కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?

1 | పక్షపాతం చూపించకండి

1 | పక్షపాతం చూపించకండి

బైబిలు సలహా:

‘దేవునికి పక్షపాతం లేదు. ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను [చేసేవాళ్లందర్నీ] ఆయన అంగీకరిస్తాడు.’అపొస్తలుల కార్యాలు 10:34, 35.

దానర్థం:

యెహోవా * దేవుడు మనది ఏ దేశం, ఏ జాతి, ఏ రంగు, ఏ సంస్కృతి అనేది చూడడు. ఆయన మన మనసును చూస్తాడు. అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం నిజంగా ఎలాంటివాళ్లం అనేదే చూస్తాడు. మనుషులు మాత్రమే ‘కంటికి కనిపించేదాన్ని చూస్తారు; కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు’ అని బైబిలు చెప్తుంది.—1 సమూయేలు 16:7.

మనం ఏం చేయవచ్చు?

మనమైతే హృదయాల్ని చదవలేం; కానీ దేవునిలాగే మనం కూడా పక్షపాతం లేకుండా అందర్నీ సమానంగా చూడొచ్చు. ఒక వ్యక్తి ఎలాంటివాడు అనేది అతని దేశం, జాతిని బట్టి అంచనా వేయకూడదు. ఒకవేళ ఏదైనా దేశం వాళ్లమీద గానీ, జాతి వాళ్లమీద గానీ మీకు మంచి అభిప్రాయం లేకపోతే ఆ అయిష్టాన్ని పూర్తిగా తీసేసుకోవడానికి సహాయం చేయమని దేవున్ని అడగాలి. (కీర్తన 139:23, 24) పక్షపాతం చూపించకుండా ఉండడానికి సహాయం చేయమని మనస్ఫూర్తిగా అడిగితే, యెహోవా మీ విన్నపాన్ని విని ఖచ్చితంగా సహాయం చేస్తాడు.—1 పేతురు 3:12.

^ పేరా 6 దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.

“నాకు మొదట్లో అసలు తెల్లజాతి వాళ్లంటేనే పడేది కాదు . . . తోబుట్టువుల్లా కలిసివుండే యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్లలో నేనూ ఒకడిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది.”—టైటస్‌