కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కీర్తనలు పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • రెండు భిన్నమైన మార్గాలు

      • దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడం వల్ల సంతోషం (2)

      • నీతిమంతులు ఫలించే చెట్టులా ఉంటారు (3)

      • దుష్టులు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు (4)

  • 2

    • యెహోవా, ఆయన అభిషిక్తుడు

      • యెహోవా దేశాల్ని చూసి నవ్వుతాడు (4)

      • యెహోవా తన రాజును ఆసీనుణ్ణి చేశాడు (6)

      • కుమారుణ్ణి ఘనపర్చండి (12)

  • 3

    • ప్రమాదంలో కూడా దేవునిపై నమ్మకం

      • ‘ఎందుకు ఇంతమంది శత్రువులు?’ (1)

      • “యెహోవా, రక్షించేవాడివి నువ్వే” (8)

  • 4

    • దేవుని మీద నమ్మకంతో చేసిన ప్రార్థన

      • “కోపం వచ్చినా పాపం మాత్రం చేయకండి” (4)

      • ‘నేను ప్రశాంతంగా నిద్రపోతాను’ (8)

  • 5

    • యెహోవా నీతిమంతుల ఆశ్రయం

      • దేవునికి దుష్టత్వం అంటే అసహ్యం (4, 5)

      • “నన్ను నీ నీతి మార్గంలో నడిపించు” (8)

  • 6

    • అనుగ్రహం కోసం విన్నపం

      • చనిపోయినవాళ్లు దేవుణ్ణి స్తుతించరు (5)

      • అనుగ్రహం కోసం చేసే విన్నపాల్ని దేవుడు వింటాడు (9)

  • 7

    • యెహోవా నీతిగల న్యాయాధిపతి

      • ‘యెహోవా, నాకు తీర్పు తీర్చు’ (8)

  • 8

    • దేవుని మహిమ, మనిషికి ఇచ్చిన ఘనత

      • “నీ పేరు ఎంత ఘనమైనది!” (1, 9)

      • “మనిషి ఎంతటివాడు?” (4)

      • మనిషికి వైభవాన్ని కిరీటంగా పెట్టాడు (5)

  • 9

    • దేవుని అద్భుతమైన పనుల్ని ప్రకటించడం

      • యెహోవా సురక్షితమైన ఆశ్రయం (9)

      • దేవుని పేరు తెలుసుకోవడం అంటే ఆయనమీద నమ్మకముంచడం (10)

  • 10

    • యెహోవా నిస్సహాయులకు సహాయకుడు

      • దుష్టుడు గర్వంతో, “దేవుడు లేడు” అంటాడు (4)

      • నిస్సహాయుడు యెహోవా వైపు తిరుగుతాడు (14)

      • “యెహోవా యుగయుగాలూ రాజు” (16)

  • 11

    • యెహోవాను ఆశ్రయించడం

      • “యెహోవా తన పవిత్ర ఆలయంలో ఉన్నాడు” (4)

      • హింసను ప్రేమించేవాళ్లంటే దేవునికి అసహ్యం (5)

  • 12

    • యెహోవా చర్య తీసుకోవడానికి లేస్తాడు

      • దేవుని మాటలు స్వచ్ఛమైనవి (6)

  • 13

    • యెహోవా రక్షణ కోసం ఎదురుచూడడం

      • “యెహోవా, ఎంతకాలం?” (1, 2)

      • యెహోవా మెండుగా ఆశీర్వదిస్తాడు (6)

  • 14

    • మూర్ఖుడి వర్ణన

      • “యెహోవా లేడు” (1)

      • “మంచి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు” (3)

  • 15

    • యెహోవా గుడారంలో ఎవరు అతిథిగా ఉండగలరు?

      • అతను తన హృదయంలో సత్యం మాట్లాడతాడు (2)

      • లేనిపోనివి కల్పించి చెప్పడు (3)

      • నష్టం కలిగినా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు (4)

  • 16

    • యెహోవా, దీవెనలకు మూలం

      • “యెహోవా నా వంతు” (5)

      • రాత్రివేళ నా ఆలోచనలు నన్ను సరిచేస్తాయి (7)

      • ‘యెహోవా నా కుడిపక్కన ఉన్నాడు’ (8)

      • “నువ్వు నన్ను సమాధిలో విడిచిపెట్టవు” (10)

  • 17

    • సంరక్షణ కోసం ప్రార్థన

      • “నువ్వు నా హృదయాన్ని పరిశీలించావు” (3)

      • “నీ రెక్కల నీడలో” (8)

  • 18

    • రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించడం

      • “యెహోవా నా శైలం” (2)

      • యెహోవా విశ్వసనీయులతో విశ్వస​నీయంగా ఉంటాడు (25)

      • దేవుని మార్గం పరిపూర్ణమైనది (30)

      • “నీ వినయం నన్ను గొప్పవాణ్ణి చేస్తుంది” (35)

  • 19

    • దేవుని సృష్టి, ధర్మశాస్త్రం సాక్ష్యమిస్తున్నాయి

      • “ఆకాశం దేవుని మహిమను చాటుతోంది” (1)

      • దేవుని పరిపూర్ణ ధర్మశాస్త్రం సేదదీర్పునిస్తుంది (7)

      • “తెలియక చేసిన పాపాలు” (12)

  • 20

    • దేవుని అభిషిక్త రాజుకు రక్షణ

      • కొందరు రథాల మీద, గుర్రాల మీద ఆధారపడతారు, ‘మనం మాత్రం యెహోవా పేరున మొరపెట్టుకుంటాం’ (7)

  • 21

    • యెహోవాపై నమ్మకముంచే రాజుకు దీవెనలు

      • రాజుకు దీర్ఘాయుష్షును ఇవ్వడం (4)

