కంటెంట్‌కు వెళ్లు

దేవునికి ఒక పేరు ఉందా?

దేవునికి ఒక పేరు ఉందా?

బైబిలు ఇచ్చే జవాబు

 మనందరికీ ఒక పేరుంది. మరి దేవునికి కూడా ఓ పేరు ఉందా? ఇద్దరి మధ్య స్నేహం పెరగడానికి, పేరు తెలుసుకోవడం, పేరుతో పిలవడం ఎంతో అవసరం. మరి దేవునితో స్నేహం చేయాలంటే ఆయన పేరు తెలుసుకోవాలి కదా!

 “యెహోవాను నేనే; ఇదే నా నామము” అని దేవుడు చెప్పాడు. (యెషయా 42:8) “సర్వశక్తిగల దేవుడు,” ‘సర్వోన్నతుడు,’ “సృష్టికర్త” అని దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి. కానీ దేవుడు తన పేరును ఉపయోగించే అవకాశమిచ్చి మనల్ని గౌరవిస్తున్నాడు.—ఆదికాండము 17:1; అపొస్తలుల కార్యములు 4:24, 25; 1 పేతురు 4:19.

 చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు నిర్గమకాండము 6:3 వ వచనంలో ఉంది. అక్కడ ఇలా ఉంది “నేను సర్వశక్తిగల దేవుడు అను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.”

 శతాబ్దాలుగా దేవుని పేరును, జెహోవా [యెహోవా] అని ఇంగ్లీషులో ఉపయోగిస్తున్నాం. చాలామంది విద్వాంసులు “యావే” అని ఉచ్చరించడానికి ఇష్టపడతారు కానీ జెహోవా అనే పేరే బాగా వాడుకలో ఉంది. బైబిలు మొదటి భాగం ఇంగ్లీషులో కాదు గానీ హీబ్రూ భాషలో రాశారు, ఆ భాషను కుడి వైపు నుండి ఎడమ వైపుకు చదువుతారు. ఆ భాషలో దేవుని పేరు నాలుగు హల్లులతో יהוה అని రాస్తారు. హీబ్రూ భాషలో ఉన్న ఆ నాలుగు హల్లులే టెట్రాగ్రామటన్‌ అని అంటారు. వాటిని తెలుగులో రాస్తే యహ్‌వహ్‌ అని అంటారు.