కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ పాఠం

మంచి రోజులు వస్తాయని దేవుడు మాటిస్తున్నాడు

మంచి రోజులు వస్తాయని దేవుడు మాటిస్తున్నాడు

ప్రపంచంలో అందరూ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, ఆందోళన పడుతున్నారు, కృంగిపోతున్నారు. మీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వచ్చిందా? బహుశా ఆరోగ్యం పాడవ్వడం వల్ల లేదా మీకు ఇష్టమైనవాళ్లు చనిపోవడం వల్ల మీరు బాధపడుతుండవచ్చు. ‘మంచి రోజులు ఎప్పటికైనా వస్తాయా?’ అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఆ ప్రశ్నకు బైబిల్లో దేవుడు ఇచ్చే జవాబు తెలుసుకుంటే, మీరు సంతోషిస్తారు.

1. రాబోయే రోజుల గురించి బైబిలు ఏం చెప్తుంది?

లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయో బైబిలు చెప్తుంది. అంతేకాదు, ఈ కష్టాలన్నీ త్వరలోనే పోతాయనే మంచివార్త కూడా అది చెప్తుంది. “మంచి భవిష్యత్తు” గురించి బైబిలు మాటిస్తున్న విషయాలు మనలో ఆశను నింపుతాయి. (యిర్మీయా 29:11, 12 చదవండి.) అంతేకాదు ఇప్పుడున్న కష్టాల్ని తట్టుకోవడానికి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడానికి అవి సహాయం చేస్తాయి.

2. ఎలాంటి మంచి రోజులు వస్తాయని బైబిలు మాటిస్తుంది?

భవిష్యత్తులో “మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు” అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 21:4 చదవండి.) ఇప్పుడు ప్రజల్ని బాధపెడుతున్న పేదరికం, అన్యాయం, జబ్బులు, మరణం లాంటివి ఏవీ ఇక ఉండవు. అప్పుడు భూమి అందమైన తోటలా మారుతుంది. దానిలో మనుషులు ఎల్లప్పుడూ, అంటే శాశ్వతకాలం సంతోషంగా జీవిస్తారని బైబిలు మాటిస్తుంది.

3. బైబిలు మాటిస్తున్నవి నిజంగా జరుగుతాయని ఎలా నమ్మవచ్చు?

భవిష్యత్తు గురించి చాలామంది కలలు కంటారు, కానీ ఆ కలలు నిజమౌతాయో లేదో వాళ్లకు తెలీదు. అయితే, బైబిలు చెప్పేవి మాత్రం ఖచ్చితంగా నిజమౌతాయి. బైబిలు చెప్తున్న వాటి మీద నమ్మకం పెంచుకోవడానికి, మీరు ‘లేఖనాల్ని జాగ్రత్తగా పరిశోధించవచ్చు.’ (అపొస్తలుల కార్యాలు 17:11) బైబిల్లోని విషయాలు నేర్చుకునే కొద్దీ, భవిష్యత్తు గురించి అది మాటిస్తున్న వాటిని నమ్మవచ్చో లేదో మీకే అర్థమౌతుంది.

ఎక్కువ తెలుసుకోండి

భవిష్యత్తు గురించి బైబిలు మాటిస్తున్న కొన్ని విషయాల్ని చూడండి. వాటిని తెలుసుకోవడం వల్ల ప్రజలు ఇప్పుడు ఎలా సంతోషంగా ఉన్నారో గమనించండి.

4. మనం కష్టాలు లేకుండా శాశ్వతకాలం సంతోషంగా జీవించవచ్చని బైబిలు మాటిస్తోంది

బైబిలు మాటిస్తున్న కొన్ని విషయాల్ని కింద లిస్టులో చూడండి. వాటిలో ఏది మీకు బాగా నచ్చింది? ఎందుకు?

కింద లిస్టులో ఇచ్చిన బైబిలు వచనాలు చదవండి, తర్వాత ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి:

  • ఈ వచనాలు చదివాక మీకు ఎలా అనిపిస్తుంది? మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అవి సహాయం చేయగలవా?

ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నట్టు ఊహించుకోండి

ఎవ్వరూ . . .

అందరూ . . .

  • బాధపడరు, ముసలివాళ్లు అవ్వరు, చనిపోరు.—యెషయా 25:8.

  • తిరిగి బ్రతికిన తమ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కలుసుకుంటారు.—యోహాను 5:28, 29.

  • ఆరోగ్యంగా, యౌవనంగా, బలంగా ఉంటారు.—యోబు 33:25.

  • మంచి పరిస్థితుల్లో శాశ్వతంగా జీవిస్తారు.—కీర్తన 37:29.

5. బైబిలు మాటిస్తున్న విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు కూడా సంతోషంగా జీవించవచ్చు

చాలామంది తమ చుట్టూ ఉన్న సమస్యల్ని చూసి కృంగిపోతున్నారు లేదా కోపంతో రగిలిపోతున్నారు. కొందరైతే మార్పు తీసుకురావాలని పోరాటాలు చేస్తున్నారు. అయితే, బైబిలు మాటిస్తున్న విషయాలు తెలుసుకోవడం వల్ల ఒకామె ఇప్పుడు ఎలా సంతోషంగా ఉందో చూడండి. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • ఈ వీడియోలో ఉన్న ఆమె ఎలాంటి అన్యాయాన్ని చూసింది?

  • ఆ అన్యాయం ఇంకా అలాగే ఉన్నా, బైబిలు ఆమెకు ఎలా సహాయం చేసింది?

బైబిలు మాటిచ్చినవి నిజంగా జరుగుతాయని నమ్మినప్పుడు, మనం నిరాశలో ఉండిపోయే బదులు కష్టాలున్నా సంతోషంగా జీవిస్తాం. సామెతలు 17:22; రోమీయులు 12:12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • బైబిలు మాటిస్తున్న విషయాలు ఇప్పుడు కూడా సంతోషంగా జీవించడానికి సహాయం చేస్తాయని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

కొంతమంది ఇలా అంటారు: “బైబిలు చెప్పేవి వినడానికి బాగున్నాయి, కానీ అవి జరగవు.”

  • బైబిలు చెప్పేవి నిజంగా జరుగుతాయో లేదో పరిశీలించడం మంచిదని మీకు ఎందుకు అనిపిస్తుంది?

ఒక్కమాటలో

మంచి రోజులు వస్తాయని బైబిలు మాటిస్తోంది. అది తెలుసుకుంటే, కష్టాలున్నా సంతోషంగా జీవించవచ్చు.

మీరేం నేర్చుకున్నారు?

  • మంచి రోజులు రావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు?

  • రాబోయే రోజుల గురించి బైబిలు ఏం చెప్తుంది?

  • బైబిలు మాటిస్తున్న విషయాలు తెలుసుకోవడం వల్ల ఇప్పుడు మీరు ఎలా సంతోషంగా జీవించవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

ఆశతో బ్రతకడం ఇప్పుడు మీకు ఎలా సహాయం చేస్తుందో తెలిపే ఆర్టికల్స్‌ చదవండి.

“ఆశ—అది ఎక్కడ దొరుకుతుంది?” (తేజరిల్లు! ఆర్టికల్‌)

బైబిలు మాటిస్తున్న విషయాలు, చాలాకాలంగా అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఎలా సహాయం చేస్తాయో తెలుసుకోండి.

“దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?” (jw.org ఆర్టికల్‌)

ఈ పాటను చూస్తున్నప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు బైబిలు మాటిచ్చిన అందమైన లోకంలో సంతోషంగా ఉన్నట్టు ఊహించుకోండి.

భవిష్యత్తు ఊహించుకుందాం (3:37)

సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన ఒక వ్యక్తికి, బైబిలు మాటిచ్చిన విషయాలు ఎలా సహాయం చేశాయో చదవండి.

“నేను ఇప్పుడు లోకాన్ని మార్చేయాలని అనుకోవట్లేదు” (కావలికోట ఆర్టికల్‌)