కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులది ఒక తెగా?

యెహోవాసాక్షులది ఒక తెగా?

 లేదు, యెహోవాసాక్షులది ఒక తెగ కాదు. మేము యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవడానికి, ఆయన బోధల ప్రకారం జీవించడానికి శాయశక్తులా కృషిచేసే క్రైస్తవులం.

ఇంతకీ తెగ అంటే ఏమిటి?

 “తెగ” గురించి ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వాటిలో రెండు సాధారణ అభిప్రాయాలను చూడండి, అవి మాకు ఎందుకు సరిపోవో పరిశీలించండి.

  •   ఏదైనా ఒక కొత్త మతాన్ని లేదా సంప్రదాయ మతానికి భిన్నమైన మతాన్ని తెగ అని కొందరు అంటారు. యెహోవాసాక్షులు ఒక కొత్త మతాన్ని స్థాపించలేదు. కానీ మొదటి శతాబ్దంలో జీవించిన క్రైస్తవులు ఆరాధించిన పద్ధతినే పాటించడానికి మేము కృషిచేస్తాం. వాళ్ల గురించి, వాళ్ల బోధల గురించి బైబిల్లో ఉంది. (2 తిమోతి 3:16, 17) అయితే, ఏది అసలైన మతమనేది నిర్ణయించాల్సింది పరిశుద్ధ లేఖనాల ఆధారంగానే అని మేము నమ్ముతాం.

  •   ఒక మానవ నాయకుడు గల ప్రమాదకర మతశాఖే తెగ అని కొందరు అనుకుంటారు. యెహోవాసాక్షులకు మానవ నాయకుడు లేడు. “క్రీస్తు ఒక్కడే మీ గురువు” లేదా నాయకుడు అని యేసు తన అనుచరుల కోసం పెట్టిన ప్రమాణానికి మేము కట్టుబడివుంటాం.—మత్తయి 23:10.

 యెహోవాసాక్షులది ప్రమాదకరమైన తెగ అస్సలు కాదు. పైగా మా మతం వల్ల మావాళ్లు, సమాజంలోని ఇతరులు ప్రయోజనం పొందుతున్నారు. ఉదాహరణకు, చాలామంది మాదకద్రవ్యాలు, మద్యపాన దుర్వినియోగం వంటి హానికరమైన వ్యసనాలనుండి బయటపడడానికి మా పరిచర్య సహాయం చేసింది. దానితోపాటు, మేము నిర్వహించే అక్షరాస్యతా తరగతుల వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలమంది చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు. అంతేకాదు, విపత్తు సహాయక చర్యల్లో మేము చురుగ్గా పాల్గొంటాం. అలాగే యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించినట్లు, మా సత్ప్రవర్తన ద్వారా ఇతరుల మీద సానుకూల ప్రభావం చూపించడానికి కృషిచేస్తాం.—మత్తయి 5:13-16.