కీర్తనలు 36:1-12

  • దేవుని అమూల్యమైన విశ్వసనీయ ప్రేమ

    • దుష్టుడు దేవునికి భయపడడు (1)

    • దేవుడు జీవపు ఊట (9)

    • “నీ వెలుగు వల్లే మేము వెలుగు చూడగలుగుతున్నాం” (9)

సంగీత నిర్దేశకునికి సూచన. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. 36  దుష్టుని హృదయం లోలోపల, అపరాధం అతనితో మాట్లాడుతుంది;అతనికి దేవుడంటే భయమే లేదు.+   అతను తన గురించి ఎంతగా గొప్పలు చెప్పుకుంటాడంటేతన తప్పును చూడలేడు, దాన్ని ద్వేషించలేడు.+   అతని నోటి మాటలు హానికరమైనవి, మోసకరమైనవి;మంచి చేయడానికి కావాల్సిన లోతైన అవగాహన అతనికి లేదు.   అతను తన మంచం మీద ఉన్నప్పుడు కూడా పన్నాగాలు పన్నుతాడు. అతను వెళ్లే మార్గం మంచిదికాదు;అతను చెడును తిరస్కరించడు.   యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ ఆకాశం వరకు,నీ నమ్మకత్వం మబ్బుల వరకు చేరుకుంటున్నాయి.+   నీ నీతి గొప్ప పర్వతాల్లా,*+నీ తీర్పులు విస్తారమైన, లోతైన జలాల్లా ఉన్నాయి.+ యెహోవా, నువ్వు మనుషుల్ని, జంతువుల్ని సంరక్షిస్తావు.*+   దేవా, నీ విశ్వసనీయ ప్రేమ ఎంత అమూల్యమైనది!+ నీ రెక్కల నీడలో మనుషులు ఆశ్రయం పొందుతారు.+   నీ మందిరంలో ఉన్న శ్రేష్ఠమైన* వాటిని వాళ్లు సంతృప్తిగా తాగుతారు,+నువ్వు వాళ్లను నీ మంచితనమనే నది నుండి తాగేలా చేస్తావు.   నీ దగ్గర జీవపు ఊట ఉంది;+నీ వెలుగు వల్లే మేము వెలుగు చూడగలుగుతున్నాం.+ 10  నిన్ను తెలుసుకున్నవాళ్లకు నీ విశ్వసనీయ ప్రేమను,హృదయంలో నిజాయితీగల వాళ్లకు+ నీ నీతిని చూపిస్తూ ఉండు. 11  అహంకారుల పాదం నన్ను తొక్కనివ్వకు,దుష్టుల చెయ్యి నన్ను వెళ్లగొట్టనివ్వకు. 12  అక్కడ అపరాధులు పడిపోయారు;వాళ్లను కింద పడేశారు, వాళ్లు ఇక లేవరు.+

అధస్సూచీలు

లేదా “కాపాడతావు.”
అక్ష., “దేవుని పర్వతాల్లా.”
అక్ష., “కొవ్విన.”