కంటెంట్‌కు వెళ్లు

ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యెహోవాసాక్షులు ఉన్నారు?

ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యెహోవాసాక్షులు ఉన్నారు?

2023 నివేదిక

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఖ్య

88,16,562

సంఘాలు

1,18,177

యెహోవాసాక్షులు ప్రకటనా పని చేస్తున్న దేశాలు

239

2023 గణాంకాలు

దేశాల నుండి, ప్రాంతాల నుండి వచ్చిన 2023 నివేదికలు

యెహోవాసాక్షుల సంఖ్యను మీరు ఎలా లెక్కిస్తారు?

 దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రతీనెల చురుగ్గా ప్రకటించే వాళ్లనే మేము యెహోవాసాక్షులుగా లెక్కిస్తాం. (మత్తయి 24:14) ఇందులో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులైనవాళ్లు, ఇంకా బాప్తిస్మం తీసుకోకపోయినా ప్రకటనా పనిలో పాల్గొనడానికి అర్హులైనవాళ్లు ఉంటారు.

యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఉండాలనుకునే వ్యక్తి డబ్బులు కట్టాలా?

 లేదు. మా సంస్థలో ఒక వ్యక్తి యెహోవాసాక్షి అవ్వాలన్నా, ఏదైనా నియామకం పొందాలన్నా, ప్రత్యేక అవకాశాలు పొందాలన్నా డబ్బు చెల్లించాల్సిన అవసరంలేదు. (అపొస్తలుల కార్యాలు 8:18-20) నిజానికి, చాలామంది తమ పేరు చెప్పకుండా విరాళాలు ఇస్తారు. మా ప్రపంచవ్యాప్త పనికోసం ప్రతీ యెహోవాసాక్షి తమ సమయాన్ని, శక్తిని, వనరులను తమ కోరిక ప్రకారం, తమ పరిస్థితుల మేరకు వెచ్చిస్తారు.—2 కొరింథీయులు 9:7.

ఎంతమంది చురుగ్గా ప్రకటిస్తున్నారో మీకు ఎలా తెలుస్తుంది?

 ప్రతీనెల, యెహోవాసాక్షులు తమ ప్రకటనా పని రిపోర్టును స్థానిక సంఘంలో ఇస్తారు. ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా తమ రిపోర్టు ఇస్తారు.

 సంఘంలో అందరి రిపోర్టుల్ని లెక్కించి, వాటి మొత్తాన్ని స్థానిక బ్రాంచికి పంపిస్తారు. బ్రాంచి కార్యాలయాలు, తమ దేశం లేదా ప్రాంతం రిపోర్టుల మొత్తాన్ని మా ప్రపంచ ప్రధాన కార్యాలయానికి పంపిస్తాయి.

 ప్రతీ సేవా సంవత్సరం చివర్లో, a ప్రతీ దేశంలోనూ ఆ సంవత్సరానికి శిఖరాగ్ర సంఖ్య ఎంతో చూస్తారు. అన్ని దేశాల శిఖరాగ్ర సంఖ్యల్ని కూడితే, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యెహోవాసాక్షులు ఉన్నారో తెలుస్తుంది. పరిచర్యలోని అనుభవాలతో పాటు, ప్రతీ దేశానికి సంబంధించిన పూర్తి రిపోర్టును మా వెబ్‌సైట్‌లో “ప్రపంచమంతటా” అనే సెక్షన్‌ కింద ప్రచురిస్తారు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు అప్పటి నివేదికలు విని ప్రోత్సాహం పొందినట్లే, ఈ రిపోర్టులు మాకు ప్రోత్సాహాన్నిస్తాయి.—అపొస్తలుల కార్యాలు 2:41; 4:4; 15:3.

ప్రకటనా పనిలో పాల్గొనకుండా మీ సంస్థతో సహవసించేవాళ్లను మీరు లెక్కిస్తారా?

 మేము అలాంటివాళ్లను యెహోవాసాక్షుల సంఖ్యలో చేర్చకపోయినా, మా సంఘాల్లోకి వాళ్లను సాదరంగా ఆహ్వానిస్తాం. వాళ్లలో చాలామంది, సంవత్సరానికి ఒకసారి జరిగే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవుతారు. కాబట్టి, ఆ ఆచరణకు హాజరైనవాళ్ల మొత్తం సంఖ్యలో నుండి యెహోవాసాక్షుల సంఖ్యను తీసేస్తే, అలాంటివాళ్లు దాదాపుగా ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. 2023 జ్ఞాపకార్థ ఆచరణకు 2,04,61,767 మంది హాజరయ్యారు.

 మా కూటాలకు హాజరుకాని ఎంతోమంది, మేము నిర్వహించే ఉచిత బైబిలు స్టడీల వల్ల ప్రయోజనం పొందుతుంటారు. మేము 2023 నెలకు సగటున 72,81,212 బైబిలు స్టడీలు చేశాం. కొన్ని స్టడీలు ఒకరికంటే ఎక్కువమందితో జరుగుతాయి.

ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం యెహోవాసాక్షుల సంఖ్య, మీరు చెప్పే సంఖ్య కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు?

 జనాభా లెక్కించే ప్రభుత్వ శాఖలు సాధారణంగా, ప్రజలు ఏ మతానికి చెందినవాళ్లో వాళ్లనే అడిగి లెక్కపెడతాయి. ఉదాహరణకు, అమెరికా జనాభా లెక్కల శాఖ సర్వేలు, “ప్రజలు, తాము ఏ మతానికి చెందినవాళ్లమని చెప్పుకుంటున్నారనే దాన్ని బట్టే సంఖ్యల్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాయి” అని ఆ శాఖ చెప్తోంది. తుది సంఖ్యలు “వాస్తవాల మీద కాకుండా వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడివుంటాయి” అని కూడా అంటోంది. అయితే మేము మాత్రం, యెహోవాసాక్షులమని చెప్పుకునేవాళ్లను కాదుగానీ, ప్రకటనా పని చేస్తూ ఆ పనిని రిపోర్టు చేసేవాళ్లనే యెహోవాసాక్షులుగా లెక్కిస్తాం.

a ఒక సంవత్సరంలోని సెప్టెంబరు 1వ తేదీ నుండి, తర్వాతి సంవత్సరంలోని ఆగస్టు 31వ తేదీ వరకు ఉన్న కాలాన్ని సేవా సంవత్సరం అంటారు. ఉదాహరణకు, 2015 సేవా సంవత్సరం, 2014 సెప్టెంబరు 1వ తేదీన మొదలై 2015 ఆగస్టు 31వ తేదీన ముగుస్తుంది.