కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పద్దెనిమిదవ అధ్యాయం

బాప్తిస్మం, దేవునితో మీ సంబంధం

బాప్తిస్మం, దేవునితో మీ సంబంధం
  • క్రైస్తవ బాప్తిస్మం ఎలా ఇవ్వబడుతుంది?

  • బాప్తిస్మానికి అర్హులయ్యేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

  • ఒక వ్యక్తి దేవునికి ఎలా సమర్పించుకుంటాడు?

  • బాప్తిస్మం తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి?

1. ఐతియోపీయుడైన అధికారి బాప్తిస్మం కోసం ఎందుకు అడిగాడు?

 ‘ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమిటి?’ అని మొదటి శతాబ్దంలో, ఐతియోపీయుడైన ఒక అధికారి ప్రశ్నించాడు. ఫిలిప్పు అనే క్రైస్తవుడు, వాగ్దత్త మెస్సీయ వేరెవరో కాదు యేసే అని ఆయనకు రుజువు చేశాడు. లేఖనాల్లో నుండి తాను తెలుసుకున్న విషయాలనుబట్టి ప్రేరేపితుడైన ఆ ఐతియోపీయుడు వెంటనే చర్య తీసుకున్నాడు. తాను బాప్తిస్మం తీసుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన వ్యక్తం చేశాడు!—అపొస్తలుల కార్యములు 8:26-36.

2. బాప్తిస్మం గురించి మీరు ఎందుకు గంభీరంగా ఆలోచించాలి?

2 మీరు యెహోవాసాక్షుల్లో ఒకరితో ఈ పుస్తకంలోని ముందరి అధ్యాయాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి ఉంటే, ‘నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏమిటి?’ అని అడగడానికి సిద్ధంగా ఉన్నట్లు మీరూ భావించవచ్చు. ఇప్పటికల్లా మీరు పరదైసులో నిత్యజీవానికి సంబంధించిన బైబిలు వాగ్దానం గురించి తెలుసుకొని ఉంటారు. (లూకా 23:43; ప్రకటన 21:3, 4) చనిపోయినవారి నిజ స్థితి గురించి, పునరుత్థాన నిరీక్షణ గురించి కూడా మీరు తెలుసుకున్నారు. (ప్రసంగి 9:5; యోహాను 5:28, 29) మీరు బహుశా యెహోవాసాక్షుల సంఘ కూటాల్లో వారితో సహవసిస్తూ, వారు సత్యమతాన్ని ఎలా అభ్యసిస్తున్నారో స్వయంగా చూసి ఉంటారు. (యోహాను 13:35) అత్యంత ప్రాముఖ్యంగా, మీరు యెహోవా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం ఆరంభించి ఉంటారు.

3. (ఎ) యేసు తన అనుచరులకు ఏమని ఆజ్ఞాపించాడు? (బి) నీటి బాప్తిస్మం ఎలా ఇవ్వబడుతుంది?

3 మీరు దేవుణ్ణి సేవించాలని కోరుకుంటున్నట్లు ఎలా చూపించవచ్చు? యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: ‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేస్తూ, వారికి బాప్తిస్మమివ్వండి.’ (మత్తయి 28:19) యేసు స్వయంగా నీటిలో బాప్తిస్మం తీసుకొని ఒక మాదిరి ఉంచాడు. ఆయనపై నీళ్లు చిలకరించబడలేదు, లేదా ఆయన తలపై కొంత నీరు పోయబడలేదు. (మత్తయి 3:16) “బాప్తిస్మము” అనే మాట “నీళ్లలో ముంచుట” అనే భావంగల గ్రీకు పదం నుండి వచ్చింది. కాబట్టి క్రైస్తవ బాప్తిస్మం అంటే పూర్తిగా నీళ్లలో ముంచడం అని అర్థం.

4. నీటి బాప్తిస్మం దేనిని సూచిస్తుంది?

4 యెహోవా దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోరుకునే వారందరూ నీటి బాప్తిస్మం తీసుకోవాలి. దేవుణ్ణి సేవించాలనే మీ కోరికను బాప్తిస్మం బహిరంగంగా సూచిస్తుంది. యెహోవా చిత్తం చేయడంలో మీరు సంతోషిస్తున్నారని అది చూపిస్తుంది. (కీర్తన 40:7, 8) అయితే బాప్తిస్మానికి అర్హులవడానికి, మీరు నిర్దిష్టంగా కొన్ని చర్యలు తీసుకోవాలి.

