కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యానికి రాజు ఎవరు?

దేవుని రాజ్యానికి రాజు ఎవరు?

భవిష్యత్తులో దేవుని రాజ్యానికి రాజయ్యే వ్యక్తి ఎలా ఉంటాడో గుర్తించే వివరాల్ని రాయించి పెట్టేలా దేవుడు వేర్వేరు బైబిలు రచయితల్ని పురికొల్పాడు. ఆ పరిపాలకుడు ఇలా ఉంటాడు:

  • దేవుడు ఎన్నుకునే వ్యక్తి. “నేనే నా రాజును ఆసీనుణ్ణి చేశాను . . . దేశాల్ని నీకు ఆస్తిగా, భూమంతటినీ నీకు సొత్తుగా ఇస్తాను.”—కీర్తన 2:6, 8.

  • రాజైన దావీదుకు వారసుడు. “మనకు ఒక శిశువు పుట్టాడు, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు . . . ఆయన రాజ్యాధికారం పెరుగుతూ పోతుంది, అంతులేని శాంతి ఉంటుంది . . . దాన్ని సుస్థిరం చేయడానికి, బలపర్చడానికి దావీదు సింహాసనం మీద, అతని రాజ్యం మీద ఆయన పరిపాలన చేస్తాడు.”—యెషయా 9:6, 7.

  • బేత్లెహేములో పుడతాడు. “బేత్లెహేము ఎఫ్రాతా . . . నా కోసం . . . పరిపాలించే వ్యక్తి నీలో నుండి వస్తాడు . . . ఆయన గొప్పతనం భూమి అంచుల దాకా చేరుతుంది.”—మీకా 5:2, 4.

  • మనుషుల చేత తిరస్కరించబడతాడు, చంపబడతాడు. “ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు . . . మనం ఆయన్ని లెక్కచేయలేదు . . . ఆయన మన దోషాల వల్ల పొడవబడ్డాడు; మన తప్పుల్ని బట్టి నలగ్గొట్టబడ్డాడు.”—యెషయా 53:3, 5.

  • తిరిగి బ్రతికించబడి, గొప్ప చేయబడతాడు. “నువ్వు నన్ను సమాధిలో విడిచిపెట్టవు. నీ విశ్వసనీయుణ్ణి గోతిని చూడనివ్వవు . . . నీ కుడిచేతి దగ్గర ఎప్పటికీ సంతోషం ఉంటుంది.”—కీర్తన 16:10, 11.

రాజుగా ఉండడానికి యేసుక్రీస్తు అర్హుడని ఎందుకు చెప్పవచ్చు?

చరిత్ర అంతటిలో ఒకే ఒక్క వ్యక్తి, వాటన్నిటికీ సరిగ్గా సరిపోతాడు, రాజు అవ్వడానికి ఆయనే అర్హుడు. ఆ వ్యక్తే యేసుక్రీస్తు. నిజానికి ఒక దేవదూత యేసు తల్లి మరియకు ఇలా చెప్పాడు: ‘ఆయన తండ్రైన దావీదు సింహాసనాన్ని దేవుడు ఆయనకు ఇస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు.’—లూకా 1:31-33.

యేసు భూమ్మీద ఎప్పుడూ రాజుగా లేడు. కానీ దేవుని రాజ్యానికి రాజుగా ఆయన పరలోకంలో నుండే మనుషులను పరిపాలిస్తాడు. ఆయన మంచి పరిపాలకుడని ఎలా చెప్పవచ్చు? భూమ్మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో పరిశీలించండి.

  • యేసు ప్రజలమీద శ్రద్ధ చూపించాడు. యేసు ప్రజల నేపథ్యాన్ని, అంతస్తును పట్టించుకోకుండా స్త్రీలకు, పురుషులకు, చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు సహాయం చేశాడు. (మత్తయి 9:36; మార్కు 10:16) “నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు” అని ఒక కుష్ఠురోగి ఆయన్ని వేడుకున్నాడు, అప్పుడు యేసుకు జాలేసి, అతన్ని బాగుచేశాడు. —మార్కు 1:40-42.

  • దేవుణ్ణి ఎలా సంతోషపెట్టవచ్చో యేసు మనకు బోధించాడు. ఆయనిలా చెప్పాడు: “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు.” ఇతరులు మనతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో మనం కూడా వాళ్లతో అలాగే వ్యవహరించాలని కూడా ఆయన చెప్పాడు. ఆ సూత్రానికి బంగారు సూత్రం అనే పేరు వచ్చింది. దేవునికి మనం చేసే పనుల మీద మాత్రమే కాకుండా మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా భావిస్తాం అనే వాటి విషయంలో కూడా ఆసక్తి ఉందని యేసు చూపించాడు. కాబట్టి, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మన హృదయంలోని భావాల్ని నియంత్రించుకోవాలి. (మత్తయి 5:28; 6:24; 7:12) మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే దేవుడు కోరేదేమిటో తెలుసుకొని, దాన్ని పాటించాలని యేసు మరీమరీ చెప్పాడు.—లూకా 11:28.

  • ఇతరుల్ని ప్రేమించడమంటే ఏమిటో యేసు బోధించాడు. యేసు మాటలు, పనులు శక్తివంతంగా ఉండేవి, వినేవాళ్ల మనసులకు హత్తుకుపోయేవి. ‘ప్రజలు ఆయన బోధించిన తీరును చూసి చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆయన అధికారంగల వ్యక్తిలా బోధించాడు.’ (మత్తయి 7:28, 29) ‘శత్రువుల్ని ప్రేమించమని’ ఆయన బోధించాడు. తన చావుకు కారణమైన వాళ్ల తరఫున కూడా ఆయన ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, వీళ్లను క్షమించు. వీళ్లు ఏంచేస్తున్నారో వీళ్లకు తెలీదు.”—మత్తయి 5:44; లూకా 23:34.

ఇతరులకు సహాయం చేసే గుణం, దయ అనే లక్షణం యేసుకు ఉన్నాయి కాబట్టి లోకాన్ని పరిపాలించడానికి ఆయన పూర్తిగా అర్హుడు. అయితే ఆయన ఎప్పటి నుండి పరిపాలిస్తాడు?