కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | సృష్టికర్తకు దగ్గరవ్వడం సాధ్యమే!

మీరు దేవునికి స్నేహితులా?

మీరు దేవునికి స్నేహితులా?

“దేవుడు మనకు స్నేహితునిగా ఉంటే క్షేమంగా, ప్రశాంతంగా ఏ లోటూ లేనట్లు ఉంటుంది. దేవుడు మీ దగ్గరుండి ఎప్పుడూ మీ బాగోగులు చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది.”—క్రిస్టఫర్‌, ఘానాలోని యువకుడు.

“అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా దేవుడు మనల్ని చూసుకుంటాడు, అడిగిన దానికన్నా ఎక్కువ ప్రేమిస్తాడు, పట్టించుకుంటాడు.”—అమెరికాలోని, అలాస్కాలో ఉన్న హానా అనే 13 ఏళ్ల అమ్మాయి.

“మనం దేవుని స్నేహితులం అనే విషయం చాలా గొప్పగా, హాయిగా అనిపిస్తుంది.”—జమైకాలోని జీన అనే దాదాపు 40 ఏళ్ల స్త్రీ.

‘అసలు మామూలు మనుషులకు దేవునితో స్నేహం ఎలా సాధ్యం?’ అని మీకనిపించవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది దేవుడు వాళ్లను స్నేహితులుగా చూస్తున్నట్లు నమ్ముతున్నారు. మీకూ అలాగే అనిపిస్తుందా? లేక దేవునికి స్నేహితులవ్వాలని, ఇంకా మంచి స్నేహితులవ్వాలని అనుకుంటున్నారా?

దేవునితో స్నేహం సాధ్యమే

దేవుని స్నేహితులుగా ఆయనతో ఒక మంచి సంబంధం కలిగి ఉండడం సాధ్యమే అని బైబిల్లో ఉంది. దేవుడు, అబ్రాహాము అనే భక్తున్ని “నా స్నేహితుడు” అని పిలిచినట్టు బైబిల్లో ఉంది. (యెషయా 41:8) “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అనే ప్రేమతో కూడిన ఆహ్వానం కూడా యాకోబు 4:8⁠లో ఉంది. కాబట్టి దేవునికి దగ్గరై ఆయనతో స్నేహం చేయడం సాధ్యమేనని అర్థం అవుతుంది. కానీ దేవుడు కనబడడు కదా మరి ఆయనకు స్నేహితులమవడం ఎలా?

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి ముందు మామూలుగా మన మధ్య స్నేహాలు ఎలా మొదలౌతాయో ఆలోచిద్దాం. సాధారణంగా పేర్లు తెలుసుకోవడంతో స్నేహాలు మొదలౌతాయి. తర్వాత తరచుగా మాట్లాడుకుంటూ, ఆలోచనలు-ఇష్టాయిష్టాలు తెలుసుకుంటూ స్నేహం పెంచుకుంటాం. ఒకరి పనుల్లో ఒకరు చేదోడువాదోడుగా ఉన్నప్పుడు ఆ స్నేహబంధం బలపడుతుంది. దేవునితో స్నేహం కూడా అంతే. ఎలానో తెలుసుకుందాం. (w14-E 12/01)