పరిజ్ఞానం, విశ్వాసం అవసరం

5. (ఎ) బాప్తిస్మానికి అర్హులవడానికి అవసరమైన మొదటి చర్య ఏమిటి? (బి) క్రైస్తవ కూటాలు ఎందుకు ప్రాముఖ్యం?

5 మీరు ఇప్పటికే మొదటి చర్య తీసుకోవడం ఆరంభించారు. ఎలా? బహుశా క్రమబద్ధమైన బైబిలు అధ్యయనం చేస్తూ యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తును ఎరుగుట ద్వారా అంటే వారి గురించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా. (యోహాను 17:3 చదవండి.) అయితే అది మాత్రమే సరిపోదు. క్రైస్తవులు ‘[దేవుని] చిత్తాన్ని పూర్ణముగా గ్రహించినవారిగా’ ఉండాలని కోరుకుంటారు. (కొలొస్సయులు 1:9) ఈ విషయంలో యెహోవాసాక్షుల సంఘ కూటాలకు హాజరవడం ఎంతగానో సహాయం చేస్తుంది. అలాంటి కూటాలకు హాజరవడం ప్రాముఖ్యం. (హెబ్రీయులు 10:24, 25) క్రమంగా కూటాలకు హాజరవడం దేవుని గురించి తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది.

బాప్తిస్మానికి అర్హులవడానికి, దేవుని వాక్యంలోని ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం ఒక ప్రాముఖ్యమైన చర్య

6. బాప్తిస్మానికి అర్హులవడానికి మీకు ఎంత బైబిలు పరిజ్ఞానం ఉండాలి?

6 నిజమే, బాప్తిస్మానికి అర్హులవడానికి బైబిల్లోని ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆ ఐతియోపీయుడైన అధికారికి కొంత పరిజ్ఞానం ఉంది, అయితే లేఖనాల్లోని కొన్ని భాగాలను అర్థం చేసుకోవడానికి ఆయనకు సహాయం అవసరమైంది. (అపొస్తలుల కార్యములు 8:30, 31) అదేవిధంగా, మీరు తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉంది. నిజం చెప్పాలంటే, దేవుని గురించి మీరు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. (ప్రసంగి 3:11) అయితే మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ముందు, కనీసం బైబిలు ప్రాథమిక బోధలను తెలుసుకొని, అంగీకరించాలి. (హెబ్రీయులు 5:12) అలాంటి బోధల్లో చనిపోయినవారి స్థితికి సంబంధించిన సత్యం, దేవుని పేరు, ఆయన రాజ్యం యొక్క ప్రాముఖ్యత వంటివి ఉన్నాయి.

7. బైబిలు అధ్యయనం మీ మీద ఎలాంటి ప్రభావం చూపించాలి?

7 అయితే పరిజ్ఞానం మాత్రమే సరిపోదు, ఎందుకంటే “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము.” (హెబ్రీయులు 11:6) ప్రాచీన నగరమైన కొరింథులోని కొందరు క్రైస్తవ సందేశాన్ని విన్నప్పుడు వారు “విశ్వసించి బాప్తిస్మము పొందిరి” అని బైబిలు మనకు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 18:8) అదేవిధంగా బైబిలు అధ్యయనం, బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమనే విశ్వాసాన్ని మీలో నింపాలి. అలాగే బైబిలు అధ్యయనం దేవుని వాగ్దానాలనూ, యేసు బలికి ఉన్న రక్షణ శక్తినీ విశ్వసించేందుకు కూడా మీకు సహాయం చేయాలి.—యెహోషువ 23:14; అపొస్తలుల కార్యములు 4:12; 2 తిమోతి 3:16-17.

బైబిలు సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం

8. మీరు తెలుసుకున్నది ఇతరులతో పంచుకోవడానికి మిమ్మల్ని ఏది పురికొల్పుతుంది?

