కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Maremagnum/Corbis Documentary via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

హార్‌మెగిద్దోన్‌ ఇజ్రాయెల్‌లో మొదలౌతుందా?—బైబిలు ఏం చెప్తుంది?

హార్‌మెగిద్దోన్‌ ఇజ్రాయెల్‌లో మొదలౌతుందా?—బైబిలు ఏం చెప్తుంది?

 హార్‌మెగిద్దోన్‌ అంటే, భూమ్మీద ఒక చిన్న ప్రదేశంలో జరిగే యుద్ధం కాదుగానీ ప్రపంచమంతటా జరిగే యుద్ధమని బైబిలు చెప్తుంది. ఆ యుద్ధంలో భూమ్మీది మానవ ప్రభుత్వాలన్నీ దేవునితో తలపడతాయి.

  •   “అవి చెడ్డదూతలు ప్రేరేపించిన సందేశాలు ... అవి సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధం కోసం భూమంతటా ఉన్న రాజుల్ని పోగు చేయడానికి వాళ్ల దగ్గరికి వెళ్తాయి. ... అవి ఆ రాజుల్ని ఒక చోటికి పోగుచేశాయి. హీబ్రూ భాషలో దాని పేరు హార్‌మెగిద్దోన్‌.”ప్రకటన 16:14, 16.

 అర్మగిద్దోను లేదా హార్‌మెగిద్దోన్‌ అనే హీబ్రూ పదానికి “మెగిద్దో పర్వతం” అని అర్థం. మెగిద్దో అనేది ప్రాచీన ఇశ్రాయేలులోని ఒక నగరం. కాబట్టి, ఈ హార్‌మెగిద్దోన్‌ యుద్ధం ఇప్పుడున్న ఇజ్రాయెల్‌లోనే జరుగుతుందని కొంతమంది నమ్ముతారు. కానీ నిజానికి, మెగిద్దో ప్రాంతం గానీ ఇజ్రాయెల్‌ చుట్టుపక్కల ఉన్న వేరే ప్రాంతాలు గానీ “భూమంతటా ఉన్న రాజుల్ని,” వాళ్ల సైన్యాల్ని నిలబెట్టడానికి సరిపోవు.

 బైబిల్లోని ప్రకటన పుస్తకంలో ఉన్న వివరాలు “సూచనల ద్వారా” ఇవ్వబడ్డాయి. అంటే వాటిని ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకోకూడదు, వాటికి వేరే అర్థం ఉంటుంది. (ప్రకటన 1:1) కాబట్టి హార్‌మెగిద్దోన్‌ అంటే భూమ్మీది ఒక ప్రదేశం కాదుగానీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక పరిస్థితి. ఆ సమయంలో దేశాలన్నీ దేవుని పరిపాలనకు వ్యతిరేకంగా ఆఖరి పోరాటంలోకి దిగుతాయి.—ప్రకటన 19:11-16, 19-21.