కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితం భారంగా తయారైనప్పుడు

జీవితం భారంగా తయారైనప్పుడు

అసలు ఏ కష్టం లేనప్పుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ సమస్యల వల్ల జీవితం భారంగా తయారైతే?

ఉదాహరణకు, అమెరికాలో ఉంటున్న శాలీ * అనే ఆమె తుఫాను వల్ల సర్వం కోల్పోయింది. ఆమె ఇలా అంటోంది: “ఇంతకన్నా ఒత్తిడిని తట్టుకునే శక్తి నాకు లేదని, ఇక సహించడం నావల్ల కాదని అనిపించింది.”

ఒకవేళ మీకు బాగా ఇష్టమైనవాళ్లు చనిపోతే? ఆస్ట్రేలియాలో ఉంటున్న జానస్‌ ఇలా అంటుంది: “మా ఇద్దరు అబ్బాయిలు చనిపోయినప్పుడు నా జీవితం ముక్కలైనట్టు అనిపించింది. నేను దేవునికి ఇలా ప్రార్థించాను: ‘నా గుండె ఇక తట్టుకోలేదు! నాకు చనిపోవాలని ఉంది, ఇక బ్రతకాలని లేదు.’”

డానియెల్‌ విషయానికొస్తే, తన భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు అతను తీవ్రంగా కృంగిపోయాడు. అతనిలా చెప్తున్నాడు: “నా భార్య నమ్మకద్రోహం చేశానని చెప్పినప్పుడు నా గుండెను కత్తితో పొడిచినట్టు అనిపించింది. చాలా నెలలపాటు ఆ విషయం నన్ను పదేపదే బాధించింది.”

కింది పరిస్థితుల్లో జీవితం మీద ఆశ కోల్పోకుండా ఎలా ఉండవచ్చో ఈ కావలికోట పత్రికలో పరిశీలిస్తాం

ముందుగా, విపత్తు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవచ్చో చూద్దాం.

^ ఈ పత్రికలో ఉన్న కొన్ని పేర్లు అసలు పేర్లు కావు.