8 మీ హృదయంలో విశ్వాసం అధికమయ్యే కొద్దీ మీరు తెలుసుకున్న విషయాలను మీలోనే దాచుకోవడం కష్టమవుతుంది. (యిర్మీయా 20:9) దేవుని గురించి ఆయన సంకల్పాల గురించి ఇతరులతో మాట్లాడేందుకు మీరు బలమైన ప్రేరణ పొందుతారు.2 కొరింథీయులు 4:13-15 చదవండి.

మీరు నమ్మేది ఇతరులతో పంచుకోవడానికి విశ్వాసం మిమ్మల్ని పురికొల్పాలి

9, 10. (ఎ) బైబిలు సత్యాన్ని మీరు ఎవరితో పంచుకోవడం ఆరంభించవచ్చు? (బి) యెహోవాసాక్షుల వ్యవస్థీకృత ప్రకటనా పనిలో భాగం వహించాలని కోరుకుంటే మీరు ఏమి చేయాలి?

9 మీరు మీ బంధువులతో, స్నేహితులతో, పొరుగువారితో, తోటి ఉద్యోగస్థులతో సందర్భోచితంగా మాట్లాడుతూ బైబిలు సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం ఆరంభించవచ్చు. చివరకు మీరు యెహోవాసాక్షులతో వ్యవస్థీకృత ప్రకటనా పనిలో భాగం వహించాలని కూడా కోరుకోవచ్చు. ఆ సమయంలో మీరు మీకు బైబిలు బోధిస్తున్న సాక్షితో ఈ విషయం గురించి మాట్లాడండి. మీరు పరిచర్యకు అర్హులైనట్లనిపిస్తే మీరు, మీకు అధ్యయనం నిర్వహిస్తున్న వ్యక్తి ఇద్దరు సంఘ పెద్దలతో సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేయబడతాయి.

10 ఇది దేవుని మందను కాస్తున్న క్రైస్తవ పెద్దల్లో కొందరితో మరింత పరిచయం ఏర్పరచుకోవడానికి మీకు దోహదపడుతుంది. (అపొస్తలుల కార్యములు 20:28; 1 పేతురు 5:2, 3) మీరు బైబిలు ప్రాథమిక బోధలను అర్థం చేసుకొని వాటిని నమ్ముతున్నారనీ, దేవుని సూత్రాలకు అనుగుణంగా జీవిస్తున్నారనీ, యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఉండాలని మీరు నిజంగా కోరుకుంటున్నారనీ ఆ పెద్దలు గమనించినప్పుడు, మీరు బాప్తిస్మం తీసుకోని ప్రచారకులుగా పరిచర్యలో భాగం వహిస్తూ సువార్త ప్రకటించడానికి అర్హులు అనే విషయాన్ని మీకు తెలియజేస్తారు.

11. పరిచర్యలో భాగం వహించడానికి అర్హులు కావాలంటే కొందరు ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

11 అలాకాని పక్షంలో, పరిచర్యకు అర్హులవడానికి మీ జీవన విధానంలో, అలవాట్లలో మీరు కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది. వీటిలో ఇతరుల దృష్టికిరాకుండా దాచివుంచిన కొన్ని రహస్య అలవాట్లను మానుకోవడం ఉండవచ్చు. కాబట్టి, బాప్తిస్మం తీసుకోని ప్రచారకులవడం గురించి మీరు అడగడానికి ముందు లైంగిక దుర్నీతి, త్రాగుబోతుతనం, మాదక ద్రవ్యాల అలవాటు వంటి గంభీరమైన పాపాలను విడిచిపెట్టాలి.1 కొరింథీయులు 6:9, 10; గలతీయులు 5:19-21 చదవండి.

మారుమనస్సు, పరివర్తనం

12. మారుమనస్సు ఎందుకు అవసరం?

