యెషయా 42:1-25

  • దేవుని సేవకుడు, ఆయన నియామకం (1-9)

    • ‘నా పేరు యెహోవా’ (8)

  • యెహోవాను స్తుతించడానికి కొత్త పాట (10-17)

  • ఇశ్రాయేలు గుడ్డివాడు, చెవిటివాడు (18-25)

42  ఇదిగో! నేను ఆదుకునే నా సేవకుడు!+ నేను ఆయన్ని ఎంచుకున్నాను,+ ఆయన్ని చూసి సంతోషిస్తున్నాను!*+ నా పవిత్రశక్తిని ఆయనలో ఉంచాను;+ఆయన దేశాలకు న్యాయం చేస్తాడు.+   ఆయన కేకలు వేయడు, అరవడు,వీధుల్లో తన స్వరం వినబడనివ్వడు.+   ఆయన నలిగిన రెల్లును విరవడు,ఆరిపోబోతున్న వత్తిని ఆర్పడు.+ ఆయన నమ్మకంగా న్యాయాన్ని జరిగిస్తాడు.+   భూమ్మీద న్యాయాన్ని స్థాపించేవరకు ఆయన అలసిపోడు, చితికిపోడు;+ద్వీపాలు ఆయన ఉపదేశం* కోసం వేచిచూస్తూ ఉంటాయి.   యెహోవాయే సత్యదేవుడు, ఆయనే ఆకాశాన్ని సృష్టించాడు.దాన్ని విస్తరింపజేసిన మహాగొప్ప దేవుడు ఆయనే.+ఆయనే భూమిని, దాని పంటను పరిచాడు.+దానిమీదున్న ప్రజలకు ఊపిరిని, దానిలో నడిచేవాళ్లకు జీవశక్తిని* ఇస్తున్నది ఆయనే.+ఆయనిలా అంటున్నాడు:   “యెహోవా అనే నేను నీతితో నిన్ను పిలిచాను;నేను నీ చేతిని పట్టుకున్నాను. నిన్ను కాపాడి, ప్రజలకు నిన్ను ఒప్పందంగా,+దేశాలకు వెలుగుగా చేస్తాను.+   నువ్వు గుడ్డివాళ్ల కళ్లను తెరవాలని,+బందీగృహంలో నుండి ఖైదీలను బయటికి తేవాలని,చీకట్లో కూర్చున్నవాళ్లను చెరసాల నుండి విడిపించాలని అలా చేస్తాను.+   నేను యెహోవాను. ఇదే నా పేరు;నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను,*నాకు రావాల్సిన స్తుతిని చెక్కిన విగ్రహాలకు చెందనివ్వను.+   చూడండి, ముందు చెప్పిన సంగతులు జరిగిపోయాయి;ఇప్పుడు కొత్త సంగతులు చెప్తున్నాను. అవి పుట్టకముందే, వాటి గురించి నేను మీకు చెప్తున్నాను.”+ 10  సముద్రంలో ప్రయాణించేవాళ్లారా, సముద్రంలోని సమస్తమా,ద్వీపాల్లారా, వాటి నివాసులారా,+యెహోవాకు కొత్త పాట పాడండి,+భూమి కొనల నుండి ఆయనకు స్తుతిగీతాలు పాడండి.+ 11  ఎడారి, దాని నగరాలు,కేదారు+ నివాస ప్రాంతాలు తమ స్వరాన్ని పెంచాలి.+ బండరాళ్ల మధ్య నివసించేవాళ్లు సంతోషంతో కేకలు వేయాలి;పర్వత శిఖరాల మీద నుండి వాళ్లు బిగ్గరగా అరవాలి. 12  వాళ్లు యెహోవాకు మహిమ ఆపాదించాలి,ద్వీపాల్లో ఆయనకు స్తుతులు చెల్లించాలి.+ 13  యెహోవా బలశాలిలా బయల్దేరతాడు.+ యోధుడిలా+ ఆయన తన ఆసక్తిని పురికొల్పుకుంటాడు. ఆయన బిగ్గరగా అరుస్తాడు, అవును, యుద్ధకేక వినిపిస్తాడు;తన శత్రువుల కన్నా తాను బలవంతుణ్ణని నిరూపించుకుంటాడు.+ 14  “చాలాకాలం నేను మౌనంగా ఉన్నాను. నిశ్శబ్దంగా ఉండి ఓపిక పట్టాను. ప్రసవిస్తున్న స్త్రీలా ఒక్కసారిగా నేనుమూల్గుతూ, ఒగరుస్తూ, రొప్పుతాను. 