కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ ప్రశ్న

బైబిల్ని ఎవరు రాశారు?

“మోషే యెహోవా చెప్పిన మాటలన్నీ రాసిపెట్టాడు.”

నిర్గమకాండం 24:4

“దానియేలు తన పడక మీద పడుకొనివుండగా ఒక కలను, దర్శనాల్ని చూశాడు. అతను ఆ కల గురించి, వాటిలో చూసినవాటి గురించి పూర్తిగా రాశాడు.”

దానియేలు 7:1

“మీరు మా దగ్గర దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దాన్ని మనుషుల వాక్యంలా కాకుండా దేవుని వాక్యంలా స్వీకరించారు. అది నిజంగా దేవుని వాక్యమే.”

1 థెస్సలొనీకయులు 2:13

‘లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి బోధించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.’

2 తిమోతి 3:16

“ప్రవచనం ఎప్పుడూ మనిషి ఇష్టాన్ని బట్టి కలగలేదు కానీ మనుషులు పవిత్రశక్తితో ప్రేరేపించబడి, దేవుని నుండి వచ్చిన విషయాలు మాట్లాడారు.”

2 పేతురు 1:21