      • దేవుని శత్రువులు ఓడిపోతారు (8-12)

  • 22

    • కృంగిపోయిన స్థితి నుండి స్తుతించే స్థితికి

      • “నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” (1)

      • “నా లోపలి వస్త్రం కోసం చీట్లు వేసుకుంటున్నారు” (18)

      • సమాజంలో దేవుణ్ణి స్తుతించడం (22, 25)

      • భూమంతా దేవుణ్ణి ఆరాధిస్తుంది (27)

  • 23

    • “యెహోవా నా కాపరి”

      • “నాకు ఏ లోటూ ఉండదు” (1)

      • “ఆయన నా ప్రాణాన్ని సేదదీరుస్తాడు” (3)

      • “నా గిన్నె పొంగిపొర్లుతుంది” (5)

  • 24

    • మహిమగల రాజు ద్వారాల గుండా ప్రవేశిస్తాడు

      • ‘భూమి యెహోవా సొంతం’ (1)

  • 25

    • నిర్దేశం, క్షమాపణ కోసం ప్రార్థన

      • “నీ త్రోవలు నాకు బోధించు” (4)

      • ‘యెహోవాతో దగ్గరి స్నేహం’ (14)

      • “నా పాపాలన్నీ క్షమించు” (18)

  • 26

    • యథార్థంగా నడవడం

      • “యెహోవా, నన్ను పరిశీలించు” (2)

      • చెడు సహవాసానికి దూరంగా ఉండడం (4, 5)

      • ‘నేను దేవుని బలిపీఠం చుట్టూ తిరుగుతాను’ (6)

  • 27

    • యెహోవా నా ప్రాణ దుర్గం

      • దేవుని ఆలయం పట్ల కృతజ్ఞతా భావం (4)

      • తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా యెహోవా పట్టించుకుంటాడు (10)

      • “యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి” (14)

  • 28

    • కీర్తనకర్త ప్రార్థనను దేవుడు విన్నాడు

      • “యెహోవా నా బలం, నా డాలు” (7)

  • 29

    • యెహోవా శక్తివంతమైన స్వరం

      • పవిత్రమైన బట్టలు వేసుకుని ఆరాధించండి (2)

      • “మహిమగల దేవుడు ఉరుముతున్నాడు” (3)

      • యెహోవా తన ప్రజల్ని బలపరుస్తాడు (11)

  • 30

    • దుఃఖం సంతోషంగా మారింది

      • దేవుని అనుగ్రహం జీవితకాలం ఉంటుంది (5)

  • 31

    • యెహోవాను ఆశ్రయించడం

      • “నా ప్రాణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను” (5)

      • “యెహోవా, సత్యవంతుడివైన దేవా” (5)

      • దేవుని మంచితనం విస్తారమైనది (19)

  • 32

    • క్షమాపణ పొందినవాళ్లు సంతోషంగా ఉంటారు

      • “నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకున్నాను” (5)

      • దేవుడు నీకు లోతైన అవగాహనను ఇస్తాడు (8)

  • 33

    • సృష్టికర్తను స్తుతించడం

      • “ఆయనకు ఒక కొత్త పాట పాడండి” (3)

      • యెహోవా తన మాటతో, ఊపిరితో సృష్టిని చేశాడు (6)

      • యెహోవా ప్రజలు సంతోషంగా ఉంటారు (12)

      • యెహోవా కళ్లు గమనిస్తూ ఉంటాయి (18)

  • 34

    • యెహోవా తన సేవకుల్ని కాపాడతాడు

      • “మనం కలిసి ఆయన పేరును ఘనపరుద్దాం” (3)

      • యెహోవా దూత కాపాడతాడు (7)

      • “యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి” (8)

      • ‘అతని ఎముకల్లో ఒక్కటి కూడా విరగలేదు’ (20)

  • 35

    • శత్రువుల నుండి కాపాడమని ప్రార్థన

      • శత్రువులు తరమబడతారు (5)

      • జన సమూహాల మధ్య దేవుణ్ణి స్తుతించడం (18)

      • కారణం లేకుండా ద్వేషించబడడం (19)

  • 36

    • దేవుని అమూల్యమైన విశ్వసనీయ ప్రేమ

      • దుష్టుడు దేవునికి భయపడడు (1)

      • దేవుడు జీవపు ఊట (9)

      • “నీ వెలుగు వల్లే మేము వెలుగు చూడగలుగుతున్నాం” (9)

  • 37

    • యెహోవా మీద నమ్మకముంచేవాళ్లు వర్ధిల్లుతారు

      • చెడ్డవాళ్లను చూసి బాధపడకు (1)

      • “యెహోవాను బట్టి అధికంగా సంతోషించు” (4)

      • “నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు” (5)

      • “సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు” (11)

      • నీతిమంతులు భిక్షమెత్తరు (25)

      • నీతిమంతులు భూమ్మీద శాశ్వతంగా జీవిస్తారు (29)

  • 38

    • పశ్చాత్తాపపడిన వ్యక్తి బాధతో చేసిన ప్రార్థన

      • “బాధలో ఉన్నాను, తీవ్రంగా కృంగిపోయాను” (6)

      • తన కోసం కనిపెట్టుకునే వాళ్ల ప్రార్థన యెహోవా వింటాడు (15)

      • “నా పాపం నన్ను బాధించింది” (18)

  • 39

    • జీవితం చిన్నది

      • మనిషి కేవలం ఊపిరి లాంటివాడు (5, 11)

      • “నా కన్నీళ్లు నిర్లక్ష్యం చేయకు” (12)

  • 40

    • సాటిలేని దేవునికి కృతజ్ఞతలు చెప్పడం

      • దేవుని పనులు లెక్కలేనన్ని (5)

      • దేవునికి కావల్సింది బలులు కాదు (6)

