కీర్తనలు 127:1-5

  • దేవుడు లేకపోతే అంతా వృథా

    • “యెహోవా ఇల్లు కట్టించకపోతే” (1)

    • పిల్లలు దేవుడిచ్చే బహుమానం (3)

యాత్ర కీర్తన. సొలొమోనుది. 127  యెహోవా ఇల్లు కట్టించకపోతే,దాన్ని కట్టేవాళ్ల ప్రయాస వృథా.+ యెహోవా నగరాన్ని కాపాడకపోతే,+దాని కాపలావాళ్లు మెలకువగా ఉండడం వృథా.   మీరు పెందలకడ లేచి,చాలా రాత్రి వరకు మెలకువగా ఉండిఆహారం కోసం కష్టపడడం వృథా;ఎందుకంటే, ఆయన తాను ప్రేమించేవాళ్లకు కావాల్సిన వాటిని, అలాగే మంచి నిద్రను కూడా ఇస్తున్నాడు.+   పిల్లలు* యెహోవా ఇచ్చే ఆస్తి;+గర్భఫలం ఆయనిచ్చే బహుమతి.+   యౌవనకాలంలో పుట్టే కుమారులుబలవంతుడి చేతిలో బాణాల లాంటివాళ్లు.+   వాటితో తన అంబులపొదిని నింపుకునేవాళ్లు ధన్యులు.*+వాళ్లు సిగ్గుపడరు, ఎందుకంటే, వాళ్ల కుమారులు నగర ద్వారం దగ్గర శత్రువులకు జవాబిస్తారు.

అధస్సూచీలు

అక్ష., “కుమారులు.”
లేదా “సంతోషంగా ఉంటారు.”