యెషయా 35:1-10

  • మళ్లీ పరదైసుగా మారుతుంది (1-7)

    • గుడ్డివాళ్లు చూస్తారు; చెవిటివాళ్లు వింటారు (5)

  • తిరిగి కొనబడినవాళ్ల కోసం పవిత్ర మార్గం (8-10)

35  ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి,+ఎడారి మైదానం సంతోషించి కుంకుమ* పువ్వులా వికసిస్తుంది.+   అది తప్పకుండా వికసిస్తుంది;+సంతోషంతో ఆనందంగా కేకలు వేస్తుంది. లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది,+కర్మెలు,+ షారోనుల+ వైభవం దానికి ఉంటుంది. యెహోవా మహిమను, మన దేవుని వైభవాన్ని వాళ్లు చూస్తారు.   బలహీనంగా ఉన్న చేతుల్ని బలపర్చండి,వణుకుతున్న మోకాళ్లను దృఢపర్చండి.+   హృదయంలో ఆందోళనపడుతున్న వాళ్లతో ఇలా చెప్పండి: “ధైర్యంగా ఉండండి. భయపడకండి. ఇదిగో! స్వయంగా మీ దేవుడే పగ తీర్చుకోవడానికి వస్తాడు.ప్రతీకారం చేయడానికి దేవుడు వస్తాడు.+ ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”+   అప్పుడు గుడ్డివాళ్ల కళ్లు తెరవబడతాయి,+చెవిటివాళ్ల చెవులు విప్పబడతాయి.+   కుంటివాళ్లు జింకలా గంతులేస్తారు,+మూగవాళ్ల నాలుక సంతోషంతో కేకలు వేస్తుంది.+ ఎడారిలో నీళ్లు ఉబుకుతాయి,ఎడారి మైదానంలో కాలువలు పారతాయి.   ఎండిన నేల జమ్ము మడుగు అవుతుంది,దాహంగా ఉన్న నేలలో నీటి ఊటలు పుడతాయి.+ నక్కలు విశ్రాంతి తీసుకున్న చోట+పచ్చగడ్డి, రెల్లు, జమ్ము* పెరుగుతాయి.   ఒక రాజమార్గం ఉంటుంది,+అవును, పవిత్ర మార్గం అనే దారి ఉంటుంది. అపవిత్రులు దానిలో ప్రయాణించరు.+ అర్హులైనవాళ్లు మాత్రమే అందులో నడుస్తారు;మూర్ఖులెవ్వరూ దారితప్పి ఆ మార్గంలోకి వెళ్లరు.   సింహాలేవీ అక్కడ ఉండవు,క్రూరమైన అడవి మృగాలేవీ ఆ దారిలోకి రావు. అవి అక్కడ కనిపించవు;+తిరిగి కొనబడినవాళ్లు మాత్రమే అక్కడ నడుస్తారు.+ 10  యెహోవా విడిపించినవాళ్లు సంతోషంతో కేకలు వేస్తూ సీయోనుకు తిరిగొస్తారు.+ వాళ్ల తలల మీద శాశ్వత ఆనందం అనే కిరీటం ఉంటుంది.+ ఉల్లాసం, సంతోషం వాళ్ల సొంతమౌతాయి,దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతాయి.+

అధస్సూచీలు

లేదా “కస్తూరి.”
లేదా “పపైరస్‌.”