      • “నీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు సంతోషం” (8)

  • 41

    • మంచం పట్టినప్పుడు చేసిన ప్రార్థన

      • అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లను దేవుడు ఆదుకుంటాడు (3)

      • దగ్గరి స్నేహితుడు నమ్మకద్రోహం చేశాడు (9)

  • 42

    • మహాగొప్ప రక్షకుడైన దేవుణ్ణి స్తుతించడం

      • జింక నీళ్ల కోసం ఆశపడినట్టు దేవుని కోసం ఆశపడడం (1, 2)

      • “నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది?” (5, 11)

      • “దేవుని కోసం వేచివుంటాను” (5, 11)

  • 43

    • దేవుడు న్యాయమూర్తిగా రక్షిస్తాడు

      • ‘నీ వెలుగును, సత్యాన్ని పంపించు’ (3)

      • “నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది?” (5)

      • “దేవుని కోసం వేచివుంటాను” (5)

  • 44

    • సహాయం కోసం ప్రార్థన

      • “మమ్మల్ని కాపాడింది నువ్వే” (7)

      • “వధించబోయే గొర్రెల్లా” (22)

      • “లేచి మాకు సహాయం చేయి!” (26)

  • 45

    • అభిషేకించబడిన రాజు పెళ్లి

      • దయగల మాటలు (2)

      • “యుగయుగాలు దేవుడే నీ సింహాసనం” (6)

      • రాజు పెళ్లికూతురి అందాన్ని ఎంతో కోరుకుంటాడు (11)

      • కుమారులు భూమంతటా అధిపతులుగా ఉంటారు (16)

  • 46

    • “దేవుడే మన ఆశ్రయం”

      • దేవుని అద్భుతమైన కార్యాలు (8)

      • దేవుడు భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు (9)

  • 47

    • దేవుడు భూమంతటికీ రాజు

      • ‘యెహోవా సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తాడు’ (2)

      • దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడండి (6, 7)

  • 48

    • సీయోను, మహారాజు నగరం

      • భూమంతటికీ సంతోష కారణం (2)

      • నగరాన్ని, దాని బురుజుల్ని జాగ్రత్తగా పరిశీలించండి (11-13)

  • 49

    • సంపదల్ని నమ్ముకోవడం తెలివితక్కువతనం

      • ఏ వ్యక్తీ ఇంకో వ్యక్తిని విడిపించలేడు (7, 8)

      • దేవుడు సమాధి నుండి విడిపిస్తాడు (15)

      • సంపదలు మరణం నుండి కాపాడలేవు (16, 17)

  • 50

    • దేవుడు విశ్వసనీయుడికి, దుష్టుడికి మధ్య తీర్పుతీరుస్తాడు

      • బలి ఆధారంగా దేవుని ఒప్పందం (5)

      • “న్యాయమూర్తి దేవుడే” (6)

      • జంతువులన్నీ దేవునివే (10, 11)

      • దుష్టుల సంగతి దేవుడు బయటపెడతాడు (16-21)

  • 51

    • పశ్చాత్తాపపడిన వ్యక్తి ప్రార్థన

      • పుట్టడమే దోషంతో పుట్టడం (5)

      • “నా పాపాన్ని శుద్ధి చేయి” (7)

      • “నాలో పవిత్ర హృదయాన్ని కలిగించు” (10)

      • నలిగిన హృదయం దేవునికి ఇష్టం (17)

  • 52

    • దేవుని విశ్వసనీయ ప్రేమ మీద నమ్మకముంచడం

      • చెడ్డపనుల గురించి గొప్పలు చెప్పుకునేవాళ్లకు హెచ్చరిక (1-5)

      • భక్తిహీనులు సంపదల్ని నమ్ముకుంటారు (7)

  • 53

    • మూర్ఖుల వర్ణన

      • “యెహోవా లేడు” (1)

      • “మంచి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు” (3)

  • 54

    • శత్రువుల మధ్య సహాయం కోసం ప్రార్థన

      • “దేవుడే నా సహాయకుడు” (4)

  • 55

    • స్నేహితుడు నమ్మకద్రోహం చేసినప్పుడు ప్రార్థన

      • దగ్గరి స్నేహితుడు దూషించాడు (12-14)

      • “నీ భారం యెహోవా మీద వేయి” (22)

  • 56

    • హింసించబడినప్పుడు ప్రార్థన

      • “నేను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను” (4)

      • “నా కన్నీళ్లను నీ తోలుసంచిలో ఉంచు” (8)

      • “మనిషి నన్నేమి చేయగలడు?” (4, 11)

  • 57

    • అనుగ్రహం కోసం విన్నపం

      • దేవుని రెక్కల కింద ఆశ్రయం (1)

      • శత్రువులు వాళ్ల వలలో వాళ్లే చిక్కుకున్నారు (6)

  • 58

    • భూమికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు

      • చెడ్డవాళ్లను శిక్షించమని ప్రార్థన (6-8)

  • 59

    • దేవుడు ఒక డాలు, ఆశ్రయం

      • ‘ద్రోహం చేసేవాళ్ల మీద కరుణ చూపించకు’ (5)

      • “నీ శక్తి గురించి పాడతాను” (16)

  • 60

    • దేవుడు శత్రువుల్ని ఓడిస్తాడు

      • రక్షణ కోసం మనుషుల మీద ఆశ పెట్టుకోవడం వృథా (11)

      • “దేవుణ్ణి బట్టి మేము బలం పొందుతాం” (12)

  • 61

    • దేవుడు, శత్రువుల నుండి కాపాడే బలమైన బురుజు

      • ‘నేను నీ గుడారంలో అతిథిగా ఉంటాను’ (4)

