నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?

యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ల నేపథ్యాలు, సంస్కృతులు వేరు. వాళ్లందర్నీ ఒక్కటి చేసింది ఏమిటి?

దేవుని ఇష్టం ఏంటి?

తన ఇష్టం గురించి అందరూ తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఇష్టం ఏంటి? నేడు దాని గురించి ఎవరు ఇతరులకు చెప్తున్నారు?

పాఠం 1

యెహోవాసాక్షులు ఎలాంటివాళ్లు?

మీకు ఎంతమంది యెహోవాసాక్షులు తెలుసు? మా గురించి మీకు నిజంగా తెలుసా?

పాఠం 2

మాకు యెహోవాసాక్షులు అనే పేరు ఎలా వచ్చింది?

మేము ఈ పేరు ఎందుకు పెట్టుకున్నామో మూడు కారణాలు పరిశీలించండి.

పాఠం 3

బైబిలు సత్యం మళ్లీ ఎలా వెలుగులోకి వచ్చింది?

బైబిలు నిజంగా బోధించేవాటిని మేము సరిగ్గా అర్థం చేసుకున్నామని ఎలా చెప్పవచ్చు?

పాఠం 4

మేము కొత్త లోక అనువాదం బైబిల్ని ఎందుకు తయారుచేశాం?

ఈ బైబిలు అనువాదం ఎందుకు ప్రత్యేకమైనది?

పాఠం 5

మా క్రైస్తవ కూటాల్లో మీరేం చూస్తారు?

బైబిల్ని పరిశోధించడానికి, ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి మేము కూటాలకు వెళ్తాం. అక్కడ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తారు!

పాఠం 6

తోటి క్రైస్తవులతో సహవసించడం వల్ల మేము ఎలా ప్రయోజనం పొందుతున్నాం?

తోటి క్రైస్తవులతో సహవసించమని దేవుని వాక్యం ప్రోత్సహిస్తుంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.

పాఠం 7

మా కూటాలు ఎలా జరుగుతాయి?

మా కూటాలు ఎలా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడిచ్చే చక్కని బైబిలు ఉపదేశం మీకు తప్పకుండా నచ్చుతుంది.

పాఠం 8

కూటాలకు వెళ్లేటప్పుడు మేము ఎందుకు పద్ధతిగా తయారౌతాం?

మేము ఎలాంటి బట్టలు వేసుకుంటాం అనేది దేవుడు పట్టించుకుంటాడా? ఈ విషయంలో మేము ఏ బైబిలు సూత్రాలు పాటిస్తామో గమనించండి.

పాఠం 9

కూటాలకు చక్కగా సిద్ధపడాలంటే ఏం చేయాలి?

మీరు ముందే సిద్ధపడితే, మా కూటాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు.

పాఠం 10

కుటుంబ ఆరాధన అంటే ఏంటి?

దేవునికి దగ్గరవ్వడానికి, కుటుంబ సభ్యులు ఒకరికొకరు దగ్గరవ్వడానికి ఈ ఏర్పాటు ఎలా సహాయం చేస్తుందో చూడండి.

పాఠం 11

మేము సమావేశాలకు ఎందుకు హాజరౌతాం?

ప్రతీ సంవత్సరం మేము మూడు సమావేశాలకు హాజరౌతాం. వాటి నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

పాఠం 12

మేము రాజ్య ప్రకటనా పనిని ఎలా చేస్తున్నాం?

యేసు భూమ్మీద ఉన్నప్పుడు చూపించిన పద్ధతినే మేము పాటిస్తున్నాం. ప్రకటించడానికి మేము ఉపయోగించే కొన్ని పద్ధతులు ఏంటి?

పాఠం 13

పయినీరు అని ఎవర్ని అంటారు?

కొంతమంది సాక్షులు నెలకు 30, 50, లేదా అంతకన్నా ఎక్కువ గంటలు ప్రకటనా పని చేస్తారు. వాళ్లు ఎందుకలా చేస్తారు?

పాఠం 14

పయినీర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎలాంటి పాఠశాలలు ఉన్నాయి?

రాజ్య ప్రకటనా పనికోసం పూర్తి సమయం వెచ్చించేవాళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఎలాంటి ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి?

పాఠం 15

పెద్దలు సంఘానికి ఎలా సహాయం చేస్తారు?

ఆధ్యాత్మిక అర్హతలు ఉన్న పెద్దలు సంఘంలో నాయకత్వం వహిస్తారు. వాళ్లు సంఘానికి ఎలా సహాయం చేస్తారు?

