కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవం ఎలా ప్రారంభమైంది?

జీవం ఎలా ప్రారంభమైంది?

కింద ఇచ్చిన ప్రశ్నకు మీ జవాబు ఏంటి?

జీవం ఎలా వచ్చింది?

  1. పరిణామం వల్ల

  2. సృష్టికర్త వల్ల

 సైన్స్‌ ప్రకారం ఆలోచించే వ్యక్తి “పరిణామం వల్ల” అని జవాబిస్తాడని, దేవుని మీద నమ్మకం ఉన్న వ్యక్తి అయితే “సృష్టికర్త వల్ల” అని జవాబిస్తాడని కొంతమంది అనుకోవచ్చు.

 కానీ అది నిజం కాదు.

 వాస్తవానికి చాలామంది చదువుకున్నవాళ్లు, శాస్త్రవేత్తలు కూడా పరిణామ సిద్ధాంతం ఎంతవరకు నమ్మదగినది అని ప్రశ్నిస్తున్నారు.

 కీటక శాస్త్ర ప్రొఫెసర్‌ జెరార్డ్‌, కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పరిణామ సిద్ధాంతం గురించి నేర్చుకున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “పరీక్షల్లో నా ప్రొఫెసర్లకు కావాల్సిన జవాబులు రాసేవాణ్ణి, కానీ వాళ్లు నాకు నేర్పించిన వాటిని నేను నమ్మలేదు.”

 సైన్స్‌ ప్రకారం ఆలోచించే కొంతమంది జీవం పరిణామం వల్ల వచ్చింది అనే సిద్ధాంతాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు? దానికి జవాబు తెలుసుకోవడానికి, ముందుగా చాలామంది పరిశోధకుల్ని తికమక పెట్టిన రెండు ప్రశ్నల గురించి చూద్దాం. (1) జీవం ఎలా ప్రారంభమైంది? (2) జీవులు ఎలా అభివృద్ధి చెందాయి?

జీవం ఎలా ప్రారంభమైంది?

 కొందరు ఏమంటారు? నిర్జీవ పదార్థాల నుండి ఉన్నట్టుండి హఠాత్తుగా జీవం వచ్చింది.

 కొందరు ఆ జవాబుతో ఎందుకు ఏకీభవించ లేకపోతున్నారు. శాస్త్రవేత్తలకు జీవుల్లోని రసాయనాల గురించి, అణువుల నిర్మాణం గురించి ముందెప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుసు. అయినాసరే జీవం అంటే ఏంటో వాళ్లు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. నిర్జీవ పదార్థానికి, చాలా సులువైన నిర్మాణం ఉన్న జీవ కణానికి మధ్య లెక్కలేనంత తేడా కనిపిస్తుంది.

 వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద బహుశా ఇలాంటి పరిస్థితులు ఉండివుంటాయి అని శాస్త్రవేత్తలు కేవలం ఊహించి చెప్పగలరు. జీవం ఎలా ప్రారంభమైందనే విషయంలో వాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది. జీవం ఒక అగ్ని పర్వతంలో ప్రారంభమైందని కొందరు, సముద్ర అడుగు భాగంలో ప్రారంభమైందని కొందరు అంటారు. ఇంకొందరు జీవానికి అవసరమైన ముఖ్యమైన పదార్థాలు ఈ విశ్వంలో ఇంకెక్కడో తయారై ఉల్కల ద్వారా ఇక్కడికి చేరుకున్నాయని అంటారు. వాళ్ల దృష్టిలో భూమ్మీద కాకుండా ఇంకెక్కడో అంతరిక్షంలో జీవం ప్రారంభమైంది. కానీ జీవం ఎలా ప్రారంభమైందనే ప్రశ్నకు మాత్రం వాళ్లు జవాబు చెప్పలేకపోతున్నారు.

 ఒకప్పుడు కొన్ని అణువులు (molecules) ఉండేవని, అవే జన్యు పదార్థంగా అభివృద్ధి చెందివుంటాయని శాస్తవేత్తలు ఊహిస్తున్నారు. ఈ అణువులకు వేరే వాటితో కలిసినప్పుడు ఏమాత్రం స్పందించని గుణం, తమ లాంటి కొత్త అణువుల్ని తయారు చేసే గుణం ఉండుంటుందని, బహుశా అవే ఉన్నట్టుండి ఇలా అభివృద్ధి చెంది ఉంటాయని వాళ్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఒకప్పుడు అలాంటి అణువులు నిజంగా ఉండేవి అని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. అలాంటి అణువుల్ని ఇప్పటివరకు ఏ లాబ్‌లోనూ శాస్త్రవేత్తలు తయారు చేయలేకపోయారు.