  • 62

    • నిజమైన రక్షణ దేవుని నుండే వస్తుంది

      • “దేవుని కోసం నా ప్రాణం మౌనంగా ఎదురుచూస్తోంది” (1, 5)

      • ‘దేవుని ముందు మీ హృదయాలు కుమ్మరించండి’ (8)

      • మనుషులు వట్టి ఊపిరి లాంటివాళ్లు (9)

      • సంపదను నమ్ముకోకండి (10)

  • 63

    • దేవుని కోసం తపించడం

      • “నీ విశ్వసనీయ ప్రేమ జీవం కంటే ఉత్తమం” (3)

      • ‘శ్రేష్ఠమైన వాటితో నా ప్రాణం తృప్తి పొందింది’ (5)

      • రాత్రివేళ దేవుని గురించి ధ్యానించడం (6)

      • ‘నేను దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటాను’ (8)

  • 64

    • రహస్య పన్నాగాల నుండి కాపుదల

      • “దేవుడు వాళ్ల మీద బాణాలు వేస్తాడు” (7)

  • 65

    • భూమి పట్ల దేవుని శ్రద్ధ

      • “ప్రార్థనలు వినే దేవా” (2)

      • ‘నువ్వు ఎంచుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు’ (4)

      • దేవుని అపారమైన మంచితనం (11)

  • 66

    • సంభ్రమాశ్చర్యాలు పుట్టించే దేవుని కార్యాలు

      • “వచ్చి, దేవుని పనులు చూడండి” (5)

      • “నా మొక్కుబళ్లు నీకు చెల్లిస్తాను” (13)

      • దేవుడు ప్రార్థనలు వింటాడు (18-20)

  • 67

    • భూమ్మీదున్న ప్రజలందరూ దేవునికి భయపడతారు

      • దేవుని మార్గం తెలుస్తుంది (2)

      • ‘దేశదేశాల ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి’ (3, 5)

      • “దేవుడు మమ్మల్ని దీవిస్తాడు” (6, 7)

  • 68

    • ‘దేవుని శత్రువులు చెల్లాచెదురవ్వాలి’

      • “తండ్రిలేనివాళ్లకు తండ్రి” (5)

      • దేవుడు ఒంటరివాళ్లకు ఒక ఇల్లు ఇస్తాడు (6)

      • మంచివార్తను ప్రకటించే స్త్రీలు (11)

      • మనుషుల్ని కానుకలుగా తీసుకెళ్లావు (18)

      • ‘యెహోవా ప్రతీరోజు మన భారాలు మోస్తున్నాడు’ (19)

  • 69

    • రక్షించమని ప్రార్థన

      • “నీ మందిరం విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంది” (9)

      • “నాకు త్వరగా జవాబివ్వు” (17)

      • “పుల్లటి ద్రాక్షారసాన్ని ఇచ్చారు” (21)

  • 70

    • త్వరగా సహాయం చేయమని విన్నపం

      • “నా తరఫున త్వరగా చర్య తీసుకో” (5)

  • 71

    • వృద్ధుల నమ్మకం

      • చిన్నప్పటి నుండి దేవుణ్ణి నమ్ముకోవడం (5)

      • “నా బలం క్షీణించినప్పుడు” (9)

      • ‘చిన్నప్పటి నుండి దేవుడు నాకు బోధించాడు’ (17)

  • 72

    • దేవుని రాజు శాంతియుత పరిపాలన

      • “నీతిమంతులు వర్ధిల్లుతారు” (7)

      • సముద్రం నుండి సముద్రం వరకు ప్రజలు (8)

      • దౌర్జన్యం నుండి రక్షిస్తాడు (14)

      • భూమ్మీద సస్యసమృద్ధి (16)

      • దేవుని పేరు ఎప్పటికీ స్తుతించబడాలి (19)

  • 73

    • దైవభక్తి ఉన్న ఒకతను మళ్లీ సరిగ్గా ఆలోచించడం మొదలుపెడతాడు

      • “నా పాదాలు దాదాపు దారితప్పాయి” (2)

      • “రోజంతా నేను శ్రమ అనుభవించాను” (14)

      • ‘దేవుని పవిత్రమైన స్థలంలోకి అడుగుపెట్టే వరకు’ (17)

      • దుష్టులు జారుడు నేలమీదే ఉన్నారు (18)

      • దేవునికి దగ్గరవ్వడం మంచిది (28)

  • 74

    • తన ప్రజల్ని గుర్తుచేసుకోమని దేవునికి ప్రార్థన

      • దేవుని రక్షణ కార్యాలు గుర్తుచేసుకోవడం (12-17)

      • “శత్రువుల దూషణల్ని గుర్తుచేసుకో” (18)

  • 75

    • దేవుడు న్యాయంగా తీర్పుతీరుస్తాడు

      • దుష్టులు యెహోవా గిన్నెలోది తాగుతారు (8)

  • 76

    • సీయోను శత్రువులపై దేవుని విజయం

      • దేవుడు సాత్వికుల్ని కాపాడతాడు (9)

      • శత్రువుల గర్వాన్ని అణచివేస్తాడు (12)

  • 77

    • కష్టకాలంలో చేసిన ప్రార్థన

      • దేవుని కార్యాల్ని ధ్యానించడం (11, 12)

      • ‘దేవా, నీ అంత గొప్పవాళ్లు ఎవరు?’ (13)

  • 78

    • దేవుని శ్రద్ధ, ఇశ్రాయేలుకు విశ్వాసం లేకపోవడం

      • రాబోయే తరానికి చెప్పడం (2-8)

      • “వాళ్లు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు” (22)

      • “ఆకాశ ధాన్యం” (24)

      • “ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి దుఃఖపెట్టారు” (41)

      • ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి (43-55)

