యెషయా 2:1-22

  • యెహోవా పర్వతం హెచ్చించబడుతుంది (1-5)

    • ఖడ్గాల్ని నాగటి నక్కులుగా చేస్తారు (4)

  • యెహోవా రోజు గర్విష్ఠుల్ని అవమానాలపాలు చేస్తుంది (6-22)

2  ఆమోజు కుమారుడైన యెషయా యూదా గురించి, యెరూషలేము గురించి దర్శనంలో చూసిన విషయాలు:+   ఆ రోజుల చివర్లో*యెహోవా మందిర పర్వతంపర్వత శిఖరాల పైన దృఢంగా స్థాపించబడుతుంది,+కొండల కన్నా ఎత్తుగా ఎత్తబడుతుంది,అన్నిదేశాల వాళ్లు ప్రవాహంలా అక్కడికి వస్తారు.+   దేశదేశాల ప్రజలు వచ్చి ఇలా చెప్పుకుంటారు: “రండి, మనం యెహోవా పర్వతం మీదికి,యాకోబు దేవుని మందిరానికి వెళ్దాం,+ ఆయన తన మార్గాల గురించి మనకు నేర్పిస్తాడు,మనం ఆయన త్రోవల్లో నడుద్దాం.”+ ఎందుకంటే, సీయోను నుండి ధర్మశాస్త్రం,*యెరూషలేము నుండి యెహోవా వాక్యం బయల్దేరతాయి.+   దేశాల మధ్య ఆయన న్యాయం తీరుస్తాడు,దేశదేశాల ప్రజలకు సంబంధించిన విషయాల్ని చక్కదిద్దుతాడు.* వాళ్లు తమ ఖడ్గాల్ని నాగటి నక్కులుగా,తమ ఈటెల్ని మచ్చుకత్తులుగా* సాగగొడతారు.+ దేశం మీదికి దేశం ఖడ్గం ఎత్తదు,వాళ్లిక యుద్ధం చేయడం నేర్చుకోరు.+   యాకోబు ఇంటివాళ్లారా, రండి,మనం యెహోవా వెలుగులో నడుద్దాం.+   దేవా, నీ ప్రజలైన యాకోబు ఇంటివాళ్లను నువ్వు వదిలేశావు,+ఎందుకంటే వాళ్ల దేశం తూర్పుకు సంబంధించిన ఆచారాలతో నిండిపోయింది;ఫిలిష్తీయుల్లా వాళ్లు ఇంద్రజాలాన్ని చేస్తున్నారు,+వాళ్ల దేశం పరదేశుల పిల్లలతో నిండిపోయింది.   వాళ్ల దేశం వెండిబంగారాలతో నిండిపోయింది,వాళ్ల సంపదలకు అంతు లేదు. వాళ్ల దేశం గుర్రాలతో నిండిపోయింది,వాళ్ల రథాల సంఖ్యకు పరిమితి లేదు.+   వాళ్ల దేశం వ్యర్థమైన దేవుళ్లతో నిండిపోయింది.+ వాళ్లు తమ సొంత చేతులతో చేసిన వాటికి,తమ వేళ్లతో మలిచిన వాటికి వంగి నమస్కారం చేస్తారు.   కాబట్టి మనిషి తగ్గించబడతాడు, అవమానాలపాలు అవుతాడు,నువ్వు వాళ్లను మన్నించలేవు. 10  యెహోవా భీకర ప్రత్యక్షతను బట్టి,ఆయన మహిమాన్విత వైభవాన్ని బట్టిమీరంతా బండ సందుల్లోకి దూరండి, మట్టిలో దాక్కోండి.+ 11  గర్విష్ఠుల తలలు వంచబడతాయి,మనుషుల అహంకారం అణచివేయబడుతుంది. ఆ రోజు యెహోవా మాత్రమే హెచ్చించబడతాడు. 12  ఎందుకంటే అది సైన్యాలకు అధిపతైన యెహోవాకు చెందిన రోజు.+ అది గర్విష్ఠులందరి మీదికి, అహంకారులందరి మీదికి,గొప్పవాళ్లయినా సామాన్యులైనా ప్రతీ ఒక్కరి మీదికి వస్తుంది.+ 13  లెబానోనులో ఉన్న ఎత్తైన, గొప్పగొప్ప దేవదారు చెట్లన్నిటి మీదికి,బాషానులో ఉన్న సింధూర వృక్షాలన్నిటి మీదికి, 14  గొప్పగొప్ప పర్వతాలన్నిటి మీదికి,ఎత్తైన కొండలన్నిటి మీదికి, 15  ఎత్తైన ప్రతీ బురుజు మీదికి, బలమైన ప్రతీ ప్రాకారం మీదికి, 16  తర్షీషు ఓడలన్నిటి+ మీదికి,అందమైన పడవలన్నిటి మీదికి అది వస్తుంది. 17  మనిషి గర్వం అణచబడుతుంది,మనుషుల అహంకారం తగ్గించబడుతుంది. ఆ రోజు యెహోవా మాత్రమే హెచ్చించబడతాడు. 18  వ్యర్థమైన దేవుళ్లు ఇక ఎక్కడా కనిపించరు.+ 19  భూమిని భయంతో వణికిపోయేలా చేయడానికి యెహోవా లేచినప్పుడు,ఆయన భీకర ప్రత్యక్షతను బట్టి,ఆయన మహిమాన్విత వైభవాన్ని బట్టి+ప్రజలు బండ గుహల్లోకి,నేల బొరియల్లోకి దూరతారు.+ 20  ఆ రోజు మనుషులు వెండిబంగారాలతో చేసిన తమ వ్యర్థమైన దేవుళ్లను,తాము వంగి నమస్కరించడానికి చేసుకున్న దేవుళ్లను తీసుకొని,చుంచెలుకల* ముందు, గబ్బిలాల ముందు పారేస్తారు.+ 21  భూమిని భయంతో వణికిపోయేలా చేయడానికి యెహోవా లేచినప్పుడు,ఆయన భీకర ప్రత్యక్షతను బట్టి,ఆయన మహిమాన్విత వైభవాన్ని బట్టిబండ సందుల్లోకి, కొండ గుహల్లోకి దూరడం కోసంవాళ్లు అలా పారేస్తారు. 22  మీ మంచి కోసం చెప్తున్నాను, మనిషి మీద నమ్మకం పెట్టుకోవడం మానేయండి,అతను కేవలం తన ముక్కురంధ్రాల్లో ఉన్న ఊపిరితో సమానం.* అతన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోవాలి?

అధస్సూచీలు

లేదా “చివరి రోజుల్లో.”
లేదా “ఉపదేశం.”
లేదా “సరిదిద్దుతాడు.”
అంటే, మొక్కల్ని కత్తిరించే కత్తెరలు.
తిండిబోతు చిన్న క్షీరదాలు.
లేదా “అతని ఊపిరి అతని ముక్కురంధ్రాల్లో ఉంటుంది.”