కంటెంట్‌కు వెళ్లు

స్వలింగ వివాహాల గురించి బైబిలు ఏమి చెబుతుంది?

స్వలింగ వివాహాల గురించి బైబిలు ఏమి చెబుతుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 పెళ్లి గురించి ఏ మానవ చట్టం నియమాలు పెట్టకముందే, మన సృష్టికర్త దానికి సంబంధించి ఎన్నో నియమాలను ఇచ్చాడు. బైబిలు మొదటి పుస్తకంలో ఇలా ఉంది: “కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” (ఆదికాండము 2:24) “భార్య” అనే హీబ్రూ పదం “ఒక స్త్రీని మాత్రమే సూచిస్తుంది” అని వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ బిబ్లికల్‌ వర్డ్‌స్‌ చెబుతుంది. “పురుషుడు, స్త్రీ” మాత్రమే పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని యేసుక్రీస్తు కూడా నొక్కి చెప్పాడు.—మత్తయి 19:4.

 అలా, స్త్రీకి-పురుషునికి మధ్య సన్నిహిత, శాశ్వత బంధం ఉండాలనే ఉద్దేశంతో దేవుడు పెళ్లిని ఏర్పాటు చేశాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సహాయపడుతూ తమ భావోద్వేగ, లైంగిక అవసరాలను తీర్చుకుని, పిల్లలను కనాలనే ఉద్దేశంతో స్త్రీని, పురుషుడిని దేవుడు చేశాడు.