      • ‘వాళ్లు దేవుణ్ణి పరీక్షిస్తూ వచ్చారు’ (56)

  • 79

    • దేశాలు దేవుని ప్రజల మీదికి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన

      • “మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు” (4)

      • “నీ పేరును బట్టి మాకు సహాయం చేయి” (9)

      • ‘మా పొరుగువాళ్లకు ఏడురెట్లు ఎక్కువ శిక్ష విధించు’ (12)

  • 80

    • మళ్లీ దయ చూపించమని ఇశ్రాయేలు కాపరిని వేడుకోవడం

      • “దేవా, మళ్లీ మామీద దయ చూపించు” (3)

      • ఇశ్రాయేలు దేవుని ద్రాక్షతీగ (8-15)

  • 81

    • లోబడమని ప్రోత్సహించడం

      • అన్య దేవుళ్లను పూజించకూడదు (9)

      • ‘మీరు నా మాట వింటే ఎంత బావుంటుంది’ (13)

  • 82

    • నీతితో తీర్పు తీర్చమని పిలుపు

      • “దేవుళ్ల మధ్య” దేవుడు తీర్పు తీరుస్తున్నాడు (1)

      • ‘దీనుల్ని కాపాడండి’ (3)

      • “మీరు దేవుళ్లు” (6)

  • 83

    • శత్రువుల్ని బట్టి ప్రార్థన

      • “దేవా, నిశ్శబ్దంగా ఉండకు” (1)

      • శత్రువులు గిరగిర తిరిగే ముళ్లకొమ్మలా ఉన్నారు (13)

      • దేవుని పేరు యెహోవా (18)

  • 84

    • దేవుని గొప్ప గుడారం పట్ల ఇష్టం

      • ఒక లేవీయుడు పక్షిలా ఉండాలని కోరుకుంటాడు (3)

      • “నీ ప్రాంగణాల్లో ఒక్క రోజు” (10)

      • “దేవుడు సూర్యుడు, డాలు” (11)

  • 85

    • పునరుద్ధరించమని ప్రార్థన

      • దేవుడు తన విశ్వసనీయులకు శాంతిని ప్రకటిస్తాడు (8)

      • విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం కలుసుకుంటాయి (10)

  • 86

    • యెహోవా లాంటి దేవుడు లేడు

      • యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు (5)

      • దేశాలన్నీ యెహోవాకు వంగి నమస్కారం చేస్తాయి (9)

      • “నీ మార్గాన్ని నాకు బోధించు” (11)

      • “నాకు ఏక హృదయం దయచేయి” (11)

  • 87

    • సీయోను సత్యదేవుని నగరం

      • సీయోనులో పుట్టినవాళ్లు (4-6)

  • 88

    • మరణం నుండి కాపాడమని ప్రార్థన

      • “సమాధి అంచున ఉన్నాను” (3)

      • ‘ప్రతీ ఉదయం నీకు ప్రార్థిస్తాను’ (13)

  • 89

    • యెహోవా విశ్వసనీయ ప్రేమ గురించి పాడడం

      • దావీదుతో ఒప్పందం (3)

      • దావీదు సంతానం ఎప్పటికీ ఉంటుంది (4)

      • దేవుని అభిషిక్తుడు ఆయన్ని “తండ్రి” అని పిలుస్తాడు (26)

      • దావీదు ఒప్పందం ఖచ్చితమైనది (34-37)

      • మనిషి సమాధి నుండి తప్పించుకోలేడు (48)

  • 90

    • దేవుడు నిత్యుడు, మనిషి కొద్దికాలమే జీవిస్తాడు

      • వెయ్యి సంవత్సరాలు నిన్నలా (4)

      • మనిషి 70-80 ఏళ్లు బ్రతుకుతాడు (10)

      • “మా రోజులు లెక్కపెట్టడం మాకు నేర్పించు” (12)

  • 91

    • దేవుని రహస్య స్థలంలో కాపుదల

      • వేటగాడి ఉరిలో నుండి రక్షించబడ్డాడు (3)

      • దేవుని రెక్కల కింద ఆశ్రయం (4)

      • వేలమంది పడినా సురక్షితంగా ఉండడం (7)

      • కాపాడమని దూతలకు ఆజ్ఞ (11)

  • 92

    • యెహోవా శాశ్వతంగా హెచ్చించబడ్డాడు

      • ఆయన గొప్ప పనులు, లోతైన ఆలోచనలు (5)

      • ‘నీతిమంతులు చెట్టులా వర్ధిల్లుతారు’ (12)

      • వృద్ధులు ఫలిస్తూ ఉంటారు (14)

  • 93

    • యెహోవా పరిపాలనా వైభవం

      • “యెహోవా రాజయ్యాడు!” (1)

      • ‘నీ జ్ఞాపికలు నమ్మదగినవి’ (5)

  • 94

    • ప్రతీకారం తీర్చుకోమని దేవునికి ప్రార్థన

      • ‘దుష్టులు ఎంతకాలం ఉంటారు?’ (3)

      • యెహోవా సరిదిద్దితే సంతోషంగా ఉంటారు (12)

      • దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టడు (14)

      • “చట్టం పేరుతో సమస్యలు సృష్టించడం” (20)

  • 95

    • విధేయతతో సత్యారాధన

      • “ఈ రోజు మీరు ఆయన స్వరాన్ని వింటే” (7)

      • “మీ హృదయాల్ని కఠినపర్చుకోకండి” (8)

      • “వీళ్లు నా విశ్రాంతిలోకి ప్రవేశించరు” (11)

  • 96

    • “యెహోవాకు ఒక కొత్త పాట పాడండి”

      • యెహోవా అత్యంత స్తుతిపాత్రుడు (4)

      • దేశదేశాల ప్రజల దేవుళ్లు వ్యర్థమైన దేవుళ్లు (5)

