కంటెంట్‌కు వెళ్లు

యేసే మెస్సీయ అని మెస్సీయ గురించిన ప్రవచనాలు నిరూపిస్తున్నాయా?

యేసే మెస్సీయ అని మెస్సీయ గురించిన ప్రవచనాలు నిరూపిస్తున్నాయా?

బైబిలు ఇచ్చే జవాబు

 అవును. “లోక రక్షకునిగా” రాబోయే ‘నాయకుడైన మెస్సీయ’ గురించిన ఎన్నో ప్రవచనాల్ని, యేసు భూమ్మీదున్నప్పుడు నెరవేర్చాడు. (దానియేలు 9:25; 1 యోహాను 4:14) ఆయన చనిపోయిన తర్వాత కూడా, మెస్సీయ గురించిన ప్రవచనాల్ని నెరవేర్చాడు.—కీర్తన 110:1; అపొస్తలుల కార్యాలు 2:34-36.

 “మెస్సీయ” అంటే అర్థమేమిటి?

 మషీయాక్‌​ (మెస్సీయ) అనే హీబ్రూ పదానికి, క్రిస్టోస్‌​ (క్రీస్తు) అనే గ్రీకు పదానికి అర్థం “అభిషిక్తుడు.” కాబట్టి “యేసు క్రీస్తు” అంటే “అభిషిక్తుడైన యేసు” లేదా “మెస్సీయ అయిన యేసు” అని అర్థం.

 బైబిలు కాలాల్లో, ఒక వ్యక్తిని ప్రత్యేక స్థానంలో అధికారిగా నియమించేటప్పుడు అతని తలమీద నూనె పోసి అభిషేకించేవాళ్లు. (లేవీయకాండము 8:12; 1 సమూయేలు 16:13) దేవుడు యేసును మెస్సీయగా గొప్ప అధికారం ఉన్న స్థానంలో నియమించాడు. (అపొస్తలుల కార్యాలు 2:36) అయితే దేవుడు నూనెకు బదులుగా పవిత్రశక్తితో ఆయన్ని అభిషేకించాడు.—మత్తయి 3:16.

 ఒకరు కన్నా ఎక్కువమంది మెస్సీయ ప్రవచనాల్ని నెరవేర్చగలరా?

 లేదు. ఒక వేలిముద్ర సహాయంతో ఒక వ్యక్తిని మాత్రమే గుర్తించినట్లు, బైబిలు ప్రవచనాలన్నీ ఒక్క మెస్సీయ లేదా క్రీస్తు విషయంలోనే నెరవేరాయి. అయితే “అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి సాధ్యమైతే ఎంచుకోబడిన వాళ్లను కూడా మోసం చేయడానికి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరమైన పనులు చేస్తారు” అని బైబిలు హెచ్చరిస్తోంది.—మత్తయి 24:24.

 మెస్సీయ భవిష్యత్తులో వస్తాడా?

 రాడు. మెస్సీయ ఇశ్రాయేలుకు చెందిన రాజైన దావీదు వంశం నుండి వస్తాడని బైబిలు ముందే చెప్పింది. (కీర్తన 89:3, 4) అయితే దావీదు వంశావళిని వివరించే యూదా పూర్వీకుల చరిత్రపుటలు ప్రస్తుతం అందుబాటులో లేవు. బహుశా అవి, క్రీ.శ. 70లో రోమన్లు యెరూషలేమును స్వాధీనం చేసుకున్నప్పుడు నాశనమైవుంటాయి. a కాబట్టి, యేసు దావీదు రాజవంశానికి చెందినవాడని నిరూపించడం అసాధ్యమైన పనిగా మారింది. కానీ, యేసు కాలంలో ఆ చరిత్రపుటలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, యేసు దావీదు వంశానికి చెందినవాడనే విషయాన్ని యేసు శత్రువులు కూడా ప్రశ్నించలేకపోయారు.—మత్తయి 22:41-46.

 బైబిల్లో మెస్సీయ గురించిన ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి?

 మెస్సీయ గురించిన ప్రవచనాలు ఖచ్చితంగా ఇన్ని అని చెప్పడం సాధ్యం కాదు. మెస్సీయకు సంబంధించిన వృత్తాంతాల్ని లెక్కించే విధానం బట్టి కూడా ప్రవచనాల సంఖ్య మారవచ్చు. ఉదాహరణకు యెషయా 53:2-7 లో ఉన్న వృత్తాంతాన్నే తీసుకుంటే, మెస్సీయ విషయంలో నెరవేరాల్సిన ఎన్నో వివరాలు అందులో ఉన్నాయి. కొంతమంది ఆ వృత్తాంతం అంతటినీ కలిపి ఒక ప్రవచనంగా భావించవచ్చు. మరికొంతమంది, అందులోని ఒక్కో విషయాన్ని ఒక్కో ప్రవచనంగా భావించవచ్చు.