12 బాప్తిస్మానికి అర్హులవడానికి ముందు మీరు మరికొన్ని చర్యలు తీసుకోవాలి. అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి.” (అపొస్తలుల కార్యములు 3:20) మారుమనస్సు పొందడమంటే మీరు గతంలో చేసినవాటి విషయంలో మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడడం అని అర్థం. ఒక వ్యక్తి గతంలో అనైతిక జీవితాన్ని గడిపినట్లయితే అతను మారుమనస్సు పొందడం సమంజసమే, అయితే ఒక మోస్తరు నైతిక జీవితాన్ని గడిపిన వ్యక్తి కూడా మారుమనస్సు పొందాలి. ఎందుకు? ఎందుకంటే, మానవులందరూ పాపులే కాబట్టి వారికి దేవుని క్షమాపణ అవసరం. (రోమీయులు 3:23; 5:12) బైబిలు అధ్యయనానికి ముందు దేవుని చిత్తం ఏమిటో మీకు తెలియదు. కాబట్టి ఆయన చిత్తానికి పూర్తి అనుగుణంగా జీవించే అవకాశమే మీకు లేదుకదా? అందుకే, మారుమనస్సు అవసరం.

13. పరివర్తన చెందడం అంటే ఏమిటి?

13 మారుమనస్సు పొందిన తర్వాత, ‘వెనుదిరగాలి’ అంటే పరివర్తన చెందాలి. కేవలం పశ్చాత్తాపం మాత్రమే సరిపోదు. మీరు మీ గత జీవిత విధానాన్ని తిరస్కరించి, ఇకమీదట సరైనదే చేస్తానని దృఢంగా తీర్మానించుకోవాలి. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మారుమనస్సు, పరివర్తన చెందడం అనే ఈ రెండు చర్యలను మీరు తప్పక తీసుకోవాలి.

వ్యక్తిగతంగా సమర్పించుకోవడం

14. బాప్తిస్మానికి ముందు మీరు ఏ ప్రాముఖ్యమైన చర్య తీసుకోవాలి?

14 బాప్తిస్మానికి ముందు తీసుకోవలసిన మరో ప్రాముఖ్యమైన చర్య ఉంది. మిమ్మల్ని మీరు యెహోవా దేవునికి సమర్పించుకోవాలి.

ప్రార్థనలో మీరు వ్యక్తిగతంగా దేవునికి సమర్పించుకున్నారా?

15, 16. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవడం అంటే ఏమిటి, ఇలా సమర్పించుకోవడానికి ఒక వ్యక్తిని ఏది పురికొల్పుతుంది?

15 హృదయపూర్వక ప్రార్థనలో మిమ్మల్ని మీరు యెహోవా దేవునికి సమర్పించుకున్నప్పుడు, నిత్యం ఆయనపట్ల మాత్రమే అవిభాగిత భక్తిని కలిగివుంటానని మీరు వాగ్దానం చేస్తున్నారు. (మత్తయి 4:10) అయితే ఒక వ్యక్తి ఆ విధంగా చేయాలని ఎందుకు కోరుకుంటాడు? ఉదాహరణకు, ఒక వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకునే అమ్మాయిని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుందాం. ఆమెను మరింతగా అర్థం చేసుకుంటూ, ఆమెలోని చక్కని లక్షణాలను గమనిస్తున్నకొద్దీ ఆమెపట్ల అతను మరింత ఆకర్షితుడవుతాడు. చివరకు అతను సహజంగానే ఆమెను వివాహం చేసుకుంటానని అడుగుతాడు. వివాహం చేసుకోవడం అంటే అదనంగా మరిన్ని బాధ్యతలను చేపట్టడం అనేమాట నిజమే. అయితే ఆ ప్రాముఖ్యమైన చర్య తీసుకోవడానికి ప్రేమ అతణ్ణి పురికొల్పుతుంది.

16 మీరు యెహోవాను తెలుసుకొని, ఆయనను ప్రేమించడం ప్రారంభించినప్పుడు పూర్ణమనస్సుతో ఆయన సేవ చేయడానికి లేదా అంకిత భావంతో ఆయనను ఆరాధించడానికి పురికొల్పబడతారు. ఎవరైనా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును అనుసరించాలని కోరుకుంటే, ఆ వ్యక్తి తనను తాను ‘ఉపేక్షించుకోవాలి.’ (మార్కు 8:34) మనం దేవునికి చూపించే సంపూర్ణ విధేయతకు మన కోరికలు, లక్ష్యాలు అడ్డురాకుండా చూసుకోవడం ద్వారా మనలను మనం ఉపేక్షించుకుంటాం. కాబట్టి బాప్తిస్మం తీసుకోవడానికి ముందే యెహోవా దేవుని చిత్తం చేయడం మీ జీవిత ప్రధాన సంకల్పంగా ఉండాలి.1 పేతురు 4:2 చదవండి.