      • పవిత్రమైన బట్టలు వేసుకుని ఆరాధించండి (9)

  • 97

    • యెహోవా ఇతర దేవుళ్ల కన్నా హెచ్చించబడ్డాడు

      • “యెహోవా రాజయ్యాడు!” (1)

      • యెహోవాను ప్రేమించండి, చెడును అసహ్యించుకోండి (10)

      • నీతిమంతులకు వెలుగు (11)

  • 98

    • యెహోవా రక్షకుడు, నీతిగల న్యాయమూర్తి

      • యెహోవా రక్షణ వెల్లడైంది (2, 3)

  • 99

    • యెహోవా పవిత్రుడైన రాజు

      • కెరూబుల పైన సింహాసనంలో కూర్చొని ఉన్నాడు (1)

      • క్షమించే, శిక్షించే దేవుడు (8)

  • 100

    • సృష్టికర్తకు కృతజ్ఞతలు చెప్పడం

      • “సంతోషంతో యెహోవాను సేవించండి” (2)

      • ‘దేవుడే మనల్ని చేశాడు’ (3)

  • 101

    • యథార్థంగా నడుచుకునే పరిపాలకుడు

      • ‘గర్వపు చూపును నేను సహించను’ (5)

      • ‘నమ్మకమైనవాళ్ల మీద దృష్టి నిలుపుతాను’ (6)

  • 102

    • కష్టాల వల్ల కృంగిపోయిన వ్యక్తి ప్రార్థన

      • “ఒంటరి పక్షిలా ఉన్నాను” (7)

      • “నా రోజులు కనుమరుగౌతున్న నీడలా ఉన్నాయి” (11)

      • “యెహోవా సీయోనును మళ్లీ నిర్మిస్తాడు” (16)

      • యెహోవా ఎప్పటికీ ఉంటాడు (26, 27)

  • 103

    • “నా ప్రాణమా, యెహోవాను స్తుతించు”

      • దేవుడు మన అపరాధాల్ని దూరంగా ఉంచుతాడు (12)

      • దేవుడు తండ్రిలా కరుణ చూపిస్తాడు (13)

      • మనం మట్టివాళ్లమని దేవుడు గుర్తుచేసుకుంటాడు (14)

      • యెహోవా సింహాసనం, రాజరికం (19)

      • దేవదూతలు దేవుని మాట నెరవేరుస్తారు (20)

  • 104

    • సృష్టిలోని అద్భుతాల్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం

      • భూమి ఎప్పటికీ ఉంటుంది (5)

      • మనిషి కోసం ద్రాక్షారసం, ఆహారం (15)

      • “నీ పనులు అసంఖ్యాకం!” (24)

      • ‘ఊపిరి తీసేసినప్పుడు అవి చనిపోతాయి’ (29)

  • 105

    • తన ప్రజల పట్ల యెహోవా నమ్మకమైన కార్యాలు

      • దేవుడు తన ఒప్పందాన్ని గుర్తుంచుకుంటాడు (8-10)

      • “నా అభిషిక్తుల్ని ముట్టకండి” (15)

      • బానిసగా ఉన్న యోసేపును దేవుడు ఉపయోగించుకున్నాడు (17-22)

      • ఐగుప్తులో దేవుని అద్భుతాలు (23-36)

      • ఐగుప్తు నుండి ఇశ్రాయేలు విడుదల (37-39)

      • అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని దేవుడు గుర్తుచేసుకున్నాడు (42)

  • 106

    • ఇశ్రాయేలీయులకు కృతజ్ఞత లేదు

      • వాళ్లు దేవుని పనుల్ని ఇట్టే మర్చిపోయారు (13)

      • దేవుని మహిమను ఎద్దు రూపానికి మార్చారు (19, 20)

      • దేవుని వాగ్దానం మీద వాళ్లకు విశ్వాసం లేదు (24)

      • బయలును పూజించడం మొదలుపెట్టారు (28)

      • పిల్లల్ని చెడ్డదూతలకు బలిగా అర్పించారు (37)

  • 107

    • దేవుని అద్భుతమైన పనుల్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి

      • ఆయన వాళ్లను సరైన దారిలో నడిపించాడు (7)

      • ఆకలితో, దాహంతో ఉన్నవాళ్లను తృప్తిపర్చాడు (9)

      • వాళ్లను చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చాడు (14)

      • తన ఆజ్ఞతో వాళ్లను బాగుచేశాడు (20)

      • ఆయన పేదవాళ్లను అణచివేత నుండి కాపాడతాడు (41)

  • 108

    • శత్రువులపై విజయం కోసం ప్రార్థన

      • రక్షణ కోసం మనుషుల మీద ఆశపెట్టుకోవడం వృథా (12)

      • “దేవుణ్ణి బట్టి మేము బలం పొందుతాం” (13)

  • 109

    • కృంగిపోయిన వ్యక్తి ప్రార్థన

      • ‘అతని స్థానం వేరే వ్యక్తి తీసుకోవాలి’ (8)

      • దేవుడు పేదవాడి కుడిపక్కన నిలబడతాడు (31)

  • 110

    • మెల్కీసెదెకు లాంటి రాజు, యాజకుడు

      • ‘నీ శత్రువుల మధ్య పరిపాలించు’ (2)

      • ఇష్టపూర్వకంగా వచ్చే యౌవనులు మంచు బిందువులు (3)

  • 111

    • యెహోవా గొప్ప పనుల్ని బట్టి ఆయన్ని స్తుతించండి

      • దేవుని పేరు పవిత్రమైనది, సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తుంది (9)

      • యెహోవా మీదుండే భయమే తెలివి (10)

  • 112

    • నీతిమంతుడు యెహోవాకు భయపడతాడు

      • ఉదారంగా అప్పిచ్చే వ్యక్తి వర్ధిల్లుతాడు (5)

