యెషయా 61:1-11

  • మంచివార్త ప్రకటించడానికి అభిషేకించడం (1-11)

    • “యెహోవా అనుగ్రహ సంవత్సరం” (2)

    • “నీతి వృక్షాలు” (3)

    • పరదేశులు సహాయం చేస్తారు (5)

    • “యెహోవా యాజకులు” (6)

61  సర్వోన్నత ప్రభువైన యెహోవా పవిత్రశక్తి నా మీద ఉంది,+సాత్వికులకు మంచివార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.+ నలిగిన హృదయం గలవాళ్లను బాగుచేయడానికి,బందీలకు విడుదలను ప్రకటించడానికి,ఖైదీల కళ్లు పెద్దగా తెరవబడతాయని ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు.+   యెహోవా అనుగ్రహ సంవత్సరం గురించి,మన దేవుని ప్రతీకార రోజు+ గురించి ప్రకటించడానికి,దుఃఖించే వాళ్లందర్నీ ఓదార్చడానికి+ ఆయన నన్ను పంపాడు.   సీయోను విషయంలో దుఃఖిస్తున్న వాళ్లకుబూడిదకు బదులు అలంకార కిరీటాన్ని,ఏడ్పుకు బదులు సంతోష తైలాన్ని,కృంగిపోయిన మనసుకు బదులు స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన నన్ను పంపాడు. వాళ్లు నీతి వృక్షాలు అని,తనకు మహిమ* తెచ్చుకోవడానికి యెహోవా నాటిన చెట్లు అని పిలవబడతారు.+   వాళ్లు పురాతన శిథిలాల్ని తిరిగి నిర్మిస్తారు;ఒకప్పటి నిర్మానుష్య స్థలాల్ని మళ్లీ నిలబెడతారు,+నాశనమైన నగరాల్ని,తరతరాలపాటు నిర్మానుష్యంగా పడివున్న స్థలాల్ని+ బాగుచేస్తారు.+   “అపరిచితులు వచ్చి మీ గొర్రెల మందల్ని కాస్తారు,పరదేశులు+ మీ రైతులుగా, మీ ద్రాక్షతోటల కాపలావాళ్లుగా ఉంటారు.+   మీరేమో యెహోవా యాజకులని పిలవబడతారు;+వాళ్లు మిమ్మల్ని మన దేవుని పరిచారకులని పిలుస్తారు. మీరు దేశాల వనరుల్ని అనుభవిస్తారు,+వాళ్ల మహిమగల సంపదల్ని బట్టి మీరు గొప్పలు చెప్పుకుంటారు.   మీరు అవమానానికి బదులు రెట్టింపు గౌరవం పొందుతారు,అవమానం పాలయ్యే బదులు సంతోషంతో కేకలు వేస్తారు. అవును, వాళ్లు తమ దేశంలో రెండుపాళ్లు పొందుతారు.+ నిత్య సంతోషం వాళ్ల సొంతమౌతుంది.+   ఎందుకంటే యెహోవానైన నేను న్యాయాన్ని ప్రేమిస్తాను;+దోపిడీ అన్నా, అవినీతి అన్నా నాకు అసహ్యం.+ నేను నమ్మకంగా వాళ్ల జీతం వాళ్లకు ఇస్తాను,వాళ్లతో శాశ్వత ఒప్పందం చేస్తాను.+   దేశాల మధ్య వాళ్ల సంతానం,*జనాల మధ్య వాళ్ల వంశస్థులు సుప్రసిద్ధులౌతారు.+ వాళ్లను చూసేవాళ్లందరూవాళ్లు యెహోవా దీవించినవాళ్ల సంతానమని+ గుర్తుపడతారు.” 10  నేను యెహోవాను బట్టి చాలా సంతోషిస్తాను. నా ప్రాణమంతా నా దేవుణ్ణి బట్టి సంతోషిస్తుంది.+ ఎందుకంటే ఆయన నాకు రక్షణ వస్త్రాలు తొడిగాడు;+నీతి అనే చొక్కా* నాకు వేశాడు,నేను, యాజకుడి లాంటి తలపాగాను పెట్టుకున్న+ పెళ్లికుమారుడిలా,తన నగలతో అలంకరించుకున్న పెళ్లికూతురిలా ఉన్నాను. 11  ఎందుకంటే భూమి మొక్కల్ని మొలిపించినట్టు,తోట తనలో నాటబడిన విత్తనాల్ని మొలకెత్తేలా చేసినట్టు,సర్వోన్నత ప్రభువైన యెహోవాదేశాలన్నిటి ముందు నీతి, స్తుతి మొలకెత్తేలా+ చేస్తాడు.+

అధస్సూచీలు

లేదా “సౌందర్యం.”
అక్ష., “విత్తనం.”
లేదా “చేతుల్లేని నిలువుటంగీ.”