తప్పిపోతామనే భయాన్ని అధిగమించడం

17. దేవునికి సమర్పించుకోవడానికి కొందరు ఎందుకు వెనుకంజ వేయవచ్చు?

17 కొందరు అలాంటి గంభీరమైన చర్య తీసుకోవడానికి భయపడి యెహోవాకు సమర్పించుకోవడానికి వెనుకంజ వేస్తారు. సమర్పిత క్రైస్తవునిగా దేవునికి జవాబుదారులై ఉండడం గురించి వారు భయపడవచ్చు. తాము తప్పిపోయి యెహోవాకు నిరాశ కలిగిస్తామనే భయంతో వారు దేవునికి సమర్పించుకోకపోవడమే మంచిదని అనుకుంటారు.

18. యెహోవాకు సమర్పించుకునేందుకు మిమ్మల్ని ఏది పురికొల్పవచ్చు?

18 యెహోవాను ప్రేమించడం నేర్చుకునే కొద్దీ, ఆయనకు సమర్పించుకొని, ఆ సమర్పణకు అనుగుణంగా జీవించేందుకు శాయశక్తులా కృషి చేయడానికి మీరు పురికొల్పబడతారు. (ప్రసంగి 5:4) ఆ సమర్పణ తర్వాత మీరు తప్పకుండా ‘అన్ని విషయములలో ప్రభువును [యెహోవాను] సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని’ కోరుకుంటారు. (కొలొస్సయులు 1:9-10) దేవునిపట్ల మీకున్న ప్రేమనుబట్టి ఆయన చిత్తం చేయడం కష్టమన్నట్లు మీరు భావించరు. మీరు నిస్సందేహంగా అపొస్తలుడైన యోహానుతో ఏకీభవిస్తారు. ఆయన ఇలా వ్రాశాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహాను 5:3.

19. దేవునికి సమర్పించుకోవడానికి మీరు భయపడవలసిన అవసరం ఎందుకు లేదు?

19 దేవునికి సమర్పించుకోవడానికి మీరు పరిపూర్ణులుగా ఉండవలసిన అవసరం లేదు. మీ పరిమితులు ఏమిటో యెహోవాకు తెలుసు, మీరు చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేయాలని ఆయన ఎన్నడూ ఆశించడు. (కీర్తన 103:14) మీరు సఫలం కావాలని అభిలషిస్తూ ఆయన మిమ్మల్ని బలపరిచి, మీకు సహాయం చేస్తాడు. (యెషయా 41:9-10 చదవండి.) మీరు మీ పూర్ణ హృదయంతో యెహోవాను ప్రేమిస్తే, ఆయన మీ “త్రోవలను సరాళము చేయును” అనే నమ్మకంతో మీరుండవచ్చు.—సామెతలు 3:5, 6.

బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీ సమర్పణను సూచించడం

20. యెహోవాకు సమర్పించుకోవడం కేవలం ఏకాంతంలో చేసే విషయంగా ఎందుకు ఉండకూడదు?

20 మనం ఇప్పుడు చర్చించిన విషయాల గురించి ఆలోచించడం, మీరు ప్రార్థనలో వ్యక్తిగతంగా యెహోవాకు సమర్పించుకోవడానికి సహాయం చేయవచ్చు. దేవుణ్ణి నిజంగా ప్రేమించే ప్రతీ ఒక్కరూ ‘రక్షణ కలుగునట్లు బహిరంగంగా నోటితో ఒప్పుకోవాలి.’ (రోమీయులు 10:10) మీరు బహిరంగంగా నోటితో ఎలా ఒప్పుకుంటారు?

బాప్తిస్మం అనేది గత జీవన విధానం విషయంలో మరణించి దేవుని చిత్తం చేయడానికి తిరిగి బ్రతకడాన్ని సూచిస్తుంది

21, 22. మీరు మీ విశ్వాసాన్ని ఎలా ‘బహిరంగముగా నోటితో ఒప్పుకోవచ్చు’?