      • “నీతిమంతులు ఎప్పటికీ గుర్తుచేసుకోబడతారు” (6)

      • ఉదార స్వభావులు పేదవాళ్లకు ఇస్తారు (9)

  • 113

    • ఉన్నత స్థలంలో నివసించే దేవుడు దీనుల్ని పైకి లేపుతాడు

      • యెహోవా పేరు సదాకాలం స్తుతించబడాలి (2)

      • దేవుడు వంగి చూస్తాడు (6)

  • 114

    • ఐగుప్తు నుండి ఇశ్రాయేలు విడుదల

      • సముద్రం పారిపోయింది (5)

      • పర్వతాలు పొట్టేళ్లలా గంతులు వేశాయి (6)

      • చెకుముకి రాయి నీటి ఊటగా మారింది (8)

  • 115

    • దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలి

      • ప్రాణంలేని విగ్రహాలు (4-8)

      • భూమిని మనుషులకు ఇచ్చాడు (16)

      • ‘చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు’ (17)

  • 116

    • కృతజ్ఞతా పాట

      • ‘నేను యెహోవాకు ఏమి ఇవ్వను?’ (12)

      • ‘రక్షణ పాత్ర పట్టుకుంటాను’ (13)

      • “యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను” (14, 18)

      • విశ్వసనీయుల మరణం అమూల్యమైనది (15)

  • 117

    • యెహోవాను స్తుతించమని అన్ని దేశాలకు పిలుపు

      • దేవుని విశ్వసనీయ ప్రేమ గొప్పది (2)

  • 118

    • విజయాన్ని ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం

      • ‘నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన జవాబిచ్చాడు’ (5)

      • “యెహోవా నా పక్షాన ఉన్నాడు” (6, 7)

      • వద్దనుకున్న రాయి ముఖ్యమైన మూలరాయి అవుతుంది (22)

      • “యెహోవా పేరున వస్తున్న వ్యక్తి” (26)

  • 119

    • దేవుని అమూల్య వాక్యం పట్ల కృతజ్ఞత

      • ‘యౌవనులు తమ మార్గాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకోగలరు?’ (9)

      • “నీ జ్ఞాపికలంటే నాకు చాలా ఇష్టం” (24)

      • “నీ మాట మీదే నేను ఆశపెట్టుకున్నాను” (74, 81, 114)

      • “నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను!” (97)

      • “నా బోధకులందరి కన్నా నాకు ఎక్కువ అవగాహన ఉంది” (99)

      • “నీ వాక్యం నా పాదానికి దీపం” (105)

      • “నీ వాక్య సారం సత్యం” (160)

      • దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్లకు శాంతి (165)

  • 120

    • శాంతి కోసం ఒక పరదేశి తపన

      • “మోసం చేసే నాలుక నుండి నన్ను కాపాడు” (2)

      • “నేను శాంతిని కోరుకుంటున్నాను” (7)

  • 121

    • యెహోవా తన ప్రజల్ని సంరక్షిస్తాడు

      • “యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది” (2)

      • యెహోవా అస్సలు నిద్రపోడు (3, 4)

  • 122

    • యెరూషలేము శాంతి కోసం ప్రార్థన

      • యెహోవా మందిరానికి వెళ్లే సంతోషం (1)

      • ఒక్కటిగా జత చేయబడిన నగరం (3)

  • 123

    • దయ కోసం యెహోవా వైపు చూడడం

      • ‘దాసుల్లా యెహోవా వైపు చూస్తున్నాం’ (2)

      • ‘మేం పడాల్సినన్ని అవమానాలు పడ్డాం’ (3)

  • 124

    • “యెహోవా మనతో పాటు లేకపోయుంటే”

      • తెగిపోయిన ఉచ్చు నుండి పారిపోవడం (7)

      • ‘యెహోవా పేరునే మనకు సహాయం దొరుకుతుంది’ (8)

  • 125

    • యెహోవా తన ప్రజల్ని రక్షిస్తాడు

      • “యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు” (2)

      • “ఇశ్రాయేలు మీద శాంతి ఉండాలి” (5)

  • 126

    • సీయోను ప్రజలు సంతోషంగా తిరిగిరావడం

      • ‘యెహోవా గొప్ప పనులు చేశాడు’ (3)

      • ఏడ్పు పోయి సంతోషం (5, 6)

  • 127

    • దేవుడు లేకపోతే అంతా వృథా

      • “యెహోవా ఇల్లు కట్టించకపోతే” (1)

      • పిల్లలు దేవుడిచ్చే బహుమానం (3)

  • 128

    • యెహోవాకు భయపడితే సంతోషం

      • భార్య ఫలించే ద్రాక్షతీగ (3)

      • “యెరూషలేము వర్ధిల్లడం నువ్వు చూడాలి” (5)

  • 129

    • దాడికి గురైనా ఓడిపోలేదు

      • సీయోనును ద్వేషించేవాళ్లు అవమానాలపాలు అవుతారు (5)

  • 130

    • “తీవ్రమైన నిరాశలో ఉండి నీకు ప్రార్థిస్తున్నాను”

      • “నువ్వు తప్పుల్ని గమనిస్తూ ఉంటే” (3)

      • యెహోవా దగ్గర నిజమైన క్షమాపణ దొరుకుతుంది (4)

      • “ఆత్రంగా నా ప్రాణం యెహోవా కోసం ఎదురుచూస్తోంది” (6)

  • 131

    • పాలు మానేసిన పిల్లాడిలా సంతృప్తిగా ఉండడం

      • గొప్పగొప్ప వాటి కోసం పాకులాడలేదు (1)

