కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

John Moore/Getty Images

ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

 “ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తీవ్రత తగ్గిపోయింది కాబట్టి ఇక దానివల్ల మళ్లీ ఎలాంటి భయం లేదు అని అనుకోకూడదు. . . . రానున్న రోజుల్లో మరో మహమ్మారిఖచ్చితంగా రావొచ్చుఅప్పుడు దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి.”డాటెడ్రోస్‌ ఆడెనామ్‌ గెబ్రెయాసిస్‌, డైరెక్టర్‌-జనరల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, 2023, మే 22.

 కోవిడ్‌ వల్ల చాలామంది ఇప్పటికీ శారీరక, మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఈసారి మహమ్మారి వస్తే దానిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాయా? అలాగే ఇప్పుడున్న రోగాల విషయంలో తమ వంతు సహాయాన్ని అందిస్తాయా?

 మనకు మంచి ఆరోగ్యాన్ని అందించే ఒక ప్రభుత్వం గురించి బైబిలు చెప్తుంది. అది “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని” లేదా ప్రభుత్వాన్ని స్థాపిస్తాడని చెప్తుంది. (దానియేలు 2:44) ఆ ప్రభుత్వంలో ఉండేవాళ్లు ఎవ్వరూ, “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు. (యెషయా 33:24) ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం, యౌవన బలం ఉంటుంది.—యోబు 33:25.