కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

25వ పాఠం

మేము రాజ్యమందిరాలు ఎందుకు నిర్మిస్తాం? ఎలా నిర్మిస్తాం?

మేము రాజ్యమందిరాలు ఎందుకు నిర్మిస్తాం? ఎలా నిర్మిస్తాం?

బొలీవియా

నైజీరియా ముందు, తర్వాత

తహీతీ

మా ఆరాధనా స్థలాల్లో మేము దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు చర్చించుకుంటాం, అందుకే వాటిని రాజ్యమందిరాలు అంటాం. దేవుని రాజ్యమే బైబిల్లోని ప్రధాన అంశం, యేసు పరిచర్యకు ముఖ్యాంశం.—లూకా 8:1.

అవి సత్యారాధనకు కేంద్రాలు. యెహోవాసాక్షుల రాజ్యసువార్త ప్రకటనా పనికి రాజ్యమందిరాలే కేంద్రాలు. (మత్తయి 24:14) రాజ్యమందిరాలు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా, వేర్వేరు నమూనాల్లో ఉన్నా నిరాడంబరంగా ఉంటాయి. కొన్ని రాజ్యమందిరాల్ని ఒకటి కన్నా ఎక్కువ సంఘాలు ఉపయోగించుకుంటాయి. సంఘాల సంఖ్య, ప్రచారకుల సంఖ్య పెరగడం వల్ల ఈ మధ్య కాలంలో మేము వేల రాజ్యమందిరాలు నిర్మించాం. అదెలా సాధ్యమైంది?—మత్తయి 19:26.

రాజ్యమందిర నిర్మాణ ఏర్పాటుకు వచ్చే విరాళాలతో వాటిని కడతారు. ఆ విరాళాల్ని బ్రాంచి కార్యాలయానికి పంపిస్తారు. బ్రాంచి కార్యాలయం వాటిని రాజ్యమందిరం నిర్మించాలనుకుంటున్న లేదా పెద్దపెద్ద మరమ్మతులు చేయాలనుకుంటున్న సంఘాలకు అందేలా చూస్తుంది.

వేర్వేరు నేపథ్యాల వాళ్లు జీతం తీసుకోకుండా స్వచ్ఛందంగా వాటిని కడతారు. చాలా దేశాల్లో రాజ్యమందిర నిర్మాణ గుంపులు ఉంటాయి. ఈ గుంపుల్లో నిర్మాణ సేవకులు, స్వచ్ఛంద సేవకులు ఉంటారు. వాళ్లు దేశంలో ఒక సంఘం నుండి మరో సంఘానికి, కొన్నిసార్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి రాజ్యమందిర నిర్మాణంలో సహాయం చేస్తారు. కొన్ని దేశాల్లో, నియమిత ప్రాంతంలో రాజ్యమందిరాలు నిర్మించే, మరమ్మతు చేసే పనుల్ని పర్యవేక్షించడానికి అర్హులైన సాక్షుల్ని నియమిస్తారు. ప్రతీ నిర్మాణ స్థలంలో, ఆ ప్రాంతానికి చెందిన ఎంతోమంది నైపుణ్యంగల సాక్షులు స్వచ్ఛందంగా సహాయం చేసినప్పటికీ, ఎక్కువ పనిని మాత్రం స్థానిక సంఘం వాళ్లే స్వచ్ఛందంగా చేస్తారు. యెహోవా పవిత్రశక్తి వల్ల, ఆయన ప్రజలు మనస్ఫూర్తిగా చేసే కృషి వల్ల ఇదంతా సాధ్యమౌతుంది.—కీర్తన 127:1; కొలొస్సయులు 3:23.

  • మా ఆరాధనా స్థలాల్ని రాజ్యమందిరాలు అని ఎందుకు అంటాం?

  • ప్రపంచవ్యాప్తంగా రాజ్యమందిరాలు నిర్మించడం ఎలా సాధ్యమౌతుంది?