కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు చదవడానికి ప్రణాళికలు

బైబిలు చదవడానికి ప్రణాళికలు

జీవితానికి సంబంధించి ఎంతో తెలివైన నిర్దేశాలు బైబిల్లో ఉన్నాయి. దాన్ని క్రమంగా చదివి, ధ్యానించి, నేర్చుకున్నవాటిని పాటిస్తే మీ ‘మార్గము వర్ధిల్లుతుంది.’ (యెహోషువ 1:8; కీర్తన 1:1-3) అంతేకాదు, మీరు దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసు గురించి తెలుసుకుంటారు. ఆ జ్ఞానం మీకు శాశ్వత జీవితాన్ని ఇస్తుంది.—యోహాను 17:3.

బైబిల్లోని పుస్తకాల్ని ఏ క్రమంలో చదవాలి? వేర్వేరు విధాలుగా చదవవచ్చు. ఇక్కడ ఇచ్చిన బైబిలు పఠన పట్టిక సహాయంతో మీరు బైబిలు పుస్తకాల్ని బైబిల్లో అవి ఉన్న క్రమంలో చదవవచ్చు లేదా అంశాల వారీగా చదవవచ్చు. ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలు దేశంతో దేవుడు ఎలా వ్యవహరించాడో తెలుసుకోవడానికి ఆ కొన్ని భాగాలను చదవొచ్చు. మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం ఎలా మొదలైందో, ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి వేరే భాగాలను చదవొచ్చు. మీరు ప్రతీరోజు ఒక సెట్టు అధ్యాయాలను చదివితే, ఒక సంవత్సరంలో బైబిలు మొత్తం చదివేస్తారు.

మీరు రోజూ బైబిలు చదవాలనుకున్నా లేదా ఒక సంవత్సరంలోపే బైబిల్ని పూర్తి చేయాలనుకున్నా ఈ పట్టిక సహాయపడుతుంది. కొత్తగా బైబిలు చదవడం మొదలుపెడుతున్న వాళ్లకు కూడా ఈ పట్టిక ఉపయోగపడుతుంది. ప్రింట్‌ చేసుకోగలిగే ఈ బైబిలు పఠన పట్టిక డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ రోజే చదవడం మొదలుపెట్టండి.