21 మీరు బాప్తిస్మం తీసుకోవాలని కోరుకుంటున్నట్లు పెద్దల సభ సమన్వయకర్తకు తెలియజేయండి. అప్పుడు ఆయన బైబిలు ప్రాథమిక బోధలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను మీతో సమీక్షించేందుకు కొందరు పెద్దలను ఏర్పాటు చేస్తాడు. ఆ పెద్దలు మీరు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులేనని నిర్ధారిస్తే, మీరు తర్వాతి సమావేశంలో బాప్తిస్మం తీసుకోవచ్చని మీకు తెలియజేస్తారు. a సాధారణంగా అలాంటి సందర్భాల్లో బాప్తిస్మపు అర్థాన్ని సమీక్షించే ప్రసంగం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ప్రసంగీకుడు, బాప్తిస్మం తీసుకొనే సభ్యులు ఒక విధంగా తమ విశ్వాసాన్ని ‘బహిరంగముగా నోటితో ఒప్పుకుంటున్నట్లు’ జవాబివ్వడానికి వారందరినీ రెండు సరళమైన ప్రశ్నలు అడుగుతాడు.

22 అప్పుడు ఆ బాప్తిస్మమే మీరు దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా యెహోవాసాక్షుల్లో ఒకరయ్యారని మిమ్మల్ని బహిరంగంగా గుర్తిస్తుంది. బాప్తిస్మం తీసుకునేవారు యెహోవాకు సమర్పించుకున్నారని బహిరంగంగా వెల్లడిచేసేందుకు వారిని నీళ్లలో పూర్తిగా ముంచి బాప్తిస్మం ఇవ్వబడుతుంది.

మీ బాప్తిస్మానికి అర్థం

23. “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో” బాప్తిస్మం పొందడం అంటే అర్థం ఏమిటి?

23 యేసు తన శిష్యులు “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో” బాప్తిస్మం పొందుతారని చెప్పాడు. (మత్తయి 28:19) అంటే బాప్తిస్మం తీసుకునే వ్యక్తి యెహోవా దేవుని అధికారాన్ని, యేసుక్రీస్తు అధికారాన్ని గుర్తిస్తాడని అర్థం. (కీర్తన 83:18; మత్తయి 28:18) అలాగే ఆయన దేవుని పరిశుద్ధాత్మను కూడా గుర్తిస్తాడు, అంటే దేవుని చురుకైన శక్తి కార్యశీలతను కూడా గుర్తిస్తాడు.—గలతీయులు 5:22, 23; 2 పేతురు 1:21.

24, 25. (ఎ) బాప్తిస్మం దేనిని సూచిస్తుంది? (బి) ఏ ప్రశ్నకు జవాబు అవసరం?

24 అయితే బాప్తిస్మం అనేది కేవలం స్నానం కాదు. అది చాలా ప్రాముఖ్యమైన అంశానికి సూచనగా ఉంది. నీటిలో మునగడం మీరు మీ పాత జీవన విధానం విషయంలో మరణించారని సూచిస్తుంది. నీళ్లలో నుండి మీరు పైకి రావడం ఇప్పుడు దేవుని చిత్తం చేయడానికి మీరు తిరిగి బ్రతకడాన్ని సూచిస్తుంది. మీరు యెహోవా దేవునికే సమర్పించుకున్నారు గానీ, ఏదో పనికో, ఉద్దేశానికో, ఇతర మానవులకో, సంస్థకో సమర్పించుకోలేదని కూడా గుర్తుంచుకోవాలి. మీ సమర్పణ, బాప్తిస్మం అనేవి దేవునితో మీ సన్నిహిత స్నేహానికి అంటే ఆయనతో వ్యక్తిగత సంబంధానికి ఆరంభం మాత్రమే.—కీర్తన 25:14.

25 బాప్తిస్మం రక్షణకు హామీ కాదు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.” (ఫిలిప్పీయులు 2:12) బాప్తిస్మం ఆరంభం మాత్రమే. అయితే ప్రశ్నేమిటంటే, ‘మీరు దేవుని ప్రేమలో ఎలా నిలిచి ఉండగలరు?’ అనేదే. మన చివరి అధ్యాయం దానికి జవాబిస్తుంది.

a యెహోవాసాక్షుల వార్షిక సమావేశాల్లో క్రమంగా బాప్తిస్మం ఏర్పాట్లు చేయబడతాయి.