కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ ప్రశ్న

బైబిలు సందేశం ఏమిటి?

“నేను నీకూ స్త్రీకీ, నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం పెడతాను. ఆయన నీ తలను చితగ్గొడతాడు, నువ్వు ఆయన మడిమె మీద కొడతావు.”

ఆదికాండం 3:15

“నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానం ద్వారా భూమ్మీదున్న అన్నిదేశాల ప్రజలు దీవెన సంపాదించుకుంటారు.”

ఆదికాండం 22:18

“నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.”

మత్తయి 6:10

“శాంతిని అనుగ్రహించే దేవుడు త్వరలోనే సాతానును మీ కాళ్ల కింద చితకతొక్కిస్తాడు.”

రోమీయులు 16:20

“అన్నీ తనకు లోబర్చబడిన తర్వాత, కుమారుడు కూడా తనకు అన్నిటినీ లోబర్చిన దేవునికి తానే లోబడతాడు. దేవుడే అందరికీ అన్నీ అవ్వాలని ఆయన అలా చేస్తాడు.”

1 కొరింథీయులు 15:28

“అబ్రాహాముకు, అతని సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయి . . . ఆ సంతానం క్రీస్తు. అంతేకాదు మీరు క్రీస్తుకు చెందినవాళ్లయితే, మీరు నిజంగా అబ్రాహాము సంతానం.”

గలతీయులు 3:​16, 29

“ఈ లోక రాజ్యం మన దేవునిది, ఆయన క్రీస్తుది అయింది. దేవుడు యుగయుగాలు రాజుగా పరిపాలిస్తాడు.”

ప్రకటన 11:15

“దాంతో ఆ మహాసర్పం కిందికి పడేయబడింది. అది మొదటి సర్పం. దానికి అపవాది, సాతాను అనే పేర్లు ఉన్నాయి. అతను లోకమంతటినీ మోసం చేస్తున్నాడు. అతను భూమ్మీద పడేయబడ్డాడు, అతని దూతలు కూడా అతనితోపాటు పడేయబడ్డారు.”

ప్రకటన 12:9

“ఆయన ఆ మహాసర్పాన్ని పట్టుకొని 1,000 సంవత్సరాల పాటు బంధించాడు. అదే మొదటి సర్పం, అపవాది, సాతాను.”

ప్రకటన 20:2