  • 132

    • దావీదును, సీయోనును ఎంచుకోవడం

      • “నీ అభిషిక్తుణ్ణి తిరస్కరించకు” (10)

      • సీయోను యాజకులకు రక్షణను వస్త్రంలా తొడగడం (16)

  • 133

    • ఐక్యంగా కలిసిమెలిసి జీవించడం

      • అహరోను తలమీద పోయబడిన తైలంలా (2)

      • హెర్మోను మంచులా (3)

  • 134

    • రాత్రివేళ దేవుణ్ణి స్తుతించడం

      • “పవిత్రతతో మీ చేతులెత్తి” (2)

  • 135

    • యెహోవా గొప్పతనాన్ని బట్టి ఆయన్ని స్తుతించండి

      • ఐగుప్తుకు వ్యతిరేకంగా సూచనలు, అద్భుతాలు (8, 9)

      • “నీ పేరు ఎప్పటికీ నిలిచివుంటుంది” (13)

      • ప్రాణంలేని విగ్రహాలు (15-18)

  • 136

    • యెహోవా విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది

      • ఆకాశాన్ని, భూమిని నైపుణ్యంతో చేశాడు (5, 6)

      • ఫరో ఎర్రసముద్రంలో చనిపోయాడు (15)

      • దీనస్థితిలో ఉన్నవాళ్లను దేవుడు గుర్తుచేసుకుంటాడు (23)

      • ప్రతీ ప్రాణికి ఆహారం (25)

  • 137

    • బబులోను నదుల పక్కన

      • సీయోను పాటల్లో దేన్నీ పాడలేదు (3, 4)

      • బబులోను నాశనమౌతుంది (8)

  • 138

    • దేవుడు ఉన్నతుడైనా పట్టించుకుంటాడు

      • ‘నా ప్రార్థనకు జవాబిచ్చావు’ (3)

      • ‘అపాయంలో ఉన్నా నన్ను కాపాడతావు’ (7)

  • 139

    • దేవునికి తన సేవకులు బాగా తెలుసు

      • దేవుని పవిత్రశక్తి నుండి తప్పించుకోలేం (7)

      • “నేను అద్భుతంగా చేయబడ్డాను” (14)

      • ‘నేను పిండంగా ఉన్నప్పుడే నన్ను చూశావు’ (16)

      • “శాశ్వత మార్గంలో నన్ను నడిపించు” (24)

  • 140

    • యెహోవా బలమైన రక్షకుడు

      • చెడ్డవాళ్లు పాముల్లాంటి వాళ్లు (3)

      • దౌర్జన్యం చేసేవాళ్లు నాశనమౌతారు (11)

  • 141

    • రక్షించమని ప్రార్థన

      • ‘నా ప్రార్థన ధూపంలా ఉండాలి’ (2)

      • నీతిమంతుడి గద్దింపు తైలం లాంటిది (5)

      • దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు (10)

  • 142

    • హింసించేవాళ్ల నుండి కాపాడమని ప్రార్థన

      • “నేను ఎక్కడికీ పారిపోలేను” (4)

      • ‘నాకున్నదల్లా నువ్వే’ (5)

  • 143

    • ఎండిన భూమిలా దేవుని కోసం తపించడం

      • ‘నీ కార్యాల్ని ధ్యానిస్తున్నాను’ (5)

      • “నీ ఇష్టాన్ని చేయడం నాకు నేర్పించు” (10)

      • ‘నీ పవిత్రశక్తి మంచిది, అది నన్ను నడిపించాలి’ (10)

  • 144

    • విజయం కోసం ప్రార్థన

      • ‘మనిషి ఏపాటివాడు?’ (3)

      • ‘శత్రువులు చెదరగొట్టబడాలి’ (6)

      • యెహోవా ప్రజలు ధన్యులు (15)

  • 145

    • గొప్ప రాజైన దేవుణ్ణి స్తుతించడం

      • ‘దేవుని గొప్పతనాన్ని నేను చాటిచెప్తాను’ (6)

      • “యెహోవా అందరికీ మంచి చేస్తాడు” (9)

      • “నీ విశ్వసనీయులు నిన్ను స్తుతిస్తారు” (10)

      • దేవుని శాశ్వత రాజరికం (13)

      • దేవుని చెయ్యి ప్రతీ జీవిని తృప్తిపరుస్తుంది (16)

  • 146

    • దేవుణ్ణి నమ్ముకోండి, మనుషుల్ని కాదు

      • మనిషి చనిపోయినప్పుడు ఆలోచనలు నశించిపోతాయి (4)

      • కృంగిపోయిన వాళ్లను దేవుడు పైకి లేపుతాడు (8)

  • 147

    • దేవుని ప్రేమగల, శక్తివంతమైన పనుల్ని స్తుతించడం

      • విరిగిన హృదయంగల వాళ్లను ఆయన బాగుచేస్తాడు (3)

      • నక్షత్రాలన్నిటినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు (4)

      • ఆయన మంచును ఉన్నిలా పంపుతున్నాడు (16)

  • 148

    • సృష్టంతా యెహోవాను స్తుతించాలి

      • “ఆయన దూతలారా, మీరంతా ఆయన్ని స్తుతించండి” (2)

      • ‘సూర్యచంద్రులారా, తారలారా, ఆయన్ని స్తుతించండి’ (3)

      • యౌవనులు, వృద్ధులు దేవుణ్ణి స్తుతించాలి (12, 13)

  • 149

    • దేవుని విజయాన్ని స్తుతించే పాట

      • దేవుడు తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడు (4)

      • ఘనత దేవుని విశ్వసనీయులకు చెందుతుంది (9)

  • 150

    • ఊపిరి తీసుకునే ప్రతీ ప్రాణి యెహోవాను స్తుతించాలి

      • హల్లెలూయా! (1, 6)