కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9

నేను పరిణామ సిద్ధాంతాన్ని నమ్మాలా?

నేను పరిణామ సిద్ధాంతాన్ని నమ్మాలా?

అది ఎందుకు ప్రాముఖ్యం?

పరిణామ సిద్ధాంతం నిజమైతే, అసలు జీవితానికి అర్థం లేనట్టే. అలా కాకుండా, సమస్తాన్ని దేవుడే చేశాడన్నది నిజమైతే, జీవితానికి, భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సరైన జవాబులు దొరుకుతాయి.

మీరు ఏం చేస్తారు?

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: దేవుడున్నాడని, ఆయనే సమస్తాన్ని సృష్టించాడని అలెక్స్‌ నమ్ముతున్నాడు. కానీ అతని బయోలజీ టీచర్‌ మాత్రం, పరిణామ సిద్ధాంతం నిజమని, దాన్ని సైన్స్‌ కూడా నిరూపించిందని బల్లగుద్ది మరీ చెప్పింది. క్లాస్‌లో అందరిముందు నవ్వుల పాలవ్వడం అతనికి ఇష్టంలేదు. ‘అయినా, పరిణామ సిద్ధాంతం నిజమని సైంటిస్టులే నమ్ముతుంటే, నేనెందుకు సందేహించాలి?’ అని అలెక్స్‌ తనలో తాను అనుకుంటున్నాడు.

అలెక్స్‌ స్థానంలో మీరున్నట్టు ఊహించుకోండి. పరిణామ సిద్ధాంతం నిజమని స్కూల్‌ పుస్తకాలు చెప్పినంత మాత్రాన మీరు దాన్ని నమ్మాలా?

ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!

పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లుగానీ, దేవుడున్నాడని నమ్మేవాళ్లుగానీ, తమ నమ్మకాలు ఏమిటో వెంటనే చెప్తారుగానీ, ఎందుకు అలా నమ్ముతున్నారో మాత్రం చెప్పలేరు.

  • కొంతమంది, దేవుడే అన్నిటిని సృష్టించాడని తమ చర్చిలో చెప్పారు కాబట్టే నమ్ముతారు.

  • మరికొంతమంది, పరిణామ సిద్ధాంతం నిజమని తమ స్కూల్లో చెప్పారు కాబట్టే దాన్ని నమ్ముతారు.

ఆలోచించడానికి ఆరు ప్రశ్నలు

బైబిలు ఇలా చెప్తుంది, ‘ప్రతీ ఇల్లు ఎవరో ఒకరిచేత కట్టబడుతుంది; సమస్తాన్ని కట్టింది దేవుడే.’ (హెబ్రీయులు 3:3, 4) దీన్ని మనం నమ్మవచ్చా?

ఎవరూ కట్టకుండానే ఇల్లు వచ్చిందనడం ఎంత వెర్రితనమో, సృష్టికర్త లేకుండా సమస్తం వచ్చాయనడం కూడా అంతే వెర్రితనం

అపోహ: అకస్మాత్తుగా ఒక పెద్ద విస్ఫోటనం జరగడం వల్ల ఈ విశ్వంలో ఉన్నవన్నీ వచ్చాయి.

1 ఆ విస్ఫోటనానికి కారకులెవరు?

2 మీకేది అర్థవంతంగా అనిపిస్తుంది?—అన్నీ వాటంతటవే వచ్చాయనే మాటా? లేక అన్నిటిని ఏదో ఒకటి లేదా ఎవరో ఒకరు చేశారన్నదా?

అపోహ: మనుషులు జంతువుల నుండి వచ్చారు.

3 మనుషులు జంతువుల నుండి, అంటే కోతుల నుండి వచ్చివుంటే, మనుషుల తెలివితేటలకీ కోతుల తెలివితేటలకీ ఎందుకంత తేడా ఉంది?

4 అతిసూక్ష్మ ప్రాణుల్లో కూడా ఎందుకంత అద్భుతమైన డిజైన్‌ ఉంది?

అపోహ: పరిణామ సిద్ధాంతం నిజమని రుజువైంది

5 ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నవాళ్లు, అది నిజమని స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారా?

6 ‘తెలివైనవాళ్లు పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతారు’ అని ఇతరులు చెప్పడంవల్లే, దాన్ని నమ్మేవాళ్లు ఎంతమంది?