15  నేను పర్వతాల్ని, కొండల్ని నాశనం చేస్తాను;వాటిమీదున్న మొక్కలన్నిటినీ ఎండిపోజేస్తాను. నదుల్ని ద్వీపాలుగా* మారుస్తానుజమ్ము మడుగుల్ని ఎండిపోజేస్తాను.+ 16  గుడ్డివాళ్లను వాళ్లకు తెలియని దారిలో నడిపిస్తాను,+అంతగా పరిచయం లేని దారుల్లో వాళ్లు నడిచేలా చేస్తాను.+ వాళ్ల ముందున్న చీకటిని వెలుగుగా మారుస్తాను,+ఎగుడుదిగుడు ప్రదేశాన్ని చదునైన నేలగా చేస్తాను.+ నేను వాళ్లకు ఇవన్నీ చేస్తాను, వాళ్లను విడిచిపెట్టను.” 17  చెక్కిన విగ్రహాల మీద నమ్మకం పెట్టుకునేవాళ్లు,పోత* విగ్రహాలతో, “మీరే మా దేవుళ్లు” అని చెప్పేవాళ్లువెనక్కి తిరిగెళ్లిపోతారు, పూర్తిగా అవమానాలపాలు అవుతారు.+ 18  చెవిటివాళ్లారా, వినండి;గుడ్డివాళ్లారా, కళ్లు తెరిచి చూడండి.+ 19  నా సేవకుడు తప్ప గుడ్డివాళ్లు ఎవరు?నేను పంపే సందేశకుని అంత చెవిటివాళ్లు ఎవరు? నేను ప్రతిఫలం ఇచ్చిన వ్యక్తి అంత గుడ్డివాళ్లు ఎవరు?యెహోవా సేవకుని అంత గుడ్డివాళ్లు ఎవరు?+ 20  మీరు చాలా విషయాలు చూశారు, కానీ వాటిని పట్టించుకోలేదు. మీ చెవులు తెరుచుకునే ఉన్నాయి కానీ మీరు వినలేదు.+ 21  యెహోవా తన నీతి కోసంతన ధర్మశాస్త్రాన్ని* ఘనపర్చడంలో, దాన్ని మహిమపర్చడంలో సంతోషించాడు. 22  కానీ ఈ ప్రజలు దోచుకోబడినవాళ్లు, కొల్లగొట్టబడినవాళ్లు;+వాళ్లంతా గుహల్లో ఇరుక్కుపోయారు, చెరసాలల్లో దాచబడ్డారు.+ వాళ్లు దోచుకోబడ్డారు కానీ రక్షించేవాళ్లు ఎవ్వరూ లేరు.+వాళ్లు కొల్లగొట్టబడ్డారు కానీ “వాళ్లను వెనక్కి తీసుకురండి!” అని చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు. 23  ఎవరు దీన్ని వింటారు? రాబోయే కాలం కోసం ఎవరు మనసుపెట్టి ఆలకిస్తారు? 24  కొల్లగొట్టడానికి యాకోబును,దోచుకునేవాళ్లకు ఇశ్రాయేలును అప్పగించింది ఎవరు? మనం ఎవరికి విరుద్ధంగా పాపం చేశామో ఆ యెహోవా కాదా? ఆయన మార్గాల్లో నడవడానికి వాళ్లు ఇష్టపడలేదు,ఆయన ధర్మశాస్త్రానికి* వాళ్లు లోబడలేదు.+ 25  కాబట్టి ఆయన తన ఆగ్రహాన్ని,కోపాగ్నిని, యుద్ధ క్రోధాన్ని అతని మీద కుమ్మరిస్తూ వచ్చాడు.+ అది అతని చుట్టూ ఉన్న వాటన్నిటిని దహించేసింది, కానీ అతను పట్టించుకోలేదు.+ అది అతని మీద రగులుకుంది, కానీ అతను దానిమీద మనసు పెట్టలేదు.+

అధస్సూచీలు

లేదా “ఆయన్ని ఆమోదించాను!”
అక్ష., “ధర్మశాస్త్రం.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “ఎవ్వరితోనూ పంచుకోను.”
లేదా “తీరప్రాంతాలుగా.”
లేదా “లోహపు.”
లేదా “ఉపదేశాన్ని.”
లేదా “ఉపదేశానికి.”