 యేసు నెరవేర్చిన మెస్సీయ ప్రవచనాల్లో కొన్ని

ప్రవచనం

లేఖనం

నెరవేర్పు

అబ్రాహాము సంతానం

ఆదికాండము 22:17, 18

మత్తయి 1:1

అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు సంతానం

ఆదికాండము 17:19

మత్తయి 1:2

ఇశ్రాయేలు గోత్రమైన యూదాలో పుడతాడు

ఆదికాండము 49:10

మత్తయి 1:1, 3

రాజైన దావీదు వంశం నుండి వస్తాడు

యెషయా 9:7

మత్తయి 1:1

కన్యకు పుడతాడు

యెషయా 7:14

మత్తయి 1:18, 22, 23

బేత్లెహేములో పుడతాడు

మీకా 5:2

మత్తయి 2:1, 5, 6

ఇమ్మానుయేలు అని పిలవబడతాడు b

యెషయా 7:14

మత్తయి 1:21-23

సామాన్య కుటుంబంలో పుడతాడు

యెషయా 53:2

లూకా 2:7

ఆయన పుట్టిన తర్వాత చిన్నపిల్లలు చంపబడతారు

యిర్మీయా 31:15

మత్తయి 2:16-18

ఐగుప్తు నుండి పిలవబడతాడు

హోషేయ 11:1

మత్తయి 2:13-15

నజరేయుడు అని పిలవబడతాడు c

యెషయా 11:1

మత్తయి 2:23

ముందుగా సందేశకుడు వస్తాడు

మలాకీ 3:1

మత్తయి 11:7-10

క్రీ.శ. 29లో మెస్సీయగా అభిషేకించబడతాడు d

దానియేలు 9:25

మత్తయి 3:13-17

ఆయన తన కుమారుడని దేవుడే స్వయంగా చెప్తాడు

కీర్తన 2:7

అపొస్తలుల కార్యాలు 13:33, 34

దేవుని ఇంటి విషయంలో ఆసక్తి కలిగివుంటాడు

కీర్తన 69:9

యోహాను 2:13-17

మంచివార్త ప్రకటిస్తాడు

యెషయా 61:1

లూకా 4:16-21

గలిలయలో బహిరంగ సాక్ష్యం వల్ల గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది

యెషయా 9:1, 2

మత్తయి 4:13-16

మోషేలా అద్భుతాలు చేస్తాడు

ద్వితీయోపదేశకాండము 18:15

అపొస్తలుల కార్యాలు 2:22

మోషేలా, దేవుని మాటల్ని చెప్తాడు

ద్వితీయోపదేశకాండము 18:18, 19

యోహాను 12:49

ఎంతోమంది రోగుల్ని బాగుచేస్తాడు

యెషయా 53:4

మత్తయి 8:16, 17

మనుషుల దృష్టిని ఆకర్షించడు

యెషయా 42:2

మత్తయి 12:17, 19

కష్టాల్లో ఉన్నవాళ్ల పట్ల కనికరం చూపిస్తాడు

యెషయా 42:3

మత్తయి 12:9-20; మార్కు 6:34

దేవుని న్యాయాన్ని వెల్లడిచేస్తాడు

యెషయా 42:1, 4

మత్తయి 12:17-20

అద్భుతమైన సలహాదారుడు

యెషయా 9:6, 7

యోహాను 6:68

యెహోవా పేరును ప్రకటిస్తాడు

కీర్తన 22:22

యోహాను 17:6

ఉదాహరణలు ఉపయోగించి మాట్లాడతాడు

కీర్తన 78:2

మత్తయి 13:34, 35

నాయకుడు

దానియేలు 9:25

మత్తయి 23:10

చాలామంది ఆయన మీద విశ్వాసం ఉంచరు

యెషయా 53:1

యోహాను 12:37, 38

అడ్డురాయిలా ఉంటాడు

యెషయా 8:14, 15

మత్తయి 21:42-44

మనుషులు ఆయన్ని అంగీకరించరు

కీర్తన 118:22, 23

అపొస్తలుల కార్యాలు 4:10, 11

ఏ కారణం లేకుండా ద్వేషిస్తారు

కీర్తన 69:4

యోహాను 15:24, 25

విజయోత్సాహంతో గాడిద మీద యెరూషలేముకు వస్తాడు

జెకర్యా 9:9

మత్తయి 21:4-9

పిల్లలు స్తుతిస్తారు

కీర్తన 8:2

మత్తయి 21:15, 16

యెహోవా పేరున వస్తాడు

కీర్తన 118:26

యోహాను 12:12, 13

దగ్గరి స్నేహితుడు నమ్మకద్రోహం చేస్తాడు

కీర్తన 41:9

యోహాను 13:18

ముప్పై వెండి నాణేల కోసం నమ్మకద్రోహం చేయబడతాడు e

జెకర్యా 11:12, 13

మత్తయి 26:14-16; 27:3-10

స్నేహితులు వదిలేస్తారు

జెకర్యా 13:7

మత్తయి 26:31, 56

ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు చెప్తారు

కీర్తన 35:11

మత్తయి 26:59-61

నిందలు వేస్తున్నా మౌనంగా ఉంటాడు

యెషయా 53:7

మత్తయి 27:12-14

ఉమ్మి వేస్తారు

యెషయా 50:6

మత్తయి 26:67; 27:27, 30

తలమీద కొడతారు

మీకా 5:1

మార్కు 15:19

కొరడాలతో కొడతారు

యెషయా 50:6

యోహాను 19:1

కొట్టేవాళ్లకు ఎదురుతిరగడు

యెషయా 50:6

యోహాను 18:22, 23

ప్రభుత్వ పాలకులు ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు

కీర్తన 2:2

లూకా 23:10-12

చేతులకు, పాదాలకు మేకులు కొడతారు

కీర్తన 22:16

మత్తయి 27:35; యోహాను 20:25

ఆయన బట్టల కోసం చీట్లు వేసుకుంటారు

కీర్తన 22:18

యోహాను 19:23, 24

పాపులతో సమానంగా చూస్తారు

యెషయా 53:12

మత్తయి 27:38

నిందలు, అవమానాలపాలు అవుతాడు

కీర్తన 22:7, 8

మత్తయి 27:39-43

పాపుల కోసం బాధ అనుభవిస్తాడు

యెషయా 53:5, 6

1 పేతురు 2:23-25

తనను దేవుడు విడిచిపెట్టేసినట్లు భావిస్తాడు

కీర్తన 22:1

మార్కు 15:34

పుల్లటి ద్రాక్షారసాన్ని, చేదు ద్రాక్షారసాన్ని ఇస్తారు

కీర్తన 69:21

మత్తయి 27:34

చనిపోయే ముందు దాహానికి నీళ్లు అడుగుతాడు

కీర్తన 22:15

యోహాను 19:28, 29

తన ప్రాణాన్ని దేవునికి అర్పిస్తాడు

కీర్తన 31:5

లూకా 23:46

చనిపోతాడు

యెషయా 53:12

మార్కు 15:37

పాపం తీసేయడానికి విమోచన క్రయధనంగా ప్రాణాన్ని అర్పిస్తాడు

యెషయా 53:12

మత్తయి 20:28

ఎముకలు విరగ్గొట్టబడవు

కీర్తన 34:20

యోహాను 19:31-33, 36

పొడవబడతాడు

జెకర్యా 12:10

యోహాను 19:33-35, 37

ధనవంతులతో సమాధి చేయబడతాడు

యెషయా 53:9

మత్తయి 27:57-60

పునరుత్థానం అవుతాడు

కీర్తన 16:10

అపొస్తలుల కార్యాలు 2:29-31

నమ్మకద్రోహి స్థానంలో వేరే వ్యక్తిని ఎంచుకుంటారు

కీర్తన 109:8

అపొస్తలుల కార్యాలు 1:15-20

దేవుని కుడి పక్కన కూర్చుంటాడు

కీర్తన 110:1

అపొస్తలుల కార్యాలు 2:34-36

a మెక్‌​క్లింటాక్‌​ అండ్‌​ స్ట్రాంగ్స్‌​ సైక్లోపీడియా ఇలా చెప్పింది: “యూదా గోత్రాలకు, కుటుంబాలకు సంబంధించిన రికార్డులు యెరూషలేము నాశనమప్పుడు కనుమరుగై ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.”

b ఇమ్మానుయేలు అనే హీబ్రూ పదానికి “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం. మెస్సీయగా యేసు పాత్రను ఆ పేరు చక్కగా వర్ణిస్తుంది. యేసు భూమ్మీదకు రావడం, అలాగే ఆయన పనులు దేవుడు తన ఆరాధకులతో ఉన్నాడని నిరూపించాయి.—లూకా 2:27-32; 7:12-16.

c “నజరేయుడు” అనే పదం నెట్సర్‌​ అనే హీబ్రూ పదం నుండి వచ్చివుండవచ్చు. ఆ పదానికి “మొలక” అని అర్థం.

d క్రీ.శ. 29ని మెస్సీయ కనిపించే సంవత్సరంగా సూచించే వివరాల కోసం, “మెస్సీయ రావడాన్ని దానియేలు ప్రవచనం తెలియజేసిన విధానం” అనే ఆర్టికల్‌ చూడండి.

e ఈ ప్రవచనం జెకర్యా పుస్తకంలో ఉన్నప్పటికీ, అవి ‘యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు’ అని బైబిలు రచయిత అయిన మత్తయి పేర్కొన్నాడు. (మత్తయి 27:9) కొన్ని సందర్భాల్లో యిర్మీయా పుస్తకాన్ని, “ప్రవక్తల పుస్తకాలు” అనే విభాగంలో మొదట చేర్చి ఉంటారు. (లూకా 24:44) కాబట్టి మత్తయి, జెకర్యా పుస్తకం కూడా ఇమిడివున్న ఆ విభాగమంతటినీ సూచిస్తూ “యిర్మీయా” అని రాసివుంటాడు.