పాఠం 16

సంఘ పరిచారకులు ఏమేం చేస్తారు?

సంఘంలో పనులు సాఫీగా జరగడానికి సంఘ పరిచారకులు సహాయం చేస్తారు. వాళ్లు చేసే పని వల్ల కూటాలకు వచ్చే వాళ్లందరూ ఎలా ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి.

పాఠం 17

ప్రాంతీయ పర్యవేక్షకులు మాకు ఎలా సహాయం చేస్తారు?

ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘాల్ని ఎందుకు సందర్శిస్తారు? వాళ్ల సందర్శనం నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

పాఠం 18

విపత్తులు వచ్చినప్పుడు మా సహోదరులకు ఎలా సహాయం చేస్తాం?

విపత్తులు వచ్చినప్పుడు మేము వెంటనే సహాయక చర్యలు చేపడతాం, బాధితుల్ని లేఖనాల ద్వారా ఓదారుస్తాం. ఆ పనిని ఏయే విధాలుగా చేస్తామో తెలుసుకోండి.

పాఠం 19

నమ్మకమైన, బుద్ధిగల దాసుడు ఎవరు?

తగిన వేళ ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి ఒక దాసుణ్ణి నియమిస్తానని యేసు మాటిచ్చాడు. అదెలా జరుగుతుంది?

పాఠం 20

నేడు పరిపాలక సభ ఎలా పనిచేస్తుంది?

మొదటి శతాబ్దంలో కొంతమంది పెద్దలు, అపొస్తలులు కలిపి క్రైస్తవ సంఘానికి పరిపాలక సభగా పనిచేసేవాళ్లు. మరి ఇప్పటి విషయం ఏంటి?

పాఠం 21

బెతెల్‌ అంటే ఏంటి?

బెతెల్‌ అనేది చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశంగల ఒక ప్రత్యేకమైన స్థలం. అక్కడ ఎవరు సేవచేస్తారో తెలుసుకోండి.

పాఠం 22

బ్రాంచి కార్యాలయం ఏమేం చేస్తుంది?

సందర్శకులు మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రావచ్చు, అక్కడ ఒకరు దగ్గరుండి అన్నీ చూపిస్తారు. మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం!

పాఠం 23

మా ప్రచురణల్ని వేర్వేరు భాషల్లో ఎలా తయారుచేస్తాం?

మేము 900 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురణలు తయారుచేస్తాం. మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నాం?

పాఠం 24

మా ప్రపంచవ్యాప్త పనికి డబ్బులు ఎక్కడనుండి వస్తాయి?

డబ్బు విషయంలో మా సంస్థకు, వేరే మతాలకు తేడా ఏంటి?

పాఠం 25

మేము రాజ్యమందిరాలు ఎందుకు నిర్మిస్తాం? ఎలా నిర్మిస్తాం?

మా ఆరాధనా స్థలాల్ని రాజ్యమందిరాలు అని ఎందుకు అంటాం? నిరాడంబరంగా ఉండే ఈ భవనాలు మా సంఘాలకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.

పాఠం 26

రాజ్యమందిరాన్ని మంచిస్థితిలో ఉంచడానికి ఏం చేయవచ్చు?

శుభ్రంగా, మంచిస్థితిలో ఉన్న రాజ్యమందిరం మా దేవునికి మహిమ తెస్తుంది. స్థానిక రాజ్యమందిరాన్ని మంచిస్థితిలో ఉంచడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు?

పాఠం 27

రాజ్యమందిరంలోని లైబ్రరీ ఎలా ఉపయోగపడుతుంది?

మీ బైబిలు జ్ఞానాన్ని పెంచుకోవడానికి పరిశోధన చేయాలనుకుంటున్నారా? అయితే రాజ్యమందిరంలోని లైబ్రరీని ఉపయోగించండి!

పాఠం 28

మా వెబ్‌సైట్‌లో ఏం ఉంటుంది?

మా గురించి, మా నమ్మకాల గురించి ఇందులో తెలుసుకోవచ్చు, అలాగే బైబిలు ప్రశ్నలకు మీరు జవాబులు పొందవచ్చు.

మీరు యెహోవా ఇష్టాన్ని చేస్తారా?

యెహోవా దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన్ని సంతోషపెట్టాలనే కోరిక మీకు ఉందని రోజువారీ జీవితంలో ఎలా చూపించవచ్చు?