కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏది తప్పు? ఏది ఒప్పు? మనందరి ముందున్న ప్రశ్న

ఏది తప్పు? ఏది ఒప్పు? మనందరి ముందున్న ప్రశ్న

మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూడని చోటికి వెళ్లాలనుకుంటే, ఏం చేస్తారు?

  1. 1. మీకు సరైనది అనిపించిన దారిలో వెళ్లిపోతారా?

  2. 2. మీ ముందున్న వాళ్లకు దారి తెలిసే ఉంటుంది అనుకొని, వాళ్ల వెనకాలే వెళ్తారా?

  3. 3. మ్యాప్‌ చూస్తూ వెళ్లడమో, ఆ దారి తెలిసిన మీ స్నేహితుడిని అడగడమో చేస్తారా?

మొదటి రెండు పనులు చేస్తే ఎక్కడో ఒకచోటికి వెళ్తారు గానీ, ఖచ్చితంగా మీరు అనుకున్న చోటికే వెళ్తారన్న గ్యారంటీ లేదు. కానీ మూడో పని చేస్తే గ్యారంటీగా మీరు అనుకున్న చోటికే వెళ్లవచ్చు.

జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణం సాఫీగా సాగిపోవాలి, సంతోషంగా ఉండాలి అన్నదే మనందరి కోరిక. మనం తీసుకునే నిర్ణయాలు ఆ కోరికను నిజం చేయవచ్చు లేదా దూరం చేయవచ్చు.

చిన్నచిన్న నిర్ణయాలు మన జీవన ప్రయాణాన్ని అంతగా దెబ్బతీయకపోవచ్చు. కానీ కొన్ని నిర్ణయాలు చాలా పెద్దవి, ముఖ్యమైనవి. అవి మన విలువల్ని, తప్పు-ఒప్పుల విషయంలో మన అభిప్రాయాన్ని తెలియజేస్తాయి. అలాంటి పెద్దపెద్ద నిర్ణయాలు మనకు, మన కుటుంబానికి మంచైనా చేయవచ్చు లేదా చెడైనా చేయవచ్చు. వాటిలో కొన్ని ఏంటంటే:

  • పెళ్లి, సెక్స్‌

  • పని, డబ్బు, నిజాయితీ

  • పిల్లల్ని పెంచే తీరు

  • నలుగురితో మెలిగే విధానం

ఇలాంటి విషయాల్లో మీ నిర్ణయాల వల్ల మీకు, మీవాళ్లకు ఎప్పుడూ మంచే జరగాలంటే ఏం చేయాలి?

మనందరి ముందున్న ప్రశ్న ఏంటంటే: ఏది తప్పో ఏది ఒప్పో నేను ఎలా తెలుసుకోవచ్చు?

ఈ విషయంలో బైబిలు మీకు ఎలా సహాయం చేస్తుందో, మీరు దాన్ని ఎందుకు నమ్మవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.