కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ పాఠం

మీరు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు?

మీరు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు?

జీవితం, బాధలు, మరణం, భవిష్యత్తు గురించి మనకు రకరకాల ప్రశ్నలు వస్తాయి. అంతేకాదు కుటుంబాన్ని పోషించుకోవడం, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం వంటి వాటి గురించి మనం ఆలోచిస్తాం. దేవుని మాటలు ఉన్న బైబిలు a మనకు వచ్చే ముఖ్యమైన ప్రశ్నలకు జవాబిస్తుందని, మంచి సలహాలు కూడా ఇస్తుందని చాలామంది తెలుసుకున్నారు. అవును, బైబిలు ప్రతీఒక్కరికి సహాయం చేస్తుంది.

1. బైబిలు ఎలాంటి ప్రశ్నలకు జవాబిస్తుంది?

బైబిలు ఈ ముఖ్యమైన ప్రశ్నలకు జవాబిస్తుంది: జీవం ఎలా వచ్చింది? జీవితానికి అర్థం ఏంటి? మంచివాళ్లకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? చనిపోయాక ఏమౌతుంది? అందరూ శాంతినే కోరుకుంటున్నా, ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? భవిష్యత్తులో భూమి నాశనం అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోమని బైబిలు చెప్తుంది. లక్షలమంది బైబిలు ఇచ్చే జవాబుల్ని తెలుసుకుని సంతోషిస్తున్నారు.

2. మనం ఇప్పుడు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు?

దేవుడు బైబిలు ద్వారా మనకు మంచి సలహాలు ఇస్తున్నాడు. ఉదాహరణకు, కుటుంబం నిజంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో బైబిలు చెప్తుంది. ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చో, పనిలో ఎలా ఆనందించవచ్చో కూడా చెప్తుంది. ఇవే కాదు, ఇంకా చాలా విషయాల గురించి బైబిలు చెప్తుంది. మేము మిమ్మల్ని కలిసి మాట్లాడే కొద్దీ, మీరు వాటి గురించి ఎక్కువ తెలుసుకుంటారు. అప్పుడు, ‘లేఖనాలన్నీ [అంటే, బైబిలు చెప్పేవన్నీ] ప్రయోజనకరంగా ఉంటాయని’ మీరు అర్థం చేసుకుంటారు.—2 తిమోతి 3:16.

ఈ పుస్తకం బైబిల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. కాబట్టి, ఇందులో ఉన్న వచనాల్ని బైబిలు తెరిచి చూస్తూ, మీరు నేర్చుకుంటున్న విషయాల్ని బైబిలుతో పోల్చి చూడండి.

ఎక్కువ తెలుసుకోండి

బైబిలు చాలామందికి ఎలా సహాయం చేసిందో, మీరు బైబిల్ని ఎలా ఇష్టంగా చదవవచ్చో, బైబిల్ని అర్థం చేసుకోవడానికి వేరేవాళ్ల సహాయం తీసుకోవడం ఎందుకు మంచిదో తెలుసుకోండి.

3. బైబిలు మనకు దారి చూపిస్తుంది

బైబిలు ఒక టార్చ్‌లైట్‌ లాంటిది. మనం మంచి నిర్ణయాలు తీసుకుంటూ సరైన దారిలో నడవడానికి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అది సహాయం చేస్తుంది.

కీర్తన 119:105 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఈ మాటల్ని రాసిన వ్యక్తి బైబిల్ని దేనితో పోల్చాడు?

  • మరి బైబిలు గురించి మీరు ఏమనుకుంటున్నారు?

4. మనకు వచ్చే ప్రశ్నలకు బైబిలు జవాబిస్తుంది

ఎన్నో ఏళ్లుగా తను ఆలోచిస్తున్న ప్రశ్నలకు బైబిల్లో జవాబులు ఉన్నాయని ఒకామె తెలుసుకుంది. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • ఈ వీడియోలో ఉన్న ఆమె ఎలాంటి ప్రశ్నల గురించి ఆలోచించింది?