“మీరు అడవిలో నడుస్తూ ఒక అందమైన ఇంటిని చూశారనుకోండి. ‘ఎంత అద్భుతం! చెట్లు కిందపడి సరిగ్గా వాటంతటికవే ఒక ఇల్లులా తయారై ఉంటాయి’ అని మీరు అనుకుంటారా? లేదు! ఎందుకంటే అలా అనుకోవడంలో అర్థమే లేదు. మరి అలాంటప్పుడు ఈ విశ్వంలో ఉన్నవన్నీ వాటంతటవే వచ్చాయని ఎందుకు అనుకోవాలి?”—జూలియా.

“ప్రింటింగ్‌ జరిగే స్థలంలో ఓ పెద్ద పేలుడు జరిగి, అక్కడున్న గోడలమీద, సీలింగ్‌ మీద ఇంక్‌ పడి ఒక అద్భుతమైన డిక్షనరీ తయారైందని ఎవరో మీకు చెప్పారనుకోండి. మీరు నమ్ముతారా?”—గ్వెన్‌.

దేవుణ్ణి ఎందుకు నమ్మాలి?

“మీ ఆలోచనా సామర్థ్యాన్ని” ఉపయోగించమని బైబిలు ప్రోత్సహిస్తుంది. (రోమీయులు 12:1, NW) అంటే,

  • మీ సొంత అభిప్రాయాల వల్లో (ఏదో బలమైన శక్తి ఉందని నాకనిపిస్తుంది)

  • వేరేవాళ్ల అభిప్రాయాల వల్లో (మా మతంలోనివాళ్లు దేవుణ్ణి నమ్ముతారు)

  • మీ అమ్మానాన్నల అభిప్రాయాల వల్లో (దేవుణ్ణి నమ్మాలని మా అమ్మానాన్నలు చెప్పారు)

కాదుగానీ, ఖచ్చితమైన ఆధారాల్నిబట్టి మీ అంతట మీరే దేవుడున్నాడని బలంగా నమ్మాలి.

“మన శరీరం ఎలా పనిచేస్తుందో మా టీచర్‌ చెప్తున్నప్పుడు, దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని నాకు అనిపించింది. శరీరంలో ఉన్న చిన్నచిన్న అవయవాలతో సహా ప్రతీది వాటివాటి పనులు చేస్తాయి. అవి పని చేస్తున్నాయని కనీసం మనకు తెలీను కూడా తెలీదు. నిజంగా మనిషి శరీరం ఒక అద్భుతం!”—తెరీసా.

“ఆకాశాన్ని తాకే భవనాల్ని, పెద్దపెద్ద ఓడల్ని, కారుల్ని చూసినప్పుడు ‘వీటిని ఎవరు చేశారు’ అని ఆలోచిస్తుంటాను. కారులో ఉన్న ప్రతీ చిన్న భాగం సరిగ్గా పనిచేయడంవల్లే కారు నడుస్తుంది. కాబట్టి, ఎవరో తెలివైనవాళ్లే దాన్ని తయారు చేసివుంటారు. ఎవరో ఒకరు తయారు చేస్తేనే కారు వచ్చిందంటే, మనల్ని కూడా ఎవరో ఒకరు తయారు చేసివుండాలి కదా.”—రిచర్డ్‌.

“సైన్స్‌ గురించి ఎక్కువ చదివేకొద్దీ, పరిణామ సిద్ధాంతం మీద నాకున్న నమ్మకం తగ్గిపోయింది. . . . సృష్టికర్తను నమ్మడంకంటే, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మడానికే ఎక్కువ ‘విశ్వాసం’ అవసరమౌతుంది.”—ఆంథోనీ.

ఒక్కసారి ఆలోచించండి

సైంటిస్టులు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నప్పటికీ, పరిణామ సిద్ధాంతానికి సంబంధించి అందర్నీ ఒప్పించే రుజువుల్ని వాళ్లు ఇంకా కనుగొనాల్సి ఉంది. ఎంతో తెలివైన సైంటిస్టులే పరిణామ సిద్ధాంతంలోని అన్ని వివరాల్ని ఒప్పుకోవట్లేదు. అలాంటప్పుడు, ఆ సిద్ధాంతాన్ని మీరు సందేహించడంలో తప్పేముంది?