కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

E+/taseffski/via Getty Images (Stock photo. Posed by model.)

అప్రమత్తంగా ఉండండి!

టీనేజ్‌ పిల్లల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు—బైబిలు ఏం చెప్తోంది?

టీనేజ్‌ పిల్లల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు—బైబిలు ఏం చెప్తోంది?

 సోమవారం, 2023 ఫిబ్రవరి 13న అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీ.డీ.సీ) అనే సంస్థ, ఆ దేశంలోని టీనేజ్‌ పిల్లల మానసిక ఆరోగ్యం గురించి ఒక రిపోర్ట్‌ని విడుదల చేసింది. 16 నుండి 18 వయస్సున్న విద్యార్థుల్లో 40 శాతం కంటే ఎక్కువమంది పిల్లలు దీర్ఘకాలిక బాధ, నిరాశ నిస్పృహల్లో మునిగిపోతున్నారని ఆ రిపోర్ట్‌ చెప్పింది.

 సీ.డీ.సీలోని అడాలసెంట్‌ అండ్‌ స్కూల్‌ హెల్త్‌ విభాగం అధ్యక్షురాలైన డా. క్యాత్లీన్‌ ఎతెయర్‌ ఇలా చెప్తుంది: “గత 10 సంవత్సరాల్లో పిల్లల, యౌవనస్థుల మానసిక ఆరోగ్యం అంతకంతకూ పాడైపోవడాన్ని మేము గమనించాం. అందులోనూ టీనేజ్‌లో ఉన్న అమ్మాయిల మానసిక ఆరోగ్యం ఇంతకుముందుకన్నా ఇప్పుడు ఘోరంగా తయారైంది. చాలామంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ, దానికోసం ప్లాన్‌ చేస్తున్నారు. కొంతమందైతే, ఆత్మహత్య చేసుకునేదాకా కూడా వెళ్తున్నారు.”

 ఆ రిపోర్ట్‌లో ఏముందంటే ...

  •   10 మంది టీనేజ్‌ అమ్మాయిల్లో ఒకరి కంటే ఎక్కువమంది (14 శాతం) ఇష్టంలేకపోయినా సెక్స్‌లో పాల్గొనమని బలవంతం చేయబడ్డారు. డా. క్యాత్లీన్‌ ఎతెయర్‌ ఇలా చెప్తుంది: “ఇది చాలా భయంకరమైన పరిస్థితి! మీకు తెలిసిన ప్రతీ 10 మంది టీనేజ్‌ అమ్మాయిల్లో కనీసం ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువమంది అత్యాచారానికి గురై ఉంటారు.”

  •   ముగ్గురు టీనేజ్‌ అమ్మాయిల్లో కనీసం ఒక్కరు (30 శాతం) ఆత్మహత్య చేసుకోవాలని బలంగా అనుకున్నారు.

  •   ఐదుగురు టీనేజ్‌ అమ్మాయిల్లో కనీసం ముగ్గురు (57 శాతం) దీర్ఘకాలిక బాధలో, నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు.

 ఈ రిపోర్ట్‌లో ఉన్న విషయాలు చూస్తే మన గుండె తరుక్కుపోతుంది. ఆ వయసులో పిల్లలు హాయిగా, ఏ చీకూచింత లేకుండా జీవితాన్ని గడపాలి. అయితే, నేడు టీనేజ్‌ పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుండి బయటపడడానికి వాళ్లకు ఏం సహాయం చేస్తుంది? దీని గురించి బైబిలు ఏం చెప్తోంది?

టీనేజ్‌ పిల్లలకు ఉపయోగపడే సలహాల్ని బైబిలు ఇస్తుంది

 ప్రస్తుతం మనం ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాం. బైబిలు సరిగ్గానే మనం ఉంటున్న రోజుల్ని “ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు” అని పిలుస్తుంది. (2 తిమోతి 3:1-5) అయితే, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది టీనేజ్‌ పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లని అధిగమించడానికి బైబిలు సాటిలేని సలహాల్ని ఇస్తుంది. అలాంటి కొన్ని సలహాల్ని కింది ఆర్టికల్స్‌లో చూడొచ్చు.

 ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో సతమతమౌతున్న టీనేజ్‌ పిల్లల కోసం

 బాధ, డిప్రెషన్‌ లాంటి నెగెటివ్‌ ఫీలింగ్స్‌లో మునిగిపోయిన టీనేజ్‌ పిల్లల కోసం

 ఆన్‌లైన్‌లో గానీ, చుట్టూ ఉన్నవాళ్ల చేత గానీ ఎడ్పించబడుతున్న టీనేజ్‌ పిల్లల కోసం

 లైంగిక వేధింపుల్ని లేదా దాడుల్ని ఎదుర్కొంటున్న టీనేజ్‌ పిల్లల కోసం

తల్లిదండ్రులకు ఉపయోగపడే సలహాల్ని బైబిలు ఇస్తుంది

 జీవితం విసిరే సవాళ్లను టీనేజర్లు తట్టుకుని నిలబడడానికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చో చెప్పే కొన్ని సలహాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి, కింది ఆర్టికల్స్‌ చదవండి.