మీకా 5:1-15

  • ఒక పరిపాలకుని గొప్పతనం భూమంతటా వ్యాపిస్తుంది (1-6)

    • ఆ పరిపాలకుడు బేత్లెహేము నుండి వస్తాడు (2)

  • మిగిలినవాళ్లు మంచులా, సింహంలా ఉంటారు (7-9)

  • దేశం శుభ్రం చేయబడుతుంది (10-15)

5  “ముట్టడించబడిన కూతురా,నిన్ను నువ్వే కోసుకుంటున్నావు;శత్రువులు మనల్ని ముట్టడించారు.+ వాళ్లు ఇశ్రాయేలు న్యాయమూర్తిని కర్రతో చెంపమీద కొడుతున్నారు.+   బేత్లెహేము ఎఫ్రాతా,+యూదా పట్టణాల్లో అతి చిన్న పట్టణమా,నా కోసం ఇశ్రాయేలును పరిపాలించే వ్యక్తి నీలో నుండి వస్తాడు,+ఆయన ఆరంభం ప్రాచీనకాలాల నుండి, పురాతన కాలాల నుండి ఉంది.   కాబట్టి, ప్రసవించే స్త్రీ బిడ్డను కనేంతవరకుదేవుడు తన ప్రజల్ని వదిలేస్తాడు. ఆయన సహోదరుల్లో మిగిలినవాళ్లు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగొస్తారు.   ఆయన లేచి యెహోవా బలాన్ని బట్టి,తన దేవుడైన యెహోవా పేరుకున్న గొప్పతనాన్ని బట్టి కాస్తాడు,+ వాళ్లు సురక్షితంగా నివసిస్తారు,+ఎందుకంటే, ఆయన గొప్పతనం భూమి అంచుల దాకా చేరుతుంది.+   ఆయన శాంతి కలగజేస్తాడు.+ అష్షూరు మన మీద దండెత్తి, మన పటిష్ఠమైన బురుజుల్ని తొక్కితే,+దానితో పోరాడడానికి మనుషుల్లో నుండి ఏడుగురు కాపరుల్ని, అవును, ఎనిమిదిమంది అధిపతుల్ని* నియమిస్తాం.   వాళ్లు అష్షూరును ఖడ్గంతో కాస్తారు,+నిమ్రోదు+ దేశాన్ని దాని ప్రవేశ ద్వారాల దగ్గర కాస్తారు. అష్షూరు మన మీద దండెత్తి, మన ప్రాంతాల్ని తొక్కినప్పుడు,ఆయన మనల్ని అష్షూరు చేతిలో నుండి రక్షిస్తాడు.+   యాకోబు వంశస్థుల్లో మిగిలినవాళ్లు అనేక దేశాల ప్రజల మధ్యయెహోవా కురిపించే మంచులా ఉంటారు,మనుషుల మీద ఆశ పెట్టుకోకుండా,మనుషుల కోసం ఎదురుచూడకుండా,మొక్కల మీద పడే వానజల్లులా ఉంటారు.   యాకోబు వంశస్థుల్లో మిగిలినవాళ్లు దేశాల మధ్య,అనేక దేశాల ప్రజల మధ్య,అడవిలో మృగాల మధ్యవుండే సింహంలా ఉంటారు,గొర్రెల మందల్లోకి దూసుకెళ్లి, అమాంతం వాటి మీద పడి,వాటిని ముక్కలుముక్కలుగా చీల్చేసే కొదమ సింహంలా ఉంటారు;ఆ ప్రజల్ని రక్షించేవాళ్లంటూ ఎవ్వరూ ఉండరు.   మీరు మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు,మీ శత్రువులందరూ నాశనం చేయబడతారు.” 10  యెహోవా ఇలా చెప్తున్నాడు:“ఆ రోజున నేను నీ గుర్రాల్ని నాశనం చేస్తాను, నీ రథాల్ని ధ్వంసం చేస్తాను. 11  నీ దేశంలోని నగరాల్ని నాశనం చేస్తాను,ప్రాకారాలుగల నీ స్థలాలన్నిటినీ కూల్చేస్తాను. 12  నువ్వు అభ్యసించే క్షుద్రవిద్యను ఆపుతాను,ఇంద్రజాలం చేసేవాళ్లెవ్వరూ నీ మధ్య మిగలరు.+ 13  నేను నీ మధ్య నుండి నీ చెక్కుడు విగ్రహాల్ని, నీ పూజా స్తంభాల్ని నిర్మూలిస్తాను,నువ్విక నీ చేతులతో తయారుచేసుకున్న వాటికి వంగి నమస్కరించవు.+ 14  నీ పూజా కర్రల్ని* నీ మధ్యలో నుండి ఊడబెరుకుతాను,+నీ నగరాల్ని సమూలంగా నాశనం చేస్తాను. 15  నాకు విధేయత చూపించని దేశాల మీద కోపంతో, ఆగ్రహంతో పగ తీర్చుకుంటాను.”

అధస్సూచీలు

లేదా “నాయకుల్ని.”
పదకోశం చూడండి.