ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి; అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.”

ఫిలిప్పీయులు 4:​6, 7