  • బైబిలు ఆమెకు ఎలా సహాయం చేసింది?

ప్రశ్నలు అడగమని బైబిలు మనకు చెప్తుంది. మత్తయి 7:7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మీరు ఏ ప్రశ్నలకు బైబిల్లో జవాబు తెలుసుకోవాలని అనుకుంటున్నారు?

5. మీరు బైబిల్ని ఇష్టంగా చదవవచ్చు

చాలామంది బైబిల్ని ఇష్టంగా చదువుతున్నారు, బైబిలు వాళ్లకు ఎంతో ఉపయోగపడుతోంది. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • ఈ వీడియోలో కొంతమంది యౌవనులు చదవడం గురించి ఏమంటున్నారు?

  • మరి వాళ్లు బైబిల్ని ఎందుకు ఇష్టంగా చదువుతున్నారు?

బైబిల్లోని విషయాలు మనకు ఊరటను ఇస్తాయి, భవిష్యత్తు మీద ఆశను కలిగిస్తాయి. రోమీయులు 15:4 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • బైబిలు ఇచ్చే ఊరటను, భవిష్యత్తు గురించి అది చెప్పే విషయాల్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

6. వేరేవాళ్ల సహాయంతో మనం బైబిల్ని బాగా అర్థం చేసుకోవచ్చు

బైబిల్ని సొంతగా చదవడంతో పాటు, వేరేవాళ్ల సహాయం తీసుకోవడం వల్ల చాలామంది దాన్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. అపొస్తలుల కార్యాలు 8:26-31 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • బైబిల్ని బాగా అర్థం చేసుకోవడానికి ఏం చేయవచ్చు?—30, 31 వచనాలు చూడండి.

పూర్వం ఒక ఇతియోపీయుడు ఫిలిప్పు సహాయంతో లేఖనాల్ని బాగా అర్థం చేసుకున్నాడు. నేడు కూడా చాలామంది, వేరేవాళ్ల సహాయంతో బైబిల్ని బాగా అర్థం చేసుకుంటున్నారు

కొంతమంది ఇలా అంటారు: “బైబిలు చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.”

  • మీరేమంటారు? ఎందుకు?

ఒక్కమాటలో

బైబిలు ముఖ్యమైన ప్రశ్నలకు జవాబుల్ని, మంచి సలహాల్ని ఇస్తుంది. అంతేకాదు మనకు ఊరటను ఇస్తుంది, భవిష్యత్తు మీద ఆశను కలిగిస్తుంది.

మీరేం నేర్చుకున్నారు?

  • బైబిల్లో ఎలాంటి సలహాలు ఉన్నాయి?

  • బైబిలు ఎలాంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది?

  • బైబిల్లో మీరు ఏ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

బైబిలు ఇచ్చే సలహాలు ఇప్పుడు మనకెలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.

“బైబిలు బోధలు—ఎప్పటికీ తెలివిని ఇస్తాయి” (కావలికోట నం. 1 2018)

చిన్నప్పటి నుండి రకరకాల ఆలోచనలతో నలిగిపోయిన ఒక వ్యక్తికి బైబిలు ఎలా సహాయం చేసిందో చూడండి.

ఇప్పుడు నా జీవితం సంతోషంగా ఉంది (2:53)

కుటుంబ సంతోషం కోసం బైబిలు ఇచ్చే సలహాలు తెలుసుకోండి.

“కుటుంబ విజయానికి 12 సలహాలు” (తేజరిల్లు! నం. 2 2018)

ఈ లోకాన్ని దేవుడే పరిపాలిస్తున్నాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ, బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి.

బైబిలు ఎందుకు చదవాలి?పూర్తి వీడియో (3:14)

a “బైబిల్లో ఉన్నవి నిజంగా దేవుని మాటలేనా?” అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఆ ప్రశ్నకు జవాబును, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!దేవుడు చెప్పేది తెలుసుకోండి పుస్తకంలోని 5వ పాఠంలో చూడవచ్చు.