 జీవ కణాలు సమాచారాన్ని భద్రపర్చుకునే విధానం, దాన్ని ఉపయోగించే విధానం సాటిలేనిది. కణాలు జెనెటిక్‌ కోడ్‌లో ఉన్న సమాచారాన్ని చేరవేస్తాయి, అర్థం చేసుకుంటాయి, అందులోని నిర్దేశాల్ని పాటిస్తాయి. కొంతమంది శాస్త్రవేత్తలు జెనెటిక్‌ కోడ్‌లోని సమాచారాన్ని కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌తో, కణంలోని రసాయన నిర్మాణాన్ని కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌తో పోలుస్తారు. కానీ, ఆ సమాచారం ఎక్కడ నుండి వచ్చిందనే విషయాన్ని మాత్రం పరిణామ సిద్ధాంతం చెప్పలేకపోతుంది.

 కణాలు సరిగ్గా పని చేయాలంటే ప్రోటీన్‌ అణువులు చాలా అవసరం. ఒక మామూలు ప్రోటీన్‌ అణువులో వందల అమినో ఆమ్లాలు నిర్దిష్ట క్రమంలో ఉంటాయి. అంతేకాదు, ప్రోటీన్‌ అణువులు సరిగ్గా పని చేయాలంటే ఒక నిర్దిష్టమైన 3డీ ఆకారంలో ముడుచుకుని ఉండాలి. కనీసం ఒక్క ప్రోటీన్‌ అణువు అయినా అనుకోకుండా ఉన్నట్టుండి తయారయ్యే అవకాశాలు చాలాచాలా తక్కువ అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. “సరిగ్గా పనిచేసే ఒక కణానికి వేల రకాల ప్రోటీన్‌లు అవసరం కాబట్టి అది ఏదో అకస్మాత్తుగా దానంతట అదే తయారైపోయిందని అనలేం” అని భౌతిక శాస్త్రవేత్త పాల్‌ డేవిస్‌ అంటున్నాడు.

 ముగింపు. సైన్స్‌లోని దాదాపు అన్ని రంగాల్లో దశాబ్దాలుగా జరిగిన పరిశోధన తర్వాత తేలింది ఏమిటంటే, జీవం అప్పటికే ఉనికిలో ఉన్న జీవం నుండి మాత్రమే వస్తుంది.

జీవులు ఎలా అభివృద్ధి చెందాయి?

 కొందరు ఏమంటారు? మొట్టమొదటి జీవి క్రమక్రమంగా వేర్వేరు జీవులుగా అభివృద్ధి చెందింది. జన్యువుల్లో వచ్చిన అనుకోని మార్పుల (random mutation) వల్ల, ప్రకృతి ఎంపిక (natural selection) వల్ల అలా జరిగింది. మనుషులు కూడా అలానే వచ్చారు.

 కొందరు ఆ జవాబుతో ఎందుకు ఏకీభవించ లేకపోతున్నారు. కొన్ని కణాలు వేరే కణాల కన్నా చాలా సంక్లిష్టంగా ఉంటాయి. సరళమైన కణాలు సంక్లిష్టమైన కణాలుగా అభివృద్ధి చెందడం గురించి మాట్లాడుతూ ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: “జీవం పుట్టుక గురించిన రహస్యం తర్వాత, మనకు అంతుచిక్కని రెండో రహస్యం ఇదే అని చాలామంది అంటారు.”

 ప్రతీ కణంలో ప్రోటీన్‌ అణువులతో తయారైన సంక్లిష్టమైన మెషీన్లు ఉంటాయని, అవన్నీ కలిసి కష్టమైన పనుల్ని చేస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి చేసే పనుల్లో కొన్ని పోషకాల్ని రవాణా చేయడం, వాటిని శక్తిగా మార్చడం, కణాల్లోని భాగాల్ని రిపేరు చేయడం, కణం అంతటా సందేశాల్ని చేరవేయడం. అంత నిర్దిష్టంగా పనిచేసే అవన్నీ తయారవ్వడం, అవి అలా ఖచ్చితంగా పనిచేయడం అనేది జన్యువుల్లో వచ్చిన అనుకోని మార్పుల వల్ల, ప్రకృతి ఎంపిక వల్ల జరిగిందని ఎలా చెప్పగలం? చాలామంది దాన్ని అంగీకరించ లేకపోతున్నారు.

 ఫలదీకరణం చెందిన అండం పెరుగుదల వల్ల జంతువులు పుడతాయి, మనుషులు కూడా అంతే. పిండం లోపల, కణాలు రెట్టింపు అవుతూ క్రమంగా కొన్ని కణాలు ప్రత్యేక రీతిలో మార్పు చెంది వేర్వేరు ఆకారాల్లోకి మారుతూ, వేర్వేరు పనులు చేస్తూ శరీరంలోని అవయవాలుగా ఏర్పడతాయి. తాను ఫలానా అవయవంగా మారాలి, తాను ఆ శరీరంలో ఫలానా చోటికి వెళ్లాలి అనేది ఒక కణానికి ఎలా తెలుస్తుంది అనేది పరిణామ సిద్ధాంతం వివరించ లేకపోతుంది.

 ఒక రకమైన జంతువు మరో రకమైన జంతువుగా మారాలంటే, మార్పు అనేది కణంలో, అణువుల్లో జరగాలనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. పరిణామం వల్ల ఒక సాధారణ కణం ఎలా వచ్చింది అనే విషయాన్నే శాస్తవేత్తలు నిరూపించ లేకపోయినప్పుడు, జన్యువుల్లో వచ్చిన అనుకోని మార్పుల వల్ల, ప్రకృతి ఎంపిక వల్ల ఈ భూమ్మీద వేర్వేరు జంతువులు ఏర్పడ్డాయి అనడానికి ఎలాంటి ఆధారాలున్నాయి? జంతువుల నిర్మాణం గురించి జీవశాస్త్ర ప్రొఫెసర్‌ మైఖల్‌ బేహే ఇలా అంటున్నాడు: ‘ఊహించలేనంత అద్భుతమైన, సంక్లిష్టమైన నిర్మాణం ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అయితే అంత సంక్లిష్టమైన నిర్మాణం అనుకోకుండా, దానంతటదే వచ్చిందని నిరూపించే ఏ ఆధారం ఇప్పటివరకు దొరకలేదు.’

 మనుషులకు పరిసరాల్ని గమనించే సామర్థ్యం, తమనుతాము పరిశీలించుకునే సామర్థ్యం, ఆలోచనా సామర్థ్యం, తర్కించే సామర్థ్యం, తప్పు ఒప్పుల్ని గుర్తించే సామర్థ్యం వంటివి ఉన్నాయి. ఉదార స్వభావం, త్యాగం చేసే గుణం వంటి మంచి లక్షణాలు కూడా మనుషుల్లో ఉన్నాయి. జన్యువుల్లో వచ్చిన అనుకోని మార్పుల వల్ల, ప్రకృతి ఎంపిక వల్ల మనుషుల్లో ఇలాంటి మంచి లక్షణాలు వచ్చాయని ఎలా చెప్పగలం?

 ముగింపు. పరిణామ సిద్ధాంతం అన్నివిధాలా నిరూపించబడింది అని కొంతమంది వాదిస్తున్నా, జీవం ఎలా వచ్చింది, అది ఎలా అభివృద్ధి చెందింది అనే ప్రశ్నలకు అది ఇచ్చే జవాబుల్ని చాలామంది అంగీకరించట్లేదు.

ఈ జవాబును పరిశీలించండి

 ఆధారాల్ని పరిశీలించిన తర్వాత, ఎంతో తెలివైన వ్యక్తి రూపొందించడం వల్లే జీవం వచ్చింది అనే ముగింపుకు చాలామంది వస్తున్నారు. ఒకప్పుడు, దేవుడు లేడని బలంగా వాదించిన ఫిలాసఫీ ప్రొఫెసర్‌ ఆంథనీ ఫ్లూ ఉదాహరణ పరిశీలించండి. జీవుల్లో కనిపించే అద్భుతమైన, సంక్లిష్టమైన నిర్మాణం గురించి, విశ్వంలోని భౌతిక నియమాల గురించి తెలుసుకున్న తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ప్రాచీనకాల తత్వవేత్తల ఆలోచనా తీరు గురించి మాట్లాడుతూ ఆయన ఇలా రాశాడు: ‘ఆధారాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తే మనం అక్కడికి వెళ్లాలి.’ ఆంథనీ ఫ్లూ విషయంలో ఆధారాలు ఆయన్ని సృష్టికర్త ఉన్నాడు అనే ముగింపుకు నడిపించాయి.

 ఈ ఆర్టికల్‌ మొదట్లో పేర్కొన్న జెరార్డ్‌ కూడా అలాంటి ముగింపుకే వచ్చాడు. ఆయన పైచదువులు చదివినా, కీటక శాస్త్రంలో మంచి ఉద్యోగంలో ఉన్నా, ఇలా అన్నాడు: ‘నిర్జీవ పదార్థం నుండి జీవం హఠాత్తుగా దానంతటదే వచ్చిందనడానికి ఎలాంటి రుజువూ నేను చూడలేదు. జీవుల్లో కనిపించే క్రమం, సంక్లిష్ట నిర్మాణం వాటిని క్రమపర్చిన వ్యక్తి, వాటిని డిజైన్‌ చేసిన వ్యక్తి ఉన్నాడని నాకు తెలియజేశాయి.’

 ఒక కళాకారుడు వేసిన చిత్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆ కళాకారుని గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా జెరార్డ్‌ కూడా ప్రకృతిని అధ్యయనం చేయడం ద్వారా సృష్టికర్త లక్షణాల్ని గ్రహించాడు. సృష్టికర్త నుండి వచ్చిన పుస్తకమైన బైబిల్ని కూడా ఆయన పరిశీలించాడు. (2 తిమోతి 3:16) అందులో, మానవజాతి గతానికి సంబంధించిన ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబుల్ని కనుగొన్నాడు, అలాగే ప్రజలు నేడు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల్ని కూడా తెలుసుకున్నాడు. అలా, బైబిలు మన మేధస్సుకు మించిన మూలం నుండి వచ్చిందని ఆయన గ్రహించాడు.

 జెరార్డ్‌ గ్రహించినట్లే, బైబిలు ఇచ్చే జవాబులు పరిశీలించడం ప్రయోజనకరం. వాటిని స్వయంగా పరిశీలించి తెలుసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.