కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయనం చేయడానికి ఐడియాలు

బుద్ధిగా అధ్యయనం చేస్తూ అప్రమత్తంగా ఉండండి

బుద్ధిగా అధ్యయనం చేస్తూ అప్రమత్తంగా ఉండండి

మనం ఎందుకు బుద్ధిగా అధ్యయనం చేయాలో తెలుసుకోవడానికి దానియేలు 9:1-19 చదవండి.

సందర్భాన్ని లోతుగా తవ్వండి. అప్పుడు ఏ సంఘటనలు జరిగాయి, దానియేలుకు ఏం అనిపించింది? (దాని. 5:29–6:5) మీరు దానియేలు స్థానంలో ఉంటే, మీకెలా అనిపించేది?

ఇంకాస్త లోతుగా వెళ్లండి. దానియేలు చదివిన “పవిత్ర గ్రంథాలు” ఏంటి? (దాని. 9:2, అధస్సూచి; w11 1/1 22వ పేజీ, 2వ పేరా) దానియేలు తన పాపాల్ని అలాగే ఇశ్రాయేలు జనాంగం పాపాల్ని క్షమించమని దేవున్ని ఎందుకు అడిగాడు? (లేవీ. 26:39-42; 1 రాజు. 8:46-50; dp 182-184 పేజీలు) దానియేలు దేవుని వాక్యాన్ని బుద్ధిగా చదివే వాడని ఆయన ప్రార్థనలు ఎలా చూపించాయి?—దాని. 9:11-13.

ఏం నేర్చుకోవచ్చు? ఇలా ప్రశ్నించుకోండి:

  • ‘చుట్టూ జరిగే సంఘటనల్ని బట్టి నా ధ్యాస మళ్లకుండా ఎలా చూసుకోవచ్చు?’ (మీకా 7:7)

  • ‘దానియేలులా దేవుని వాక్యాన్ని బుద్ధిగా చదివితే నాకేంటి ప్రయోజనం?’ (w04 8/1 12పేజీ, 17వ పేరా)

  • ‘“అప్రమత్తంగా” ఉండడానికి ఏ అంశాలు నాకు సహాయం చేస్తాయి? నేను వేటి గురించి అధ్యయనం చేయవచ్చు?’ (మత్త. 24:42, 44; w12 8/15 5వ పేజీ, 7-8 పేరాలు)