కంటెంట్‌కు వెళ్లు

‘జీవగ్రంథంలో’ ఎవరి పేర్లు ఉంటాయి?

‘జీవగ్రంథంలో’ ఎవరి పేర్లు ఉంటాయి?

బైబిలు ఇచ్చే జవాబు

 ‘జీవగ్రంథంలో,’ నిత్యజీవం అనే బహుమానాన్ని అందుకునే ప్రజల పేర్లు రాసివుంటాయి. (ప్రకటన 3:5; 20:12; మలాకీ 3:16) ఒక వ్యక్తి తనకు ఎంత నమ్మకంగా లోబడతాడనేదాన్ని బట్టి, దేవుడు ఆ పేర్లను నిర్ణయిస్తాడు.—యోహాను 3:16; 1 యోహాను 5:3.

 “జగదుత్పత్తి మొదలుకొని,” దేవుడు తన నమ్మకమైన సేవకులందరి పేర్లను ఒక పుస్తకంలో రాసినట్టుగా తన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. (ప్రకటన 17:8) బహుశా జీవగ్రంథంలో రాయబడిన మొట్టమొదటి పేరు నమ్మకమైన వ్యక్తి హేబెలుదే కావచ్చు. (హెబ్రీయులు 11:4) “జీవగ్రంథం” కేవలం ఒక పేర్ల లిస్టు కాదు. బదులుగా అది, యెహోవా ప్రేమగల దేవుడని, ఆయన “తనవారిని ఎరుగును” అని తెలియజేస్తుంది.—2 తిమోతి 2:19; 1 యోహాను 4:8.

దేవుడు ఎప్పుడైనా జీవగ్రంథంలో నుండి పేర్లను తీసేస్తాడా?

 అవును. తన మాట వినని ప్రాచీన ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఇలా అన్నాడు, “యెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచి వేయుదును.” (నిర్గమకాండము 32:33) కానీ మనం నమ్మకంగా ఉంటే, మన పేర్లు ‘జీవగ్రంథంలో’ ఉంటాయి.—ప్రకటన 20:12.