కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈరోజుల్లో మనకు సరైన దారి ఎవరు చూపిస్తారు?

ఈరోజుల్లో మనకు సరైన దారి ఎవరు చూపిస్తారు?

ఈ లోకం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. మరి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాయి అనే నమ్మకం ఉందా? ఈరోజు కరెక్ట్‌ అనుకున్నది రేపు తప్పు అని తేలితే ఎలా?

బైబిలు ఇచ్చే సలహాల్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే, మీరు బాధపడే పరిస్థితి ఎప్పటికీ రాదు. అంత గ్యారంటీగా ఎలా చెప్పవచ్చు? ఎందుకంటే బైబిల్ని రాయించింది మన సృష్టికర్త. మనం హాయిగా, సంతోషంగా ఉండడానికి ఏం అవసరమో ఆయనకు బాగా తెలుసు.

“ఏది మంచిదో ఆయన నీకు తెలియజేశాడు.”—మీకా 6:8.

బైబిలు ఇచ్చే తెలివైన సలహాల్ని మనం పూర్తిగా నమ్మవచ్చు. అవి ‘ఇప్పుడూ, ఎప్పుడూ ఆధారపడదగినవి.’—కీర్తన 111:8.

రోజురోజుకీ మారిపోతున్న ఈ లోకంలో